చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమ్మ జయలలిత జీవితంలో గర్భవతి కాలేదు, ఆస్తి కోసం అమృత డ్రామాలు, వీడియో !

|
Google Oneindia TeluguNews

Recommended Video

జయలలిత కేసులో ఆసక్తికరమైన విషయాలు

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు కుమార్తెలు ఎవ్వరూ లేరని ఆ రాష్ట్ర ప్రభుత్వం మద్రాసు హై కోర్టులో చెప్పింది. జయలలిత ఆమె జీవితంలో ఎప్పుడూ గర్భం దాల్చలేదని, అందుకు సంబంధించిన వీడియో సాక్షాలను తమిళనాడు ప్రభుత్వం మద్రాసు హై కోర్టులో సమర్పించింది.

జయలలిత కుమార్తె

జయలలిత కుమార్తె

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెగా తనను గుర్తించాలని బెంగళూరుకు చెందిన అమృత మద్రాసు హై కోర్టును ఆశ్రయించింది. తాను జయలలిత కుమార్తె అని నిరూపించుకోవడానికి అవకాశం కల్పించాలని

అమృత మద్రాసు హై కోర్టులో మనవి చేసింది.

డీఎన్ఏ పరీక్షలు

డీఎన్ఏ పరీక్షలు

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెను అని నిరూపించుకోవడానికి ఆమె మృతదేహాన్ని బయటకు తీసి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని అమృత మద్రాసు హై కోర్టులో మనవి చేసింది. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని మద్రాసు హై కోర్టు తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

హై కోర్టుకు ఆధారాలు

హై కోర్టుకు ఆధారాలు

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆమె జీవితంలో ఎప్పుడూ గర్భం దాల్చలేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ మద్రాసు హైకోర్టులో వాదించారు. అందుకు సంబంధించిన ఆధారాలను హై కోర్టుకు సమర్పించారు.

ఆస్తి కోసం ఆరోపణలు

ఆస్తి కోసం ఆరోపణలు

అమృత జయలలిత కుమార్తె అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని, కేవలం ఆస్తి కోసమే పిటిషనర్ ఆరోపణలు చేస్తున్నారని తమిళనాడు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ హై కోర్టులో వాదించారు. నిజంగా అమృత జయలలిత కుమార్తె అయితే ఇద్దరు కలిసి తీసుకున్న ఒక్క ఫోటో చూపించాలని విజయ్ నారాయణ్ హై కోర్టులో చెప్పారు.

హై కోర్టుకు వీడియోలు

హై కోర్టుకు వీడియోలు

జయలలితకు తాను 1980లో జన్మించానని అమృత హై కోర్టులో చెప్పింది. ఈ విషయంపై వాదించిన అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ అమృత పుట్టిన తేదీకి నెల రోజుల ముందు జయలలిత ఓ అవార్డుల ఫక్షన్ లో పాల్గొన్నారని, అప్పుడు తీసిన వీడియో ఇదే అంటూ దానిని కోర్టుకు సమర్పించారు.

అనవాళ్లు లేవు

అనవాళ్లు లేవు

అవార్డు ఫక్షన్ లో జయలలితను తీసిన వీడియోలో ఆమె గర్భవతి అని చెప్పడానికి ఎలాంటి అనవాళ్లు లేవని, ఆ సమయంలో తీసిన వీడియోను పరిశీలించాలని అడ్వకేట్ జనరల్ హై కోర్టులో మనవి చేశారు. వాదనలు విన్న హై కోర్టు న్యాయమూర్తి ఎస్. వైద్యనాథన్ విచారణ వచ్చే వారానికి వాయిదా వేశారు.

English summary
Jayalalithaa was never pregnant in her life time, the state government informed the Madras High Court submitting video clips of late Tamil Nadu chief minister dating back to 1980s.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X