చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజేపీలో చేరిన భారత మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్

|
Google Oneindia TeluguNews

చెన్నై: భారత మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ బుధవారం భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరారు. బీజేపీ జాతీయ కార్యదర్శి, తమిళనాడు ఇంఛార్జ్ సీటీ రవి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు ఎల్ మురుగన్ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.

కాగా, శివరామకృష్ణన్ తన 17వ యేటనే వెస్టిండీస్ జట్టుతో తొలి టెస్టు ఆడారు. 9 టెస్టులు ఆడిన ఆయన 26 వికెట్లు తీశారు. 15 ఓడీఐ వికెట్లు కూడా పడగొట్టాడు. 1987లో అంతర్జాతీయ క్రికెట్‌కు విరమణ ప్రకటించిన తర్వాత క్రికెట్ కామెంటరీ చేశారు.

 Tamil Nadu: Former Indian cricketer Laxman Sivaramakrishnan joins BJP

బెన్సన్ అండ్ హెగ్డేస్ వరల్డ్ ఛాంపియన్‌ షిప్ ఆఫ్ క్రికెట్ ట్రయాంప్‌లో శివరామకృష్ణన్ భారత హీరోగా నిలిచారు. ఆయన దాదాపు 20 సంవత్సరాలపాటు కామెంటేటర్ పనిచేశారు. నేషనల్ క్రికెట్ అకాడమీలో స్పిన్ బౌలింగ్ కోచ్ గా కూడా పనిచేశారు. ఐసీసీ క్రికెట్ కమిటీలో కూడా ఆయన విధులు నిర్వహించారు.

వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజేపీలోకి పెరుగుతుండటం ఆ పార్టీకి కొత్త ఉత్సాహాన్నిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ నెలలో రాజకీయ నేతగా మారిన ప్రముఖ నటి ఖుష్బూ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

దేశం అన్ని రంగాల్లో ముందుకు నడవాలంటే ప్రధాని నరేంద్ర మోడీ లాంటి నాయకత్వం అవసరమని ఆమె పేర్కొన్నారు. మోడీ నాయకత్వంలో దేశం సరైన మార్గంలో వెళుతోందని తెలిపారు. ఇటీవల కమలహాసన్ పార్టీ నుంచి కూడా ఓ కీలక నేత బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

English summary
Former Indian cricketer Laxman Sivaramakrishnan on Wednesday joined the Bharatiya Janata Party (BJP) in Chennai in presence of CT Ravi, BJP national secretary in-charge of Tamil Nadu and L Murugan, the president of Tamil Nadu BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X