చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్లైమాక్స్: పన్నీర్ VS శశికళ: జయ స్మారకమండప నిర్మాణానికి దెబ్బ !

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరింది. ఈ ఆధిపత్యపోరు దెబ్బతో అమ్మ జయలలిత స్మారక మండపానికే సమస్యగా మారింది. ఫిబ్రవరి 24వ తేది జయలలిత జయంతి రోజున జరగవలసిన అమ్మ స్మారకమండప శంకుస్థాపన ప్రశ్నార్థకంగా మారిపోయింది.

తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్లంది ఓ దారి, అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ నాటరాజన్ ది ఓ దారి కావడంతో అమ్మ స్మారకమండప నిర్మాణ నమూనా చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. 2016 డిసెంబర్ 5వ తేదిన జయలలిత మరణించడంతో చెన్నైలోని మెరీనా బీచ్ లోని ఎంజీఆర్ సమాధి సమీపంలోనే సమాధి చేశారు.

పన్నీర్ సెల్వం చాణక్య ప్రదర్శన: ప్రశంసల జల్లుపన్నీర్ సెల్వం చాణక్య ప్రదర్శన: ప్రశంసల జల్లు

ఎంజీఆర్ సమాధి సమీపంలోనే తన సమాధి ఉండాలని జయలలిత తన సన్నిహితులతో చెప్పుకునేవారు. జయలలిత సమాధి ఉన్న చోట స్మారకమండపం నిర్మించడానికి తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే రూ. 15 కోట్లు కేటాయిస్తూ జీవో జారీ చేసింది.

జయలలిత స్మారకమండపం నమూనా చిత్రం సిద్దం చేసే బాధ్యతను ఒక ప్రయివేటు అర్కిటెక్ట్ కు అప్పగించారు. జయలలిత స్మారకమంపడం నిర్మాణంపై సీఎం పన్నీర్ సెల్లం ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అర్కిటెక్ట్ తయారు చేసిన స్మారక నమూనా చిత్రాలను ప్రజాపనుల శాఖ అధికారులు సేకరించి ఓ కాపీని సీఎంకు, మరో కాపీని శశికళకు పంపించారు.

Tamil Nadu GOVT, allocates Rs. 15 coree for Jayalalithaa memorial

అయితే సీఎం పన్నీర్ సెల్వం చెప్పినట్లు కాకుండా శశికళ చేసిన మార్పులతో అమ్మ స్మారకమండపం నిర్మాణం పనులు జరగాలని పోయెస్ గార్డెన్ నుంచి ప్రజాపనుల శాఖకు ఆదేశాలు అందాయి. అమ్మ స్మారకమంపడం పనులు ప్రభుత్వం కనుసన్నల్లో జరగాలని సీఎం పన్నీర్ సెల్వం గట్టిగా ఆదేశాలు జారీ చేశారు.

చెన్నైలో జయలలిత మేనకోడలు దీపా కార్యాలయం, శశికళకు ధీటుగా !చెన్నైలో జయలలిత మేనకోడలు దీపా కార్యాలయం, శశికళకు ధీటుగా !

పన్నీర్ సెల్వం, శశికళ చెరోదారిలో ఉండటంతో అమ్మ స్మారకమండపం నమూనా చిత్రం తయారై నెలరోజులు దాటిపోయిన ఓ నిర్ణయం తీసుకోలేక ప్రజాపనుల శాఖ మధ్యలో నలిగిపోతోంది. ఫిబ్రవరి 24వ తేది జయలలిత జయంతి రోజు అమ్మ స్మారకమండపం నిర్మాణానికి శంఖుస్థాపన చెయ్యాలని ముందే నిర్ణయించారు.

జయలలితకు ప్రీతిపాత్రమైన అంశాలను జోడించాలని సీఎం పన్నీర్ సెల్లం ఆర్కిటెక్ట్ కు సూచించారని ప్రజపనుల శాఖకు చెందిన ఓ సీనియర్ అదికారి అంటున్నారు. అయితే సీఎం మాటలు పట్టించుకోకుండా స్మారక నిర్మాణపండపం నమూనా చిత్రం తయారు చెయ్యాలని పోయెస్ గార్డెన్ నుంచి గట్టిగానే ఆదేశాలు జారీ అయ్యాయని అధికారి చెబుతున్నారు.

సీఎం పన్నీర్ సెల్లం, శశికళ మధ్య పొంతనకుదరకపోవడంతో తాము మధ్యలో నలిగిపోతున్నామని ప్రజాపనుల శాఖ అధికారులు అంటున్నారు. ఇప్పటి వరకు జయలలిత స్మారకమండపం నిర్మాణ నమూనా చిత్రమే సిద్దం కాకపోవడంతో జయలలిత జయంతి రోజున శంఖుస్థాపన జరగడం ప్రశ్నార్థకంగా మారిందని ప్రజాపనుల శాఖ అధికారులు అంటున్నారు.

English summary
The Tamil Nadu State government has allotted Rs. 15 crore for the construction of a memorial for former Chief Minister Jayalalithaa near the MGR memorial on the Marina.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X