వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

13మంది మృతి: స్టెరిలైట్ ప్లాంట్ శాశ్వత మూసివేత

|
Google Oneindia TeluguNews

చెన్నై: తూత్తుకుడి ఆందోళనల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. స్టెరిలైట్ ప్లాంటును శాశ్వతంగా మూసివేసేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఆదేశాలు జారీ చేశారు.

కేబినెట్ సమావేశం తర్వాత తమిళనాడు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ ప్లాంట్ కారణంగా స్థానికులు అనారోగ్యానికి గువుతున్నారని, వెంటనే మూసివేయాలంటూ గత కొంత కాలంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Tamil Nadu govt orders closure of Sterlite Plant in Thoothukudi

ఈ క్రమంలో గత కొద్దిరోజులుగా ఈ ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. మే 22న నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 13మంది ఆందోళనకారులు మృతి చెందారు. దీంతో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి.

రాజకీయ పార్టీలు ఆందోళనకారులకు మద్దతుగా నిరసనలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం స్టెరిలైట్ ప్లాంటును శాశ్వతంగా మూసివేయాలని నిర్ణయించింది.

English summary
Tamil Nadu Chief Minister on Monday announced that a government order has been issued to permanently shut down Sterlite Plant at Thoothukudi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X