చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జల్లికట్టు ఆందోళన హింసాత్మకం: పన్నీర్ సెల్వం సంచలన నిర్ణయం

|
Google Oneindia TeluguNews

చెన్నై: జల్లికట్టు ఆందోళన సందర్బంగా చెన్నైలో జరిగిన అల్లర్లకు అసలు కారణం ఎవరు ? అని వెలుగు చూడటానికి మద్రాస్ హైకోర్టు రిటైడ్ జడ్జి నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేయిస్తామని మంగళవారం తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చెప్పారు.

<strong>పన్నీర్ సెల్వం చాణక్య ప్రదర్శన: ప్రశంసల జల్లు</strong>పన్నీర్ సెల్వం చాణక్య ప్రదర్శన: ప్రశంసల జల్లు

జల్లికట్టు ఆందోళన సందర్బంగా చెన్నై మెరీనా బీచ్ రణరంగం అయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఓ పోలీసు స్వయంగా వాహనాలకు నిప్పంటిస్తున్న వీడియో బయటకురావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

Tamil Nadu Jallikattu violence: Retired judge to head probe team

జల్లికట్టు సందర్బంగా జరిగిన ఆందోళనలో హింస చోటు చేసుకోవడానికి ఎవరు కారణం ? అని నిగ్గు తేల్చడానికి హైకోర్టు రిటైడ్ జడ్జితో విచారణ చేయిస్తామని పన్నీర్ సెల్వం స్పష్టం చేశారు. ఆందోళన అల్లర్లుగా మారడానికి పోలీసులు కారణం అయ్యారా ? అని ఆరా తీయ్యాలని సూచించామని సీఎం చెప్పారు.

<strong>చెన్నైలో ఉద్రిక్త పరిస్థితి: స్టాలిన్ మద్దతు, తలపట్టున్న పన్నీర్ !</strong>చెన్నైలో ఉద్రిక్త పరిస్థితి: స్టాలిన్ మద్దతు, తలపట్టున్న పన్నీర్ !

జల్లికట్టు ఆందోళనలో భాగంగా చెన్నై నగరంలో 21 మందితో సహ తమిళనాడులో 36 మంది విద్యార్థులను అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. విద్యార్థుల మీద నమోదు చేసిన కేసులు ఎత్తివేయడానికి న్యాయనిపుణులతో చర్చించి ఆ దిశగా చర్యలు తీసుకుంటామని పన్నీర్ సెల్వం స్పష్టం చేశారు.

English summary
Tamil Nadu Chief Minister O Panneerselvam on Tuesday announced that a commission headed by a retired high court judge would probe allegations of police excess during violence that followed Jallikattu protests in Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X