వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దక్షిణాదిలో బీజేపీని పూర్తిగా నిలువరించిన మూడు రాష్ట్ర్రాలు..

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా సీట్ల ప్రభంజనంలో దూసుకుపోతుంది బీజేపీ. ఈనేపథ్యంలోనే 50 సంవత్సరాల చరిత్రను బీజేపీ తిరగరాసింది. 1971 లో కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ హాయంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ప్రస్థుతం మోడీ ఆ చరిత్రను తిరగరాశారు. ఈనేపథ్యంలోనే దేశంలోని మొత్తం 29 రాష్ట్రాల్లో 26 రాష్ట్రాల్లో పార్టీకి ప్రాతినిధ్యం లభించింది. కాని కాని మూడు రాష్ట్రాల్లో మాత్రం బీజేపీ ఆపార్టీకి ప్రాతినిథ్యం లభించని పరిస్థితి
అవి కూడ దక్షిణభారత దేశంలోనే ఉన్నాయి

6 రాష్ట్ర్రాల్లో బీజేపీ స్వీప్

6 రాష్ట్ర్రాల్లో బీజేపీ స్వీప్


దేశవ్యాప్తంగా మోడీ మ్యానియా పనిచేసింది..దేశంలోని మెజారీటి ప్రజలు నమో అంటూ నరేంద్ర మోడీకి మరోసారి పట్టం కట్టారు. కొన్ని రాష్ట్ర్రాల్లో అయితే మొత్తం సీట్లను బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్ర్రాలతో పాటు ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్ర్రాల్లో మెజారీటీ సీట్లను సాధించిన పరిస్థితి..ఈనేపథ్యంలోనే ఢిల్లి, గుజరాత్, హర్యాణ, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్ర్రాల్లో బీజేపీ మొత్తం పార్లమెంట్ స్థానాలను స్వీప్ చేసింది. మరోవైపు ప్రతిపక్షం బలంగా ఉన్న పశ్చిమబెంగాల్ , మధ్యప్రదేశ్, బిహార్, లాంటీ రాష్ట్ర్రాల్లో సైతం బీజేపీ తన బీజేపీ తన బలాన్ని నిరూపించుకుంది.

మూడు రాష్ట్ర్రాల్లో ఖాత తెరవని బీజేపీ

మూడు రాష్ట్ర్రాల్లో ఖాత తెరవని బీజేపీ


కాని దేశంలోని మూడు రాష్ట్ర్రాల్లో మాత్రం బీజేపీ తన ఖాతను తెరవ లేకపోయింది. దేశవ్యాప్తంగా 26 రాష్ట్ర్రాల్లో మోడీ ,అమిత్ షాలు తమ ప్రభావాన్ని చూపించినా దక్షిణాది రాష్ట్ర్రాలైన,కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రాల్లో మాత్రం తన ఖాతాను తెరవలేక పోయింది. కాగా తమిళనాడులో 39 పార్లమెంట్ స్థానాలు ఉండగా, కేరళలో 20, ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. మూడు రాష్ట్ర్రాల్లోని 84 స్థానాల్లో పోటి చేసిన బీజేపీ ఒక్క సీటును కూడ కైవసం చేసుకోలేకపోయింది.

దక్షిణాదీలో సగం రాష్ట్ర్రాల్లోనే బీజేపీ ప్రాతినిథ్యం

దక్షిణాదీలో సగం రాష్ట్ర్రాల్లోనే బీజేపీ ప్రాతినిథ్యం

ఈనేపథ్యంలో మూడు రాష్ట్ర్ర్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాంది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 25 స్థానాలకుగాను 24 స్థానాలు గెలుపోందింది. కాగా తమిళనాడులో బీజేపీ అధికార అన్నాడీఎంకే తో పోత్తులో బాగాంగా పోటీ చేసింది.కాగా తమిళనాడు ప్రతిపక్ష డీఎంకే కాంగ్రెస్ అలయెన్స్ విజయం సాధించింది.రాష్ట్ర్రంలోని మొత్తం 39 స్థానాలకు గాను డీఎంకే 23 స్థానాలు గెలుపోందగా కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలను కైవసం చేసుకుంది. కేరళ కూడ ఇదే పరిస్థితి కాంగ్రెస్ పోత్తులో ఉన్న యూడిఎఫ్ విజయం సాధించగా అక్కడ కనీసం ఒక్క సీటు కూడ సాధించలేదు.

మొత్తం మీద దేశవ్యాప్తంగా .437 స్థానాల్లో స్వంతంగా పోటి చేసిన బీజేపీ విపక్షాలతో కలిసి 350 స్థానాల మార్కుకు చేరింది. కాని మూడు రాష్ట్ర్రాల్లో మొత్తం 50 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ ఒక్క స్థానాన్ని కేవసం చేసుకోలేకపోయింది.

English summary
While the country is awash with a Modi tsunamo, Tamil Nadu,kerala,and andrapradesh have bucked the trend. thease three states electorate have given a massive mandate to the DMK-led alliance ,udf ,ycp in the states
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X