చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పిల్లలు హత్య, కామాంధురాలిపై గూండా చట్టం, నో బెయిల్, లాయర్లు, జైలే గతి, ప్రియుడు!

|
Google Oneindia TeluguNews

చెన్నై: ప్రియుడి వ్యామోహంలో కన్నబిడ్డలకు విషం ఇచ్చి దారుణంగా హత్య చేసిన కిరాతకురాలు చెన్నై కుండ్రత్తూరు నివాసి అభిరామి మీద కఠిన చర్యలు తీసుకోవాలని, ఆమె బయటకు రాకుండా గూండా చట్టం కింద కేసు నమోదు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. కామాంధురాలికి, ఆమె ప్రియుడికి బెయిల్ ఇప్పించకూడదని లాయర్లు నిర్ణయించారని సమాచారం.

పిల్లల హత్య: ప్రియుడితో కన్ను గీటు వీడియో కాల్స్, మలయాళం నటికి పోటీ: వైరల్!పిల్లల హత్య: ప్రియుడితో కన్ను గీటు వీడియో కాల్స్, మలయాళం నటికి పోటీ: వైరల్!

తమిళనాడుకు చెందిన ప్రముఖ న్యాయవాది తమిళ వెందన్ చెన్నై నగర పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. పిల్లలును అతికిరాతకంగా చంపడం నేరమని, అభిరామి మీద గూండా చట్టం కింద కేసు నమోదు చెయ్యాలని న్యాయవాది తమిళవెందన్ చెన్నై నగర పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.

కన్నబిడ్డలు

కన్నబిడ్డలు

గత శుక్రవారం సాయంత్రం సాటి చిన్నారులతో కలిసి ఆడుకుంటున్న సమయంలో అభిరామి ఆమె బిడ్డలు అజయ్ (7), కారుణిక (4)ను ఇంటిలోకి తీసుకెళ్లింది. తరువాత పాలల్లో విషం కలిసి చిన్నారులకు ఇచ్చింది. విషం కలిపిన పాలు తాగిన ఇద్దరు పిల్లలు కొట్టుమిట్టాడుతూ మరణించారని న్యాయవాది తమిళవెందన్ అన్నారు.

చచ్చిపోయారా ?

చచ్చిపోయారా ?

అజయ్, కారుణిక బెడ్ రూంలో కొట్టుమిట్టాడుతూ చివరిశ్వాస విడిచిపెట్టారు. కన్నబిడ్డలు కొట్టుమిట్టాడుతున్న దృశ్యాలను కామాంధురాలు కనికరం లేకుండా చూసింది. తరువాత బిడ్డలు చనిపోయారా ? లేదా ? అంటూ అభిరామి దృవీకరించుకుందని పోలీసుల విచారణలో ఇప్పటికే వెలుగు చూసిందని న్యాయవాది తమిళవెందన్ గుర్తు చేశారు.

మరో హత్యకు కుట్ర !

మరో హత్యకు కుట్ర !

ఎవరినైనా హత్య చెయ్యాలని ప్లాన్ వేస్తే అది క్రిమినల్ కేసు అవుతోందని న్యాయవాది తమిళవెందన్ అన్నారు. ఇద్దరు బిడ్డలను హత్య చెయ్యడం, భర్తను హత్య చెయ్యడానికి ప్లాన్ వెయ్యడం క్షమించరాని నేరమని, అందుకే అభిరామి మీద గూండా చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయవాది తమిళవెందన్ డిమాండ్ చేస్తున్నారు.

ఇంటికి వెళ్లిన విజయన్

ఇంటికి వెళ్లిన విజయన్

తన ఇద్దరు బిడ్డలు అజయ్, కారుణిక అంత్యక్రియలు నిర్వహించిన అభిరామి భర్త విజయన్ అలియాస్ విజయ్ ఇన్ని రోజులు సొంత ఊరిలోనే ఉన్నారు. ఇద్దరు బిడ్డలు హత్యకు గురై నేటికి (శనివారం) వారం రోజులు అయ్యింది. అభిరామి భర్త విజయన్ శనివారం చెన్నైలోని కుండ్రత్తూరులోని ఇంటికి వెళ్లాడు.

బెయిల్ ఇవ్వలేం

బెయిల్ ఇవ్వలేం

అభిరామికి బెయిల్ ఇవ్వడానికి ఆమె భర్త విజయన్, తండ్రి సౌందర్ రాజన్ ఇప్పటికే నిరాకరించారు. అభిరామి తరపున కేసు వాదించకూడాదని ఇప్పటికే పలువురు న్యాయవాదులు నిర్ణయించారు. బెయిల్ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాకపోవడం, అభిరామి తరపున వాదించకూడదని న్యాయవాదులు నిర్ణయించడంతో కామాంధురాలు సెంట్రల్ జైలుకే పరిమితం అయ్యే అవకాశం ఉంది.

చీకటి జీవితం

చీకటి జీవితం

భర్త, పిల్లలను హత్య చేసి కేరళ వెళ్లి ప్రియుడితో కలిసి జల్సా చెయ్యాలని ప్లాన్ వేసిన అభిరామి నేడు చెన్నై శివార్లలోని సెంట్రల్ జైలులో ఉంది. కామంతో కళ్లు మూసుకుపోయి ఎవ్వరూ చెయ్యకూడని పని చేసిన అభిరామి జీవితం చీకటిలో కూరుకుపోయింది. సాటి ఖైదీలు సైతం అభిరామి పట్ల జాలి చూపించడం లేదని జైలు సిబ్బంది అంటున్నారు.

English summary
Tamil Nadu Lawyer Tamilvendan has given complaint to Chennai police commissioner about Abirami.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X