వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెప్టన్ విజయ్ కాంత్ దిమ్మతిరిగింది: అన్నా డబ్బుల్లేవు

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో స్థానిక సమరంకు అన్నా డీఎంకే, డీఎంకే, డీఎండీకే పార్టీలు సిద్దం అవుతున్నాయి. అయితే డీఎండీకే వర్గాలకు జీవన్మరణ సమస్యగా మారింది. మాదగ్గర డబ్బులు లేవు మీరే దిక్కు అంటూ డీఎండీకే నేతలు కెప్టన్ విజయ్ కాంత్ దగ్గర వాపోతున్నారు.

ఇంత వరకు మేము ఇల్లు, వాకిలి తాకట్టు పెట్టి పార్టీ కోసం పని చేశామని, ఇప్పుడు మా ఆర్థిక పరిస్థితి దీనంగా ఉందని చెప్పడంతో విజయకాంత్ దిమ్మతిరిగింది. విజయ్ కాంత్ డీఎండీకే పార్టీ పెట్టిన సమయంలో అన్నాడీఎంకే, డీఎంకేలకు ప్రత్యామ్నాయ శక్తిగా పుంజుకుంది.

ఆ సందర్బంలో సినీ అభిమానం ఆయన వెంట నడిచింది. 2011లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎదిగారు. అయితే అమ్మ జయలలితతో విభేదాలు రావడంతో డీఎండీకే బయటకు వచ్చింది. ఆ పార్టీ నాయకులకు అప్పటి నుంచి ఆర్థికంగా దెబ్బ మీద దెబ్బ పడింది.

Vijayakanth

2016 తమిళనాడు శాసన సభ ఎన్నికల్లో డీఎండీకే చావుదెబ్బతినింది. ఆ దెబ్బతో డీఎండీకే పార్టీ నుంచి చాల మంది నాయకులు బయటకు వెళ్లిపోయారు. ఉన్న నాయకులను కాపాడుకోవడానికి కెప్టన్ విజయ్ కాంత్ నానా తంటాలు పడ్డారు.

స్థానిక ఎన్నికలకు సిద్దం కావాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చెన్నైలోని కోయంబేడులోని డీఎండీకే పార్టీ కార్యాలయంలో అందరి దగ్గర కెప్టన్ అభిప్రాయాలు సేకరించారు. స్థానిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చెయ్యాలా ? పొత్తు పెట్టుకోవాలా? అసలు పోటీ ఎందుకు చెయ్యాలి? అనే కోణాల్లో చర్చించారు.

ఆ సందర్బంలో అభిప్రాయాలు చెబుతున్న నాయకులు తమ ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ఈ సారి మీరే మాకు అన్ని సమకూర్చాలని మనవి చేశారు. అందరి అభిప్రాయాలు సేకరించిన విజయ్ కాంత్ తాను సూచించిన వ్యక్తికి మీరు మద్దతు ఇవ్వాలని అన్ని జిల్లాల నాయకులను ఆదేశించారు.

నేను ఇంతే, నారూటే సపరేటు అంటూ విజయ్ కాంత్ కార్యకర్తలకు చెబుతున్నారు. అంతలో మాత్రానికి మమ్మల్ని ఇంత దూరం ఎందుకు పిలిచినట్లు అని పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు.

మొత్తం మీద స్థానిక ఎన్నికల్లో విజయ్ కాంత్ సొంత డబ్బుతో కార్యకర్తలను పోటీలో దించుతారా ?ఆర్థిక స్థితి బాగున్న వారిని రంగంలోకి దింపుతారా ? అని కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. విజయ్ కాంత్ తో పొత్తు పెట్టుకోవడానికి ద్రవిడ పార్టీలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

English summary
DMDK chief Vijayakanth today exhorted party workers to take a vow to work for people's welfare and turn challenges into achievements.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X