చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దుబాయ్ మొగుడు, ఎస్ఐ ప్రియుడు, రూ. కోట్ల ఆస్తితో ఎంజాయ్, భార్య, ప్రియుడి ఫోటోలు తీశాడని దాడి!

|
Google Oneindia TeluguNews

చెన్నై: దుబాయ్ లో ఉద్యోగం చెయ్యడానికి వెళ్లిన సమయంతో తన భార్య అక్రమ సంబంధం సాగించిందని, తరువాత తాను న్యాయం కావాలని కోర్టు చుట్టూ తిరుగుతున్న సమయంలో తనను వేధింపులకు గురి చేసిన సబ్ ఇన్స్ పెక్టర్ (ఎస్ఐ)ని ప్రశ్నించగా తన మీద దాడి చేశాడని ఓ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య సబ్ ఇన్స్ పెక్టర్ అక్రమ సంబంధం సాగించి తన రూ. కోట్ల విలువైన ఆస్తిని కాజేయడానికి ప్రయత్నిస్తోందని, తనకు ప్రాణహాని ఉందని భర్త పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశాడు. తన మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని సదరు ఎస్ఐ కూడా భర్త మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

నీ భార్య నాకు, నా భార్య నీకు, రాత్రి ఎంజాయ్ చేద్దాం రా, వ్యాపారవేత్తల కొత్త డీల్, బ్లాక్ మెయిల్!నీ భార్య నాకు, నా భార్య నీకు, రాత్రి ఎంజాయ్ చేద్దాం రా, వ్యాపారవేత్తల కొత్త డీల్, బ్లాక్ మెయిల్!

దుబాయ్ లో ఉద్యోగం

దుబాయ్ లో ఉద్యోగం

చెన్నైలోని కేకే నగర్ భారతీ దాసన్ కాలనీకి చెందిన జనార్దన్ దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నాడు. జనార్దన్ కు చెన్నైలో కూడా కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. జనార్దన్ కు భార్య నందిని, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న జనార్దన్ ఎక్కువగా చెన్నైలో ఉండలేకపోతున్నాడు. నర్మదా తన ఇద్దరు పిల్లలతో కలిసి చెన్నైలోనే నివాసం ఉంటోంది.

భార్య ఫోన్ ఎప్పుడూ ఎంగేజ్

భార్య ఫోన్ ఎప్పుడూ ఎంగేజ్

దుబాయ్ లో ఉంటున్న జనార్దన్ భార్య నర్మదా, తన ఇద్దరు పిల్లలతో ఫోన్ లో మాట్లాడటానికి ప్రయత్నించిన సమయంలో ఆమె ఫోన్ ఎప్పుడూ ఎంగేజ్ వస్తోందని, బిజీబిజీ అనివస్తోందని తెలిసింది. ఇదే విషయంలో జనార్దన్ చాలా సార్లు విసిగిపోయాడని సమాచారం. తనతో కాకుండా తన భార్య నర్మదా ఎవరితో మాట్లాడుతోంది ? అనే అనుమానం జనార్దన్ లో మొదలైయ్యింది.

ఎస్ఐతో అక్రమ సంబంధం

ఎస్ఐతో అక్రమ సంబంధం

గత మే నెలలో జనార్దన్ దుబాయ్ నుంచి చెన్నై వచ్చాడు. ఆ సమయంలో భార్య నర్మదా ప్రవర్తనపై జనార్దన్ కు అనుమానం కలిగింది. ఎప్పుడు పడితే అప్పుడు ఇంటి నుంచి బయటకు వెలుతున్న నర్మదాను భర్త జనార్దన్ నిలదీశాడు. అదే సమయంలో చెన్నైలోని తిరునిండ్రవూర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్ పెక్టర్ రాజేష్ కుమార్ తో నర్మదాకు అక్రమ సంబంధం ఉందనే విషయం బయటపడింది.

ఊరు మొత్తం తెలిసింది

ఊరు మొత్తం తెలిసింది

నర్మదా, సబ్ ఇన్స్ పెక్టర్ రాజేష్ కుమార్ ల అక్రమ సంబంధం గురించి తిరునిండ్రవూర్ ప్రాంతం మొత్తం తెలిసిందని, అయినా వారు మాత్రం పట్టించుకోవడం లేదని జనార్దన్ కు అతని స్నేహితులు చెప్పారు. ఈ విషయంపై కలత చెందిన జనార్దన్ భార్య నర్మదాపై మండిపడ్డాడు. పద్దతి మార్చుకోకపోతే ఫలితం వేరుంగా ఉంటుందని భార్య నర్మదాను భర్త జనార్దన్ హెచ్చరించాడు. అయినా నర్మదా మాత్రం పట్టించుకోలేదు.

నా డబ్బుతో నాభర్య, ఎస్ఐ జల్సాలు

నా డబ్బుతో నాభర్య, ఎస్ఐ జల్సాలు

నర్మదా తీరు మారకపోవడంతో జనార్దన్ తనకు భార్యతో విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించాడు. తాను విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నానని, అక్కడ సంపాధించిన డబ్బులు తన భార్య నర్యదాకు పంపిస్తున్నానని, అంతే కాకుండా చెన్నైలోని తన వ్యాపార సంస్థల్లో వస్తున్న లాభాలను సైతం ఆమె తీసుకుంటున్నదని, ఆ డబ్బుతో ఎస్ఐ రాజేష్ కుమార్ తో జల్సాలు చేస్తోందని జనార్దన్ కోర్టులో చెప్పాడు.

తాగుబోతు మొగుడు ఆస్తి తగలేశాడు

తాగుబోతు మొగుడు ఆస్తి తగలేశాడు

తన భర్త జనార్దన్ మద్యంకు, జూదానికి బానిస అయ్యాడని, రూ. కోట్ల రూపాయలు ఆస్తిని ఇలాగే తగలేశాడని నర్మదా ఆరోపిస్తున్నది. రూ. కోట్ల రూపాయలు అప్పులు పెరిగిపోవడంతో తన కుటుంబ సభ్యులు మమ్మల్ని కాపాడి ఆస్తులు విడిపించారని నర్మదా కోర్టులో చెప్పారు. జనార్దన్, నర్మదా విడాకుల కేసు కోర్టులో విచారణలో ఉంది.

ఎస్ఐ, నర్మదా రాసలీలలు !

ఎస్ఐ, నర్మదా రాసలీలలు !

రెండు రోజుల క్రితం జనార్దన్ భార్య నర్మదా, సబ్ ఇన్స్ పెక్టర్ రాజేష్ కుమార్ చెన్నైలోని రామాపురం కలశత్తమ్మన్ ఆలయం సమీపంలోని ఓ చోట రాసలీలలు సాగిస్తున్నారని సమాచారం. విషయం తెలుసుకున్న జనార్దన్ నేరుగా అక్కడికి వెళ్లి నర్మదా, ఎస్ఐ రాజేష్ కుమార్ లు కిలిసి ఉన్న సమయంలో ఫోటోలు తీశాడు. విషయం గుర్తించిన ఎస్ఐ రాజేష్ కుమార్ కు మండిపోవడంతో నర్మదా భర్త జనార్దన్ మీద దాడి చేశాడు.

మొగుడు, ప్రియుడు ఫిర్యాదులు

మొగుడు, ప్రియుడు ఫిర్యాదులు

తన మీద తన భార్య నర్మదా ప్రియుడు ఎస్ఐ రాజేష్ కుమార్ దాడి చేశాడని, తనకు రక్షణ కల్పించి న్యాయం చెయ్యాలని జనార్దన్ రాయలా నగర్ పోలీసులకు, చెన్నై సిటీ పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశాడు. తన మీద జనార్దన్ దురుసుగా ప్రవర్తించాడని ఎస్ఐ రాజేష్ కుమార్ అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పబ్లిక్ స్థలంలో జనార్దన్ మీద ఎస్ఐ రాజేష్ కుమార్ దాడి చేశాడని, ఫోటోలు తీసిన వ్యవహారంలో జనార్దన్ మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారి థామ్సన్ జార్జ్ మీడియాకు చెప్పారు.

English summary
Tamil Nadu man complaint against wife and SI in Chennai commissioner office and enquiry is going on it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X