వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళ ఫ్యామిలీని ఛీకొట్టిన జయలలిత: ఆ సీడీలు మళ్లీ విడుదల, పళని, పన్నీర్ ప్లాన్ !

శశికళను గతంలో విమర్శించిన అమ్మ జయలలిత, ఇప్పుడు మరో సారి ప్రజల్లోకి నేడు వీడియో టేపులు ఉన్న సీడీలు విడుదల చేసిన తమిళనాడు ప్రభుత్వం మేమే కాదు గతంలో అమ్మ మన్నార్ గుడిని ఛీకొట్టారు, అన్నాడీఎంకే ప్రభ

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ రెబల్ రాజకీయాల్లోకి దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను దించారు. అన్నాడీఎంకే పార్టీలో శశికళ, ఆమె కుటుంబ సభ్యుల పెత్తనాన్ని మేమే కాదు గతంలో అమ్మ జయలలిత కూడా వ్యతిరేకించారని ప్రజల్లో ప్రచారం చెయ్యాలని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం నిర్ణయించింది.

శశికళకు షాక్: పళని, పన్నీర్ స్కెచ్: దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ, వేటు ?శశికళకు షాక్: పళని, పన్నీర్ స్కెచ్: దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ, వేటు ?

శశికళ, ఆమె కుటుంబ సభ్యలను విమర్శిస్తూ గతంలో జయలలిత చేసిన విమర్శలు ఉన్న వీడియోలను సీడీల రూపంలో తయారు చేసిన తమిళనాడు ప్రభుత్వం ఇప్పుడు ప్రజల్లో ప్రచారం చెయ్యడానికి సిద్దం అయ్యింది. జయలలిత శశికళ, ఆమె కుటుంబ సభ్యులను జయలలిత బహిరంగంగా విమర్శించిన వీడియోలు ఉన్న రెండు సీడీలను తమిళనాడు మంత్రి ఆర్ బీ. ఉదయ్ కుమార్ మీడియా ముందు విడుదల చేశారు.

అమ్మ స్వయంగా ఛీకొట్టారు

అమ్మ స్వయంగా ఛీకొట్టారు

జయలలిత స్వయంగా శశికళ, టీటీవీ దినకరన్, దివాకరన్ తదితరులను వ్యతిరేకించారని, ఇప్పుడు మేము కొత్తగా వ్యతిరేకించడం లేదని మంత్రి ఉదయ్ కుమార్ అంటున్నారు. శశికళ, ఆమె కుటుంబ సభ్యులను జయలలిత తీవ్రస్థాయిలో విమర్శించారని, ఛీకొట్టి బయటకు గెంటేశారని మంత్రి ఉదయ్ కుమార్ గుర్తు చేశారు.

రెండు సీడీలు

రెండు సీడీలు

2011 డిసెంబర్ 30వ తేదీన అన్నాడీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశంలో శశికళ కుటుంబ సభ్యుల మీద జయలలిత చేసిన వ్యాఖ్యలు ఒక సీడీలో ఉన్నాయని మంత్రి ఉదయ్ కుమార్ చెప్పారు. 2013 నవంబర్ 10వ తేదీన ఎడప్పాడి పళనిసామి కుటుంబ సభ్యుల వివాహ వేడుకలో జయలలిత మరో సారి శశికళ కుటుంబ సభ్యులను విమర్శిస్తూ చేసిన ప్రసంగం మరో సీడీలో ఉందని మంత్రి ఉదయ్ కుమార్ అన్నారు.

పదవుల కోసం చస్తున్నారు

పదవుల కోసం చస్తున్నారు

జయలలిత బహిష్కరించిన వారందరూ ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీని హస్తగతం చేసుకుని పదవులు పంచుకోవడానికి పోటీ పడుతున్నారని మంత్రి ఉదయ్ కుమార్ విమర్శించారు. శశికళ, ఆమె కుటుంబ సభ్యులు అందర్నీ పార్టీకి దూరం చెయ్యడానికి నాయకులు, కార్యకర్తలు సహకరించాలని మంత్రి ఉదయ్ కుమార్ మనవి చేశారు.

మాకు దక్కంది ఎవ్వరికీ దక్కకూడదు

మాకు దక్కంది ఎవ్వరికీ దక్కకూడదు

పార్టీని, ముఖ్యంమంత్రి పదవిని తమ నుంచి ఎడప్పాడి పళనిసామి హైజాక్ చేశారని టీటీవీ దినకరన్ రగిలిపోతున్నారు. తమకు దక్కనిది ఎవ్వరికీ దక్కకూడదనే ఉద్దేశంతో ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి టీటీవీ దినకరన్ తెర వెనుక ప్రతిపక్షాలతో కలిసి పని చేస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి.

ప్రజలే శశికళను ఛీకొట్టాలని ప్లాన్

ప్రజలే శశికళను ఛీకొట్టాలని ప్లాన్

శశికళ, ఆమె కుటుంబ సభ్యులను ప్రజల్లో అప్రతిష్టపాలు చెయ్యాలని ఎడప్పాడి పళనిసామి నిర్ణయించారు. శశికళ, ఆమె కుటుంబ సభ్యులను స్వయంగా అమ్మ జయలలిత ఎంతో వ్యతిరేకించారో మరో సారి గుర్తు చెయ్యడానికి ఇప్పుడు సీడీలను తెరమీదకు తీసుకు వచ్చారు.

English summary
Minister RB Udayakumar has released a CD on Sasikala family during the press meet today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X