వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు, ఎన్నికల కమిషన్ ప్రకటన, డేట్ ఫిక్స్, ఢీ అంటే ఢీ!

|
Google Oneindia TeluguNews

చెన్నై: అమ్మ జయలలిత మరణంతో ఖాళీ అయిన చెన్నైలోని ఆర్ కే నగర్ శాసన సభ నియోజక వర్గం ఉప ఎన్నికల తేదీని భారత ఎన్నికల కమిషన్ అధికారులు ప్రకటించారు. శుక్రవారం ఢిల్లీలోని భారత ఎన్నికల కమిషన్ సీనియర్ అధికారులు ఈ విషయంపై చర్చలు జరిపి తునిర్ణయం తీసుకోవడంతో తమిళనాడు ప్రభుత్వం జోరుమీద ఉంది.

పళని, పన్నీర్ సుదీర్ఘ చర్చలు, శశికళ మంత్రులకు మంగళం, చిన్నమ్మ గ్యాంగ్ కు షాక్, పార్టీలో!పళని, పన్నీర్ సుదీర్ఘ చర్చలు, శశికళ మంత్రులకు మంగళం, చిన్నమ్మ గ్యాంగ్ కు షాక్, పార్టీలో!

తమిళనాడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లఖోని ఢిల్లీలో మకాం వేసి పై అధికారులతో చర్చించారు. డిసెంబర్ 21వ తేదీన ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు, డిసెంబర్ 24వ తేదీ కౌంటింగ్ నిర్వహిస్తామని భారత ఎన్నికల కమిషన్ తెలిపింది. ఆర్ కే నగర్ తో పాటు ఉత్తరప్రదేశ్ లోని సికంద్రా, పశ్చిమ బెంగాల్ లోని సంబంగ్ నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు అదే తేదీలో నిర్వహిస్తున్నారు.

Tamil Nadu officer in New Delhi to decide RK Nagar by poll date

డిసెంబర్ 31వ తేదీలోగా ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు నిర్వహించాలని మద్రాసు హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మద్రాసు హై కోర్టు డెడ్ లైన్ తో భారత ఎన్నికల కమిషన్ శుక్రవారం ఈ నిర్ణయం తీసుకుంది. గురువారం రెండాకుల చిహ్నం సొంతం చేసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం జోరుమీద ఉన్నారు.

తమిళనాడు సీఎం సంతోషం: అందరూ కలిసే చిహ్నం సాధించాం, బీజేపీని ఆశ్రయించలేదు!తమిళనాడు సీఎం సంతోషం: అందరూ కలిసే చిహ్నం సాధించాం, బీజేపీని ఆశ్రయించలేదు!

ఆర్ కే నగర్ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని తమిళనాడు ప్రభుత్వం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నది.

ఆర్ కే నగర్ లో పోటీ చెయ్యడానికి ప్రధాన ప్రతిపక్షం డీఎంకే పార్టీ కసరత్తులు చేస్తున్నది. అన్నాడీఎంకే పార్టీ నుంచి శాస్వతంగా బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ సైతం ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని అంటున్నారు.

English summary
The next big thing in Tamil Nadu politics is going to be the by-election to RK Nagar Assembly constituency, which is lying vacant following the death of former CM Jayalalithaa. According to sources, the date for the by-poll will be announced today, as Tamil Nadu chief electoral officer Rajesh Lakhoni is in New Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X