వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోషల్ మీడియాలో 100 మంది అమ్మాయిలు, ఆంటీల టార్గెట్, ల్యాప్ టాప్ లో రహస్యాలు, గుండా యాక్ట్, బెండ్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై/నాగర్ కోవిల్: తండ్రి సంపాధిస్తున్న డబ్బుతో విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తూ తినింది అరగక కండలు పెంచి ఆ ఫోటోలతో అమాయకులైన అమ్మాయిలు, ఆంటీలను మోసం చేసిన యువకుడి భాగోతం రోజుకు ఒకటి బయటకు వస్తోంది. సోషల్ మీడియాను టార్గెట్ చేసుకుని సుమారు 100 మందికి పైగా అమ్మాయిలు, ఆంటీలను మోసం చేసిన కాశీ అలియాస్ సుజి అలియాస్ సుక్కు అలియాస్ బాబు (26)పై రోజుకు ఒకరు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటి వరకు 10 మందికిపైగా అమ్మాయిలు కాశీ మీద ఫిర్యాదు చేశారని, అతని మీద గుండా యాక్ట్ చట్టం, అమ్మాయిలను మోసం చేశాడని, నగదు, నగలు లూటీలు చేశాడని కేసులు నమోదు చేశామని కన్యాకుమరి జిల్లా ఎస్పీ ఎన్. శ్రీనాథ్ తెలిపారు.

lockdown murder: ఫ్రెండ్ తల్లితో బెడ్ రూంలో రాసలీలలు, అడ్డంగా నరికేసి, మర్మాంగం కత్తిరించి!lockdown murder: ఫ్రెండ్ తల్లితో బెడ్ రూంలో రాసలీలలు, అడ్డంగా నరికేసి, మర్మాంగం కత్తిరించి!

కామాంధుడు కాశీ

కామాంధుడు కాశీ

చెన్నైలోని ప్రముఖ లేడీ డాక్టర్ ఫిర్యాదు మేరకు నాగర్ కోవిల్ గణేశపురంకు చెందిన తంగపాండియన్ కుమారుడు కాశీ అలియాస్ సుజ్జి (26) మీద కేసు నమోదు చేశారు. లేడీ డాక్టర్ ఫిర్యాదు చెయ్యడంతో ఇప్పటికే కొత్తార్ పోలీసులు కాశీని అరెస్టు చేశారు. అమ్మాయిలు, ఆంటీలను మోసం చేశానని స్వయంగా కాశీ పోలీసుల విచారణలో అంగీకరించాడు.

అమ్మాయిలు, ఆంటీల నగలు నగదు లూటీ

అమ్మాయిలు, ఆంటీల నగలు నగదు లూటీ

నాగర్ కోవిల్ ప్రాంతానికి చెందిన ఓ వివాహిత మహిళను కాశీ మోసం చేశాడని వెలుగు చూసింది. రెండు సంవత్సరాల క్రితం నాగర్ కోవిల్ కు చెందిన వివాహిత మహిళను నమ్మించి ఆమెను లొంగదీసుకుని రాసలీలలు సాగించాడని, తరువాత రహస్యంగా తీసిన నగ్న వీడియోలు, ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి ఆమె దగ్గర భారీ మొత్తంలో నగదు, రూ. 2. 50 లక్షల విలువైన బంగారు నగలు లూటీ చేశాడని కన్యాకుమరి జిల్లా ఎస్పీ ఎన్. శ్రీనాథ్ తెలిపారు.

గుండా చట్టం కింద కేసులు

గుండా చట్టం కింద కేసులు

మొదట చెన్నై లేడీ డాక్టర్ ఫిర్యాదు మేరకు కాశీ మీద మొదటి కేసు నమోదైయ్యింది. తరువాత నాగర్ కోవిల్ వివాహిత మహిళతో పాటు ఇప్పటి వరకు 10 మందికి పైగా బాధితులు ఫిర్యాదు చెయ్యడంతో కాశీ మీద గుండా యాక్ట్ చట్టంతో పాటు, మహిళలను మోసం చేశాడని, బ్లాక్ మెయిల్ చేసి నగదు, నగలు లూటీ చేశాడని, అమ్మాయిలు, మహిళల ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేశాడని అనేక సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశామని పోలీసు అధికారులు అంటున్నారు.

సోషల్ మీడియాలో 100 మంది టార్గెట్

సోషల్ మీడియాలో 100 మంది టార్గెట్

నాగర్ కోవిల్ నివాసి కాశీ ప్రతిరోజు తినింది అరగక జిమ్ కు వెళ్లి కండలు పెంచుతున్నాడు. ఇలా కండలు పెంచిన శరీరంతో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాడు. ఫేస్ బుక్ ఇన్ స్ట్రా గామ్, వాట్సాప్ తదితర గ్రూప్స్ లో కాశీ అతని నిజమైన ఫోటోలతో పాటు నకిలీ ఫోటోలు పోస్టు చేసి అమ్మాయిలు, ఆంటీలతో పరిచయం పెంచుకున్నాడు. ఎప్పుడు చిత్తకార్తి కుక్కలా అమ్మాయిలు, ఆంటీల వెంటపడ్డాడు. ఇలా సుమారు 100 మందికిపైగా అమ్మాయిలు, ఆంటీలకు సోషల్ మీడియాలోనే కామాంధుడు కాశీ వల వేశాడు.

పరువు పోతుందనే భయంతో !

పరువు పోతుందనే భయంతో !

అమ్మాయిలతో పరిచయం పెంచుకున్న కాశీ తరువాత వారిని రహస్య ప్రాంతాలకు, స్నేహితుల ఇళ్లకు, ఫాం హౌస్ లు, పర్యాటక ప్రాంతాలకు పిలుచుకుని వెళ్లి వారితో రాసలీలలు సాగించాడు. రాసలీలలు సాగిస్తున్న సమయంలో అమ్మాయిలు, ఆంటీల నగ్న ఫోటోలు, వీడియోలు తీశాడు. అమ్మాయిలు, ఆంటీలతో ఎక్కడికి పడితే అక్కడికు వెళ్లి ఇంతకాలం ఎంజాయ్ చేశాడు. తరువాత నగ్న వీడియోలు, ఫోటోలు, మార్ఫింగ్ చేసిన ఫోటోలు, వీడియోలతో వారిని బెదిరించాడు. ఎక్కడ పరువు పోతుందో అనే భయంతో అమ్మాయిలు, వివాహిత మహిళలు కాశీ అడిగినంత డబ్బులు, నగలు ఇచ్చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

పోలీసు యూనీఫాం, వెనుక నోట్ల కట్టలు

పోలీసు యూనీఫాం, వెనుక నోట్ల కట్టలు

కాశీ ఖరీదైన దస్తులతో పాటు పోలీసు యూనీఫాం వేసుకుని ఫోటోలు తీసుకున్నాడని, వెనుక బ్యాక్ డ్రాప్ లో నోట్ల కట్టలతో ఉన్న ఫోటోలు తీసి తాను కోటీశ్వరుడు అని అమాయకులైన అమ్మాయిలను మోసం చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఇప్పటి వరకు సుమారు 10 మంది బాధితులు మాత్రమే కాశీ మీద ధైర్యంగా ఫిర్యాదు చేశారని, అతని వలన మోసపోయిన వారు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు చెయ్యాలని తమిళనాడు పోలీసులు అంటున్నారు.

ల్యాప్ టాప్ లు, మొబైల్స్ లో రహస్యాలు !

ల్యాప్ టాప్ లు, మొబైల్స్ లో రహస్యాలు !

నాగర్ కోవిల్ లో ప్రముఖ స్వీట్ స్టాల్ యజమాని కొడుకు ఇంటిలో, మరో ముగ్గురు స్నేహితుల ఇళ్లలో సోదాలు చెయ్యడంతో కాశీకి చెందిన ల్యాప్ టాప్ లు, సీక్రెట్ మొబైల్ వాచ్ లు, మొబైల్ ఫోన్లు, రెండు హార్డ్ డిస్క్ లు చిక్కడంతో వాటిని స్వాధీనం చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు వాటిని పరిశీలించారు. కాశీ ఎంత మంది అమ్మాయిలు, వివాహిత మహిళలను మోసం చేశాడు అనే కొన్ని ఆధారాలు అతనికి సంబంధించిన ల్యాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లు, సీక్రెట్ మొబైల్ వాచ్ లో చిక్కాయని పోలీసులు అంటున్నారు. కాశీని కస్టడీకి తీసుకుని బెండ్ తీస్తే మొత్తం వ్యవహారం బయటకు వస్తుందని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు.

English summary
Tamil Nadu: One more case against sexual predator Nagercoil Kasi, Nagercoil youth arrested for uploads obscene pictures of Chennai female doctor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X