వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాసిస్తా.. మోడీకి కరోనా సోకింది:ముందు ఆయనకు కరోనా టెస్ట్ చేయించండి:ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చి.

|
Google Oneindia TeluguNews

చెన్నై: దేశవ్యాప్తంగా ప్రజలందరినీ భయాందోళనలకు గురి చేస్తోన్న అంశం.. ఢిల్లీ మత ప్రార్థనలు. దేశ రాజధానిలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ మసీదు భవన సముదాయంలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ సామూహిక మత ప్రార్థనల వల్ల దేశంలో కరోనా వైరస్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయనే వాదనలుు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ ప్రార్థనల్లో పాల్గొన్న వారితో పాటు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు స్వచ్ఛందంగా వైద్య పరీక్షలను నిర్వహించుకోవాలంటూ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.

మత ప్రార్థనలకు వెళ్లొచ్చి.. దురుసుగా..

మత ప్రార్థనలకు వెళ్లొచ్చి.. దురుసుగా..

ఈ పరిస్థితుల్లో కొందర్ని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించినప్పటికీ.. వారు వైద్య పరీక్షలను నిర్వహించుకోవడానికి నిరాకరిస్తున్నారు. పైగా సంబంధిత అధికారులు, సిబ్బందిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని, దౌర్జన్యానికి దిగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలకు నిజం కలిగించే ఉదంతం ఇది. తమిళనాడులో చోటు చేసుకుంది. ఢిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొని స్వస్థలానికి చేరుకున్న ఓ వ్యక్తిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించడానికి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అనుమానితుడి ఇంటికి వెళ్లగా.. అతను దురుసుగా ప్రవర్తించాడు.

రాసిస్తా.. మోడీకి కరోనా ఉంది:

తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్య పరీక్షలను చేయించుకోబోనని తేల్చి చెప్పారు. కరోనా వైరస్ వైద్య పరీక్షలను నిర్వహించాల్సింది తనకు కాదని, మొదట ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆరోగ్యాన్ని చెక్ చేయాలని కౌంటర్ అటాక్‌కు దిగాడు. మోడీ ఇప్పటికే 150 దేశాలు తిరిగొచ్చారని, ఆయన ఆరోగ్యాన్ని పరీక్షించండని వైద్య శాఖ సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. నరేంద్ర మోడీకి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి, ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వానికి కరోనా వైరస్ సోకిందని ధ్వజమెత్తారు. అవసరమైతే ఈ విషయాన్ని తాను రాసిస్తానని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

కనీస బాధ్యత లేదంటోన్న నెటిజన్లు..

కనీస బాధ్యత లేదంటోన్న నెటిజన్లు..

వైరస్ పరీక్షలను నిర్వహించుకోవడానికి నిరాకరిస్తోన్న ఆ వ్యక్తి పట్ల నెటిజన్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కనీస బాధ్యత లేకుండా ప్రవర్తించడం సరికాదని హితవు పలుకుతున్నారు. దేశంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తాయో.. ఎలాంటి విపత్తును ఎదుర్కొంటోందనే కనీస విజ్ఙతల లేకుండా వ్యవహరించడం మంచిది కాదని చెబుతున్నారు. బలవంతంగానైనా ఆయనకు కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి వల్లే దేశవ్యాప్తంగా వైరస్ అదుపు తప్పిందని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైద్య పరీక్షలను చేయించుకోవడానికి సహకరించాలని అంటున్నారు.

English summary
Tamil Nadu person who attend Markaz prayers alleged Prime Minister Narendra Modi should check first Covid 19 Coronavirus test first. He says that he will given a written letter that Narendra Modi, Tamil Nadu Chief Minister and Deputy CM Edappadi Palaniswamy and O Panneerselvam have Coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X