వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

facebook: మణిరత్నం సినిమాలో మలుపులు, బాంబు వేసి ప్రియుడి కిడ్నాప్, విలన్ ప్రియురాలే, 2 లక్షలు !

|
Google Oneindia TeluguNews

చెన్నై/తిరుచ్చి: ఫేస్ బుక్ లో పరిచయం అయిన యువతి తన కోరిక తీర్చాలని యువకుడిని రెచ్చగొట్టింది, యువతి మీద యువకుడు మనసు పారేసుకున్నాడు. అదే సమయంలో మణిరత్నం తెరకెక్కించిన ముంబాయి సినిమా గుర్తు చేసుకున్న ఆ యువకుడు అరవిందస్వామి లెవల్లో రెచ్చిపోయాడు. అయితే అవతల ఉన్నది ముంబాయి సినిమాలోని మనిషా కోయిరాల కాదని, అదే మణిరత్నం దిల్ సే సినిమాలోని మరో మనిషా కోయిరాల అని గుర్తించలేకపోయాడు. అంతే ఫేస్ బుక్ లవర్ చెప్పిన ప్రాంతానికి ఎగరేసుకుంటు వెళ్లిన యువకుడిని రెండు నాటు బాంబులు వేసి కిడ్నాప్ చేసిన కిలాడీ లేడీ గ్యాంగ్ అతని దూలతీర్చేసి రూ. 2 లక్షల విలువైన బైక్, డబ్బులు లాక్కొని అతనితో అసభ్యంగా మాట్లాడించి ఆ వీడియోలు రికార్డు చేసి అతని జీవితంతో ఫుట్ బాల్ ఆడుకున్నారు.

Illegal affair: మరిది మసాజ్, వదిన వన్స్ మోర్, ఏక్ మార్ తీన్ తుకుడా, అడ్డంగా లేపేసిన అన్న!Illegal affair: మరిది మసాజ్, వదిన వన్స్ మోర్, ఏక్ మార్ తీన్ తుకుడా, అడ్డంగా లేపేసిన అన్న!

 బ్యానర్స్ ప్రింటింగ్ ప్రెస్ యజమాని

బ్యానర్స్ ప్రింటింగ్ ప్రెస్ యజమాని

తమిళనాడులోని కడలూరు జిల్లా బర్రూట్టి సమీపంలోని చెట్టిపాలయం ప్రాంతంలో నివాసం ఉంటున్న వెట్రిసెల్వన్ కుమారుడు వినోద్ కుమార్ (31) అనే యువకుడు బర్రూట్టి ప్రాంతంలో సొంతంగా బ్యానర్స్, ఫ్లెక్సీలు తయారు చేసే ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేస్తూ చేతినిండా డబ్బలు సంపాధిస్తున్నాడు.

 హీరోయిన్ ఎంట్రీ

హీరోయిన్ ఎంట్రీ

తమిళనాడులోని తిరుచ్చిలోని కాజమలైలో నివాసం ఉంటున్న నజీర్ అహమ్మద్ కుమార్తె రహమతున్నిసా (20) అనే యువతి ఫేస్ బుక్ ద్వారా వినోద్ కుమార్ జీవితంలోకి ప్రవేశించింది. ఫేస్ బుక్ లో పరిచయం అయిన వినోద్ కుమార్, రహమతున్నిసా పిచ్చపాటిగా చాటింగ్ చేసుకున్నారు. ఒకరి ఫోన్ నెంబర్లు ఒకరు తీసుకుని గంటల తరబడి ఈ ప్రపంచాన్ని మరిచిపోయి మాట్లాడుకున్నారు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఒకరు అంటే ఒకరు ఐలవ్ యూ అంటు చెప్పుకుని ప్రేమలోపడ్డారు.

 మణిరత్నం సినిమాలో మలుపులు

మణిరత్నం సినిమాలో మలుపులు

తాను ముంబాయి సినిమాలో అరవిందస్వామి అని, తన ప్రియురాలు రహమతున్నిసా మనిషాకోయిరాల అంటూ ప్రియుడు వినోద్ కుమార్ ఊహించుకున్నాడు. అయితే అదే మణిరత్నం తెరకెక్కించిన దిల్ సే సినిమాలో తన ప్రియురాలు మనిషా కోయిరాల అని గుర్తించలేకపోయాడు. ఇక మొబైల్ డేటా ఫ్రీ అంటూ ఇద్దరు సోషల్ మీడియాలోనే కాలం గడిపేశారు.

 నా కోరిక తీరుస్తావా ?

నా కోరిక తీరుస్తావా ?

తనకు నీ మీద కోరిక ఉందని, మనం నేరుగా కలుసుకుంటే నా కోరికలు మొత్తం తీర్చుకుంటానని, నువ్వు ఎలాగైనా నన్ను కలవాలని రహమతున్నిసా రొమాన్స్, కామంతో మాట్లాడుతూ వినోద్ కుమార్ కు వలవేసింది. అయితే కరోనా వైరస్, లాక్ డౌన్ దెబ్బతో మూడు నెలలుగా ఇద్దరూ ఫేస్ బుక్ లో టచ్ లో లేరు. 10 రోజుల క్రితం మళ్లీ ఇద్దరు ఫేస్ బుక్ టచ్ లోకి వచ్చారు. అక్కడి నుంచి ప్రతిరోజు కొన్ని గంటలు ఇద్దరు ఫేస్ బుక్ లోనే కాలం గడుపుతున్నారు.

 రూ. 2 లక్షల బైక్, బాంబులు వేసి కిడ్నాప్

రూ. 2 లక్షల బైక్, బాంబులు వేసి కిడ్నాప్

తిరుచ్చిలోని మన్నార్పురం ప్రాంతంలోని ఆర్మీ గ్రౌండ్స్ దగ్గర తనను కలవాలని వినోద్ కుమార్ కు అతని ప్రియురాలు రహమతున్నిసా చెప్పింది. తన కోరికలు మొత్తం తీరుపోతాయని మురిసిపోయిన వినోద్ కుమార్ అతను ఉపయోగిస్తున్న రూ. 2 లక్షల విలువైన లగ్జరీ బైక్ వేసుకుని తిరుచ్చిలోని ఆర్మీగ్రౌండ్స్ దగ్గరకు వెళ్లి ప్రియురాలు రమహమతున్నిసా కోసం వేచి చూశాడు. అదే సమయంలో ఆటోల్లో ఆర్మీ గ్రౌండ్స్ దగ్గరకు వెళ్లిన 8 మంది యువకులు వినోద్ కుమార్ పై రెండు నాటు బాంబులు వేసి అతన్ని బెదిరించి అదే ఆటోల్లో కిడ్నాప్ చేసి వెనుక అతని బైక్ నడుపుకుంటూ అక్కడి నుంచి పారిపోయారు.

 రూ. 2 లక్షలుడబ్బులు ఇవ్వురా బాడ్కోవ్

రూ. 2 లక్షలుడబ్బులు ఇవ్వురా బాడ్కోవ్

తిరుచ్చిలోని WOC రోడ్డులోని తిరుచ్చి సంగమం హోటల్ ఎదురుగా ఉన్న ఇంట్లో వినోద్ కుమార్ ను కట్టేశారు. తరువాత ఏటీఎంలో రూ. 2 లక్షలు డబ్బులు డ్రా చేసి ఇస్తే నిన్ను వదిలేస్తామని, లేదంటే నిన్ను చంపేస్తామని బెదిరించారు. తన ప్రియురాలు రహమతున్నిసా పిలిస్తే ఇక్కడికి వచ్చానని, తన దగ్గర అంత డబ్బులు లేవని వినోద్ కుమార్ కుయ్యోమర్రో అన్నాడు. వినోద్ కుమార్ ఏటీఎం కార్డులు. రూ. 2 లక్షల విలువైన బైక్ లాక్కొన్న దుండుగులు అతన్ని చితకబాది తీసుకెళ్లి తిరుచ్చిలోని ఎంజీఆర్ సర్కిల్ లో వదిలిపెట్టి పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయారు.

 ప్రియురాలు విలన్

ప్రియురాలు విలన్

రూ. 2 లక్షల బైక్, ఏటీఎం కార్డులు లూటీ కావడంతో వినోద్ కుమార్ తిరుచ్చిలోని కేకే నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు వినోద్ కుమార్ ఇచ్చిన మొబైల్ నెంబర్ ఆధారంగా కిలాడీ లేడీ రహమతున్నిసా, ఆమె అనుచరులు నివాస్ (26), పాదయాచి ప్రాంతంలో నివాసం ఉంటున్న మహమ్మద్ యాసూర్ (22) అనే ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ లో మరో ఐదు మంది ఉన్నారని, వారు తప్పించుకున్నారని పోలీసులు చెప్పారు. తన లవ్ స్టోరీలో ప్రియురాలు రహమతున్నిసా విలన్ అని తెలుసుకున్న వినోద్ కుమార్ తన ప్రాణాలకు ముప్పు ఉందని తిరుచ్చి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు విచారణ చేస్తున్నారు.

English summary
facebook lovers: Tamil Nadu Police arrested a gang who kidnaps youth and get money by introducing a young girl to them through Facebook.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X