వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిసార్ట్ లో ఎమ్మెల్యేలను విచారిస్తున్న రెవెన్యూ, పోలీసు అధికారులు

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు సీఎం కుర్చీలాట తారాస్థాయికి చేరింది. రిసార్ట్ లో మకాం వేసిన ఎమ్మెల్యేలను పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నారు. మహాబలిపురం సమీపంలోని కోవత్తూరులోని రిసార్ట్ దగ్గరకు శనివారం పోలీసు బలగాలు చేరుకున్నాయి.

<strong>దెబ్బకు దెబ్బ: పన్నీర్ సెల్వం గూటికి లోక్ సభ ఎంపీలు: శశికళ పని!</strong>దెబ్బకు దెబ్బ: పన్నీర్ సెల్వం గూటికి లోక్ సభ ఎంపీలు: శశికళ పని!

అదనపు డీఎస్పీ తమిళ్ సెల్వన్, డీఆర్వో రామచంద్రన్ నేతృత్వంలో భారీ పోలీసు బలగాలతో వెళ్లిన అధికారులు ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో మాట్లాడి వివరాలు సేకరిస్తున్నారు. రిసార్టుకు వాళ్లంతట వాళ్లే వచ్చారా ? ఎవరైనా బలవంతంగా తీసుకు వచ్చారా ? అంటూ ఆరా తీస్తున్నారు.

Tamil Nadu police conducting inquiries with AIADMK legislators staying in resort

అంతే కాకుండా ఎమ్మెల్యేలు అందరూ రాతపూర్వకంగా చెప్పాలని పోలీసులు అడుగుతున్నారు. ఎమ్మెల్యేలను ఎవరైనా నిర్బంధిస్తే అదిచాల పెద్ద నేరం అవుతుందని, వెంటనే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను మాముందు హాజరుపరచాలని శుక్రవారం మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

<strong>జయలలిత ఆత్మ శాంతించే వరకు శశికళ సీఎం కాలేరంట!</strong>జయలలిత ఆత్మ శాంతించే వరకు శశికళ సీఎం కాలేరంట!

సోమవారానికల్లా ఎమ్మెల్యేల విషయంలో పూర్తి సమాచారం మాకు ఇవ్వాలని మద్రాసు హైకోర్టు తమిళనాడు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకిదిగారు. శశికళ అనుచరులు నిజంగా ఎమ్మెల్యేలను నిర్బంధించి ఉంటే మాత్రం వారి కథ కంచికి చేరుతుందని అన్నాడీఎంకేలోని ఓ వర్గం నాయకులు అంటున్నారు.

English summary
led by additional deputy superintendents of police Tamilselvan and district revenue officer Ramachandran, reached the resort around 6.30am, and began independent inquires with each and every MLA staying in the resort.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X