వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలో తొలి లింగమార్పిడి పోలీసు అధికారి: అలుపెరగణి పోరాటం !

దేశంలోనే తొలి ట్రాన్స్ జెండర్ (లింగమార్పిడి) సబ్ ఇన్స్ పెక్టర్ గా తమిళనాడులోని సేలంకు చెందిన ప్రతికా యాషిని ధర్మపురి పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విధులలో చేరారు. తనకు ఇష్టం అయిన పోలీసు అధికారి ఉద్యోగం

|
Google Oneindia TeluguNews

చెన్నై/ధర్మపురి: దేశంలోనే తొలి ట్రాన్స్ జెండర్ (లింగమార్పిడి) సబ్ ఇన్స్ పెక్టర్ (ఎస్ఐ)గా తమిళనాడుకు చెందిన ప్రతికా యాషిని బాధ్యతలు చేపట్టారు. సేలం జిల్లాకు చెందిన ప్రతికా యాషిని ధర్మపురి పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విధులలో చేరారు.

చెన్నైలోని తాంబరంలో ఉన్న పోలీసు ఉన్నత శిక్షణ కేంద్రంలో శిక్షణ ముగించుకున్న 1,031 మందిలో ప్రతికా యాషిని ఒకరు. ఒక ఏడాది పాటు శిక్షణ పొందిన ప్రితికా యాషిని ధర్మపురి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఉద్యోగం పొందారు.

ధర్మపురి చేరుకున్న ఆమె అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ప్రితికా యాషిని ఎంతో కష్టపడి న్యాయపోరాటం చేసి తనకు నచ్చిన పోలీసు ఉద్యోగం సంపాధించుకున్నారు. ప్రితికా యాషినిలో అంతులేని ఆత్మస్థైర్యం దాగుంది.

తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన ప్రితికా యాషిని తొలుత పురుషుడే. తనలోని స్త్రీ లక్షణాలు అధికంగా ఉన్నాయని గుర్తించి వైద్య ప్రక్రియ ద్వారా లింగమార్పిడి చేసుకుని మహిళగా మారారు. 2015లో ఎసైల ఎంపిక కోసం ప్రకటన జారీ అయ్యింది.

Tamil Nadu: Prithika Yashini, India’s first transgender SI

ప్రితికా యాషిని ఎస్ఐ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. ట్రాన్స్ జెండర్ అన్న కారణంతో ఆ దరఖాస్తును తమిళనాడు యూనిఫార్మ్ డ్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు తిరస్కరించింది. ఏమాత్రం కుంగిపోని ప్రితికా యాషిని మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది.

ప్రితికా యాషిని పిటిషన్ విచారణకు స్వీకరించిన మద్రాసు హైకోర్టు మొదట రాత పరీక్షకు ఆమెను అనుమతి ఇవ్వాలని ఆదేశించింది. రాత పరీక్షల్లో ఆమె ఉత్తీర్ణత సాధించింది. అయితే దేహదారుఢ్య పరీక్ష రూపంలో మరో అడ్డంకి వచ్చింది.

పరుగు పందెంలో భాగంగా 17.5 సెకన్లలో చేరుకోవాల్సిన 100 మీటర్ల పరుగుల దూరాన్ని 18.08 సెకన్లలో చేరుకోవడంతో ప్రితికా యాషిని ఉత్తీర్ణత సాధించలేకపోయిందని పోలీసు శాఖ ప్రకటించింది. అయినా ప్రితికా యాషిని వెనకడుగు వేయలేదు.

మళ్లీ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన పరుగు పందెం ఎంపికకు సంబంధించిన వీడియోను పరిశీలించాలని కోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు మళ్లీ 100 మీటర్ల పరుగు పందెం నిర్వహించగా అందులో ఆమె విజయం సాధించింది.

పోలీసు శాఖలో శిక్షణ పూర్తి చేసుకుని ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించడంతో దేశంలోనే మొదటి లింగమార్పిడి పోలీసు అధికారిగా రికార్డు సృష్టించారు. దేశంలో మొదటి లింగమార్పిడి ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ఆమెకు డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ తో సహ అనేక మంది నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

English summary
K Prithika Yashini, 26, scripted history on Sunday when she took charge as sub inspector in Dharmapuri district in Tamil Nadu. For, Yashini is the first transsexual to enter into uniform service in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X