వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైటెక్ వ్యభిచారం: అమ్మాయిలకు పొర్న్ పాఠాలు చెప్పిన లేడీ ప్రొఫెసర్ అరెస్టు, జైలు, గేమ్స్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై: డిగ్రీ కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు చెప్పి వారిని హైటెక్ వ్యభిచారం చెయ్యాలని ఒత్తిడి చేసిందని నమోదైన కేసులో శ్రీ విళ్లిపుత్తూరు మహిళా కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరిగుతున్న లేడీ ప్రొఫెసర్ నిర్మలా దేవిని సోమవారం పోలీసులు అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. నిర్మలాదేవిని 15 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చెయ్యడంతో ఆమెను మదురై సెంట్రల్ జైలుకు తరలించారు. కోర్టు విచారణకు వరుసగా డుమ్మా కొడుతున్న నిర్మలా దేవిని అరెస్టు చెయ్యాలని ఇటీవల కోర్టు ఆదేశాలు జారీ చేసి అరెస్టు వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే.

సతీ సావిత్రి, భర్తను చంపేసి వంటిట్లో పూడ్చేసి పొయ్యి పెట్టి వెరైటీ వంటలు, అక్రమ సంబంధం!సతీ సావిత్రి, భర్తను చంపేసి వంటిట్లో పూడ్చేసి పొయ్యి పెట్టి వెరైటీ వంటలు, అక్రమ సంబంధం!

కోరిక తీరిస్తే మంచి మార్కులు

కోరిక తీరిస్తే మంచి మార్కులు

తమిళనాడులోని అరుప్పు కోటై కాలేజ్ లో ప్రొఫెసర్ గా పని చేసిన నిర్మలా దేవి డిగ్రీ కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు చెప్పింది. మదురై కామరాజర్ యూనివర్శిటీలోని కొందరు సీనియర్ అధికారులకు లైంగిక కోరికలు తీరిస్తే పరీక్షల్లో మీకు మంచి మార్కులు వేస్తారని, మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేస్తారని, ఈ విషయం బయటకు రాకుండా నేను చూసుకుంటానని, మీకు అన్ని విదాలుగా నేను అండగా ఉంటానని అందమైన కాలేజ్ అమ్మాయిలకు ప్రొఫెసర్ నిర్మలా దేవి ఎర వేసింది.

పాపం పండిపోయింది

పాపం పండిపోయింది

మదురై కామారాజర్ యూనివర్శిటి అధికారులకు లైంగిక వాంచ తీర్చాలని నిర్మలా దేవి ఫోన్ చేసి రెచ్చగొట్టిన సమయంలో
కొందరు కాలేజ్ అమ్మాయిలు మొబైల్ లో రికార్డు చేశారు. ఆ ఆడియో బయటకు రావడంతో గత సంవత్సరం నిర్మలా దేవిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. నిర్మలా దేవితో పాటు మదురై కామరాజర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ మురుగన్, పీహెచ్ డీ విద్యార్థిని సైతం పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.

బెయిల్ కోసం నానా తంటాలు

బెయిల్ కోసం నానా తంటాలు

నిర్మలా దేవి నోరు విప్పకుండా చేయడం లక్షంగా అనేక మంది పెద్దలు ప్రయత్నాలు చేశారని ఆరోపణలు ఉన్నాయి.
చివరికి 18 నెలలకు పైగా జైలు జీవితం గడిపిన నిర్మలా దేవి బెయిల్ మీద బయటకు వచ్చింది. నిర్మలా దేవికి షరతులతో బెయిల్ మంజూరు అయ్యింది. పోలీసుల విచారణకు సహకరించాలని, కోర్టు వాయిదాలకు కచ్చితంగా హాజరుకావాలని, దేశం విడిచి వెళ్లకూడదని కోర్టు షరతులు పెట్టింది

మానిసిక క్షోభ

మానిసిక క్షోభ

బెయిల్ పై బయటకు వచ్చిన నిర్మలా దేవిని ఆమె కుటుంబ సభ్యులు ఇంట్లోకి రానివ్వలేదు. భర్త, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులు నిర్మలా దేవిని చీదరించుకున్నారు. విదిలేని పరిస్థితిలో నిర్మలా దేవి ప్రస్తుతం ఆమె స్నేహితురాలి ఇంట్లో ఉంటోంది. భర్త, కుమారుడు, కుటుంబ సభ్యులు వెలివేయడంతో మానసిక క్షోభకు గురైన నిర్మలా దేవి నానా హంగామా చేస్తోంది.

అయ్యో పాపం నిర్మలా దేవి

అయ్యో పాపం నిర్మలా దేవి

శ్రీ విళ్లిపుత్తూరు మహిళా కోర్టు విచారణకు హాజరౌతున్న నిర్మలా దేవి అందర్నీ భయపెట్టే రీతిలో విచిత్రంగా ప్రవర్తిస్తోంది. తలకు గుండు కొట్టుకుని, కొత్త కొత్త కళ్ల అద్దాలు పెట్టుకుని కోర్టుకు వస్తున్న నిర్మలా దేవి చేష్టలు చూసి కొందరు అయ్యో పాపం అంటుంటే మరి కొందరు కేసు నుంచి తప్పించుకోవడానికి ఈమె కొత్త నాటకాలు అడుతోందని విమర్శిస్తున్నారు.

కోర్టు విచారణకు డుమ్మా

కోర్టు విచారణకు డుమ్మా

నిర్మలా దేవి కోర్టు విచారణకు సక్రమంగా హాజరుకాకపోవడంతో శ్రీవిళ్లిపుత్తూరు మహిళా కోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. షరతులతో బెయిల్ మంజూరు చేస్తే ఇష్టం వచ్చినట్లు ప్రవర్థిస్తావా అంటు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు విచారణకు వరుసగా డుమ్మా కోట్టిన నిర్మలా దేవికి మంజూరు చేసిన బెయిల్ ను కోర్టు రద్దు చేసింది. పిటీ వారెంట్ జారీ చేసిన న్యాయమూర్తి వెంటనే నిర్మలా దేవిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

మరోసారి చిప్పకూడు

మరోసారి చిప్పకూడు

కోర్టు ఆదేశాలతో తప్పించుకు తిరుగుతున్న నిర్మలా దేవిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు నిర్మలా దేవిని సోమవారం కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు ఆదేశాలతో నిర్మలా దేవిని మదురై సెంట్రల్ జైలుకు తరలించారు. కోర్టు ఆదేశాలు లెక్కచెయ్యని నిర్మలా దేవి మరోసారి జైల్లో చిప్పకూడు తింటోంది.

English summary
Tamil Nadu professor Nirmala Devi arrested taken 15 days judicial custody in madurai central jail. Srivilliputhur mahila court ordered arrest warrant against professor Nirmala Devi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X