వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు: లేడీ ప్రొఫెసర్ కేసు, పెద్దలు ఎస్కేప్, మాజీ ఐఏఎస్!

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులోని మదురై కామరాజర్ యూనివర్శిటీ ఉన్నతాధికారులకు లైంగిక కోరికలు తీర్చితే పరీక్షల్లో ఎక్కవ మార్కులు వేస్తారని, మీ బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జమ చేస్తారని కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు చెప్పిన లేడీ ప్రొఫెసర్ నిర్మలా దేవీ కేసు విచారణ రోజు రోజుకు ఆలస్యం అవుతోంది. ఈ కేసులో పెద్దలు ఎస్కేప్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.

లేడీ ప్రొఫెసర్ కామసూత్రాలు

లేడీ ప్రొఫెసర్ కామసూత్రాలు

తమిళనాడులోని విరూద్ నగర్ జిల్లా అరుప్పుకోటైలోని దేవాంగర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ విద్యార్థినులను లైంగిక ఉచ్చులోకి లాగేందుకు ప్రయత్నించారని అరెస్టు అయిన లేడీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవిని మాజీ ఐఏఎస్ అధికారి సంతానం ఏకసభ్య కమిషన్ విచారణ చేసి వివరాలు సేకరించింది.

అధికారులు

అధికారులు

మాజీ ఐఏఎస్ అధికారి సంతానం ఇప్పటికే మదురై సెంట్రల్‌జైలుకు వెళ్లి నిర్మలా దేవిని విచారణ జరిపారు. కాలేజ్ అమ్మాయిలను ఎందుకు లైంగిక ఉచ్చులోకి లాగడానికి ప్రయత్నించారు, అమ్మాయిలతో లైంగిక కోరికలు తీర్చుకోవడం కోసం మదురై కామరాజర్ యూనివర్శిటీకి చెందిన అధికారులు ఎవరెవరు మిమ్మల్ని సంప్రధించారు అని ప్రశ్నించిన మాజీ ఐఏఎస్ అధికారి సంతానం ఆమె చెప్పిన వివరాలు రికార్డు చేశారు.

రాసలీలలు

రాసలీలలు

మదురై కామరాజర్ యూనివర్శిటీలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ మురుగన్, కురుప్పుస్వామితో సహ కాలేజ్ అమ్మాయిలను సరఫరా చెయ్యాలని నిర్మలా దేవిని అడిగిన వారి గురించి మాజీ ఐఏఎస్ అధికారి సంతానం పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయినా ఇంత వరకూ విచారణ పూర్తి కాలేదు.

ఆలస్యం ఎందుకు!

ఆలస్యం ఎందుకు!

నిర్మలా దేవీ వ్యవహారంపై రెండు వారాల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ మాజీ ఐఏఎస్ అధికారి సంతానంకు సూచించారు. అయితే నెల రోజులు దాటినా విచారణ ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ కేసు నుంచి పెద్దలను తప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Professor Nirmala Devi's case is going to be diluted by arresting her and the two professors Murugan and Karuppasamy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X