వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాలేజ్ అమ్మాయిలకు లేడీ ప్రొఫెసర్ సెక్స్ పాఠాలు, రాజ్ భవన్ క్లారిటీ, ఏడాది రోజులు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు నేర్పించి వారిని వ్యభిచార కూపంలోకి దించడానికి విఫలయత్నం చేసిన కేసులో విచారణ కీలకమలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో మాకు ఎలాంటి సంబంధం లేదని రాజ్ భవన్ ప్రకటించింది.

 రాజ్ భవన్

రాజ్ భవన్

కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు నేర్పిస్తున్నారన్న కేసులో అసిస్టెంట్ ప్రెఫెసర్ డాక్టర్ నిర్మలా దేవీ జైలుకు పంపించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసు విషయంలో తమిళనాడు రాజ్ భవన్ తెర మీదకు వచ్చింది.

అమ్మాయిలకు ఆశ

అమ్మాయిలకు ఆశ

తమిళనాడులోని మదురై దేవాంగర్ కాలేజ్ అమ్మాయిలను ఎక్కువ మార్కులు కావాలంటే ప్రొఫెసర్లకు లైంగిక సుఖం ఇవ్వాలని, పరీక్షల్లో ఎక్కువ మార్కులు వేస్తారని, అంతే కాకుండా మీ బ్యాంకు అకౌంట్లలో నగదు డిపాజిట్ చేస్తారని ఎర చూపారని ఆశచూపించారని ఆరోపణలు ఉన్నాయి.

గవర్నర్ మీద విమర్శలు

గవర్నర్ మీద విమర్శలు

అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవీ అరెస్టు అయిన తరువాత చాల ఆరోపణులు మొదలైనాయి. ఈ కేసు విషయంలో మదురై కామరాజర్ యూనివర్శిటికి చెంది అనేక మంది ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ తో పాటు తమిళనాడు గవర్నర్ మీద అనేక విమర్శలు వచ్చాయి.

ప్రభుత్వం హడల్

ప్రభుత్వం హడల్

అమ్మాయిలను వ్యభిచారంలోకి దించే కేసులో అరెస్టు అయిన ప్రొఫెసర్ నిర్మలా దేవి అనేక సార్లు తమిళనాడు రాజ్ భవన్ వెళ్లారని, ఈ వ్యవహారంలో అనేక మంది పెద్దలు ఉన్నారని ఆరోపణలు రావడంతో తమిళనాడు ప్రభుత్వం ఉలిక్కిపడింది.

ఆమె రాలేదు !

ఆమె రాలేదు !

తమిళనాడు గవర్నర్ తో నిర్మలా దేవి భేటీ అయ్యారని అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో ఇంత కాలం గవర్నర్ మౌనంగా ఉన్నారు. అయితే తమిళనాడు గవర్నర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. గత సంవత్సరం నుంచి ప్రొఫెసర్ నిర్మలా దేవి ఏ రోజూ రాజ్ భవన్ కార్యాలయానికి భేటీ కాలేదని పత్రికా ప్రకటన విడుదల చెయ్యడంతో విచారణ సరికొత్త మలుపుతిరిగింది.

English summary
Tamil Nadu: Rajbhavan says that Nirmala Devi never visited Rajbhavan for the past 1 year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X