చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: ఆఫ్ సెంచరీ, క్రికెట్ స్కోర్ కాదు బ్రదర్, కరోనా కేసులు, సీఎం, ఐఏఎస్, ఐపీఎస్ లు హడల్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ న్యూఢిల్లీ: తమిళనాడులో కరోనా వైరస్ (COVID 19) స్వైరవిహారం చేస్తోంది. ఒక నెల నుంచి తమిళనాడులో రోజురోజుకు కరోనా వైరస్ కేసులు క్రికెట్ స్కోర్ లాగా పెరిగిపోయింది. తమిళనాడులో కరోనా వైరస్ కేసులు ఎవ్వరూ ఊహించని విధంగా 50 వేల మార్క్ (ఆఫ్ సెంచరీ) దాటిపోయింది. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీలో 35, 556 కరోనా కేసులు నమోదైనాయి. తమిళనాడులో బుధవారం ఒక్కరోజులో 2 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో ఆ రాష్ట్ర సీఎం, ఐఏఎస్, ఐపీఎస్ లతో పాటు అక్కడి ప్రజలు హడలిపోతున్నారు.

అత్త కూతురితో పెళ్లి: ఫస్ట్ నైట్ బెడ్ రూంలో అరుపులు, కేకలు, సరసాలు కాదు, గడ్డపారతో మానవ మృగం !అత్త కూతురితో పెళ్లి: ఫస్ట్ నైట్ బెడ్ రూంలో అరుపులు, కేకలు, సరసాలు కాదు, గడ్డపారతో మానవ మృగం !

18 జిల్లాలు హడల్

తమిళనాడులో 18 జిల్లాల్లో కరోనా వైరస్ వీరవిహారం చేస్తోంది. బుధవారం ఒక్క రోజులో తమిళనాడులో 2, 174 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. తమిళనాడులో బుధవారం వరకు 50, 193 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. చెన్నై సిటీలో మాత్రమే బుధవారం 1, 276 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. చెన్నై సిటీలో ఇప్పటి వరకు 35, 556 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి.

ఇంత దారుణమా ?

తమిళనాడులో కరోనా వైరస్ కాటుకు ఒక్క బుధవారం మాత్రమే 48 మంది మరణించారని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు అధికారికంగా దృవీకరించారు. ఇక తమిళనాడులో కరోనా వైరస్ వ్యాధి దెబ్బకు 576 మంది మరణించారని అధికారులు తెలిపారు. తమిళనాడులో రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది.

 జూన్ లో రికార్డు బద్దలు

జూన్ లో రికార్డు బద్దలు

తమిళనాడులో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రికార్డు బద్దలు అయ్యింది. జూన్ ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు 1, 500 నుంచి దాదాపు రెండు వేల మార్క్ కు అటూ ఇటుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో తమిళనాడు ప్రజలు ఆందోళనకు గురౌతున్నారు. ఎన్నడూ లేని విధంగా జూన్ ఒకటో తేదీ నుంచి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో తమిళ ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 సీఎంకు కరోనా షాక్

సీఎంకు కరోనా షాక్

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి కరోనా షాక్ తగిలింది. తమిళనాడు ప్రభుత్వ ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) కార్యదర్శి దామోదరన్ కరోనా వ్యాధి కాటుకు బలి అయ్యారు. సీఎంఓ కార్యదర్శి దామోదరన్ మరణించడంతో సీఎంఓ కార్యాలయం అధికారులు, సిబ్బందితో పాటు మంత్రులు, అధికారులు హడలిపోతున్నారు.

క్వారంటైన్ లో ఐఏఎస్ లు, ఐపీఎస్ లు !

క్వారంటైన్ లో ఐఏఎస్ లు, ఐపీఎస్ లు !

సీఎంఓ కార్యదర్శి దామోదరన్ కరోనా కాటుకు మరణించడంతో ఆయనతో ఇన్ని రోజులు టచ్ లో ఉన్న కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు పోలీసు అధికారులు, సీఎంఓ కార్యాలయం సిబ్బంది స్వీయ నిర్బంధం (హోమ్ క్వారంటైన్)లోకి వెళ్లిపోయారు. మొత్తం మీద తమిళనాడులో కరోనా వైరస్ తాండవం చెయ్యడంతో తమిళనాడు ప్రభుత్వం హడలిపోతున్నది.

 చెన్నై ఇన్స్ పెక్టర్ బలి

చెన్నై ఇన్స్ పెక్టర్ బలి

చెన్నై సిటీలో కరోనా వైరస్ వ్యాధి రోజురోజుకు క్రికెట్ స్కోర్ లాగా రోగుల సంఖ్య పెరిగిపోతున్నది. చెన్నైలో కరోనా వైరస్ దెబ్బకు సామాన్య ప్రజలతో పాటు వైద్యులు, పోలీసు సిబ్బంది బలి అవుతున్నారు. చెన్నై సిటీలో పోలీసు ఇన్స్ పెక్టర్ గా ఉద్యోగం చేస్తున్న బాలమురళి కరోనా వైరస్ వ్యాధితో మరణించారు. చెన్నై ఇన్స్ పెక్టర్ బాలమురళి మరణవార్త తెలుసుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి దిగ్బాంతి వ్యక్తం చేశారు. ఇన్స్ పెక్టర్ బాలమురళి కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకుంటుందని, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోం ఇస్తామని సీఎం ఎడప్పాడి పళనిస్వామి హామీ ఇచ్చారు.

English summary
Coronavirus: Tamil Nadu reported the highest single-day spike of 2,174 fresh Covid-19 cases on Wednesday, taking the state tally to 50,193. The death toll rose to 576 in the state after 48 people died in the last 24 hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X