వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయాల్లో శశికళ రీ ఎంట్రీ - నేడు కీలక ప్రకటన : జయలలిత సమాధి సాక్షిగా..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలవుతున్నాయి. జయలలిత హయాంలో ఒక వెలుగు వెలిగిన చిన్నమ్మ రాజకీయంగా యాక్టివ్ కాబోతున్నారు. ఇప్పటికే మద్దతు దారులతో శశికళ భవిష్యత్ రాజకీయం పైన కీలక మంతనాలు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. అన్నాడీఎంకే స్థాపించి అక్టోబర్‌ 17కి 50 సంవత్సరాలు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలకు సిద్ధమవుతున్నారు. ఈ సమయాన్ని చిన్నమ్మ తనకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

శశికళ ప్రకటన పైన ఆసక్తి

శశికళ ప్రకటన పైన ఆసక్తి

ఈ రోజున శశికళ రాజకీయంగా ప్రకటన చేస్తారని ప్రచారం సాగుతోంది. జయలలిత సమాధి దగ్గర నివాళులర్పించి అక్కడి నుంచే తన పొలిటికల్ రీ ఎంట్రీపై చినమ్మ ప్రకటన చేస్తారనే అంచనాలు తమిళనాట వ్యక్తం అవుతున్నాయి. జయలలిత నెచ్చెలి గా శశికళకు పార్టీలో పట్టు ఉంది. అయితే, గత సాధారణ ఎన్నికకు ముందు జైలుకు వెళ్లటంతో పూర్తిగా పార్టీ వ్యవహారాలకు దూరమయ్యారు. అదే సమయంలో అన్నాడీఏంకే సైతం శశికళ రీ ఎంట్రీని వ్యతరేకించింది.

అన్నీ డీఎంకే నేతలు అంగీకరిస్తారా

అన్నీ డీఎంకే నేతలు అంగీకరిస్తారా

ఇక, జైలు నుంచి విడుదల అయిన సైతం చిన్నమ్మ రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. అయితే, ఇప్పుడు తన వ్యూహం మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా కేడర్‌లోకి చొచ్చుకువెళ్లేందుకు తగ్గ కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా నమదు ఎంజీఆర్‌ పత్రిక ద్వారా రోజుకో ప్రకటన చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో నేనొస్తున్నా అంటూ సంకేతాన్ని కేడర్‌లోకి పంపించారు. అన్నాడీఎంకే అందరిదీ అని, ఇందులో అందరూ సమానమే అని వ్యాఖ్యానించారు. పార్టీకి నేతృత్వం వహించే వారు తల్లితో సమానం అని, కేడర్‌ను బిడ్డల వలే చూసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

చిన్నమ్మ అడుగులు ఎటువైపు

చిన్నమ్మ అడుగులు ఎటువైపు

అయితే, పార్టీ అందరిదీ అని చెబుతున్న శశికళ ..తాను ఏం చేయబోయేదీ వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. జయలలిత మరణం నుంచి పార్టీకి దాదాపుగా దూరంగా ఉన్న శశికళ.. ఇప్పుడు పార్టీలో తిరిగి పెత్తనం సాగించటం అంత సులువైన విషయంగా కనిపించటం లేదు. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన అన్నా డీఎంకేలో నడిపించే నేత ఎవరనేది స్పష్టత లేక కేడర్ నైరాశ్యంలో ఉంది. ఇక, శశికళ రీ ఎంట్రీ పైన అన్నా డీఎంకేలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Recommended Video

Cyclone Burevi Is Stable In The Sea Near Tamilanadu's Ramanathapuram
రాజకీయంగా కొత్త సమీకరణాలు

రాజకీయంగా కొత్త సమీకరణాలు

ఇక, తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం - పార్టీ బలంగా కనిపిస్తున్నాయి. ఈ సమమంలో శశికళ వేసే రాజకీయ అడుగుల పైన అన్ని పార్టీల్లోనూ ఆసక్తి కనిపిస్తోంది. ఇదే సమయంలో దినకరన్ పాత్ర ఏంటనే చర్చ తెర పైకి వస్తోంది. ఈ సమయంలో రాజకీయంగా రీ ఎంట్రీ ఖాయమని భావిస్తున్న వేళ..శశికళ చేసే ప్రకటన పైన ఇప్పుడ ఉత్కంఠ నెలకొని ఉంది. శశికళ ఏం చెప్పబోతున్నారు..రాజకీయ భవిష్యత్ ఆలోచనలు ఏంటనేది మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

English summary
Shashikala a banned AIDMK leader and close confidante of Jayalalithaa,is all set to give a political re-entry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X