షాక్: దినకరన్ దిమ్మ తిరిగింది, 19 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన స్పీకర్, పాపం !
టీటీవీ దినకరన్ దిమ్మ తిరిగింది 19 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన స్పీకర్ పార్టీ నియమాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్థిస్తున్నారు. వివరణ ఇవ్వండి
చెన్నై: తమిళనాడు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన 19 మంది అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవడానికి ఆ రాష్ట్ర శాసన సభ స్పీకర్ సిద్దం అయ్యారు. పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ప్రవర్థిస్తున్న 19 మంది ఎమ్మెల్యేలకు గురువారం సాయంత్ర స్పీకర్ ధనపాల్ నోటీసులు జారీ చేశారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన టీటీవీ దినకరన్ అన్నాడీఎంకేలోని 19 మంది ఎమ్మెల్యేలను ఓ గ్రూప్ గా తయారు చేయించారు. గవర్నర్ విద్యాసాగర్ రావ్ ను కలిసిన 19 మంది ఎమ్మెల్యేలు ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని లేఖ ఇచ్చారు.

అన్నాడీఎంకే పార్టీ గుర్తుతో గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలు పార్టీ నియమాలకు వ్యతిరేకంగా అధికారంలో ఉన్న అదే పార్టీ మీద తిరుగుబాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. తమిళనాడు శాసన సభలో చీఫ్ విప్ అయిన రాజేంద్రన్ స్పీకర్ ధనపాల్ కు ఫిర్యాదు చేసిన రెండు గంటల్లోనే ఆయన స్పంధించారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఎందుకు చేస్తున్నారు, అధికారంలో ఉన్న సొంత పార్టీ ప్రభుత్వం మీద ఎందుకు తిరుగుబాటు చేశారు ? అని సమాధానం చెప్పాలని స్పీకర్ ధనపాల్ 19 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. 19 మంది ఎమ్మెల్యేలు ఏం సమాధానం ఇస్తారో అంటు తమిళనాడు ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications