• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పాఠశాలలో పాడుపని.. అంగన్‌వాడీ టీచర్‌తో ఉపాధ్యాయుడి రాసలీలలు... రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని

|

చెన్నై : స్కూల్.. విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దే పవిత్ర స్థలం. గుడి తర్వాత బడి అంటారు. ఉపాధ్యాయ వృత్తికి కూడా సమాజంలో మంచి గౌరవం ఉంది. టీచర్లు అంటే తల్లిదండ్రులు, ఇతరులు గౌరవిస్తారు. తల్లి, తండ్రి తర్వాత స్థానం గురువుదే.. కానీ అలాంటి పవిత్ర చోట ఓ ఉపాధ్యాయుడు కీచక పని చేశారు. మరో టీచర్‌తో లైంగిక సంబంధం కొనసాగించాడు. వారిద్దరినీ ఇదివరకే విద్యార్థులు చూసి మందలించిన ఫలితం లేకపోయింది. వారు తీరు మార్చుకోలేదు. మరోసారి బహిరంగ ప్రదేశంలో కలుసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

పాఠశాలలోనే ..

పాఠశాలలోనే ..

తమిళనాడులో నమ్మక్కల్స్ ఉడుప్పమ్ ప్రభుత్వ పాఠశాల ఉంది. ఇక్కడ విద్యార్థులు చదువుకొంటుండగా .. టీచర్లు, ప్రధానోపాధ్యాయుడు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారు. కానీ ఓ టీచర్ బుద్ధి మాత్రం తప్పింది. పక్కనే ఉన్న అంగన్‌వాడీ టీచర్‌తో సంబంధం కొనసాగిస్తున్నాడు. అయితే వారిద్దరూ కలిసి పాఠశాల దగ్గరలో బహిరంగ ప్రదేశంలో కలుసుకొంటున్నారు. వారిద్దరినీ చాలాసార్లు విద్యార్థులు చూశారు. అయినా వారు భయపడలేదు. ఏం చేస్తారులే అనుకొన్నారు. యధేచ్చగా స్కూల్‌కు రావడం .. తమ పనికానిచ్చేస్తున్నారు. వారి ప్రవర్తనతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. తమ ముందే పాడుపని చేస్తున్నారని వాపోతున్నారు. లాభం లేదని విషయాన్ని తమ తల్లిదండ్రులకు తెలియజేశారు.

పట్టుకొని ..

పట్టుకొని ..

ఎప్పటిలాగే మంగళవారం మరోసారి అంగన్‌వాడీ టీచర్‌‌తో ఉపాధ్యాయుడు పాఠశాల సమీపంలో బహిరంగ ప్రదేశంలో కలుసుకొంటున్నారు. వారిని చూసి పేరెంట్స్, స్థానికులకు తెలియజేశారు విద్యార్థులు. వెంటనే రంగప్రవేశం చేసిన స్థానికులు వారిని రెడ్‌హ్యాండె‌డ్‌గా పట్టుకున్నారు. ఆ టీచర్‌కు దేహశుద్ధి చేశారు. తర్వాత స్కూల్ బయట కూర్చొబెట్టి అసభ్య పదజాలంతో దూషించారు. ఆ అంగన్‌వాడీ టీచర్‌ను కూడా తిట్టిపోశారు. ఈ విషయంపై ప్రిన్సిపల్ స్పందించారు. తమ టీచర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. అంగన్‌వాడీ టీచర్‌పై కూడా సంబంధింత అధికారులకు నివేదిస్తామని వెల్లడించారు. టీచర్, అంగన్‌వాడీ టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

చెరలోకి టీచర్ ..

చెరలోకి టీచర్ ..

ఈ ఘటనపై స్థానికులు పుందన్‌సాయి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. లైంగికదాడికి పాల్పడుతూ దొరికిన టీచర్‌ను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అంగన్‌వాడీ టీచర్‌పై కూడా సంబంధిత కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. కానీ పాఠశాలలో జరిగిన ఈ ఘటనను గ్రామస్థులు ఖండిస్తున్నారు. ఆ టీచర్‌పై సస్పెన్షన్ వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తాము ఉద్యమిస్తామని తమిళనాడు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
a school teacher and an Anganwadi worker in a Tamil Nadu village were caught having sex at the school premises, which led to a group of angry villagers thrashing the accused teacher. The teacher at Namakkal's S Uduppam government school was caught with the Anganwadi worker while they were having sex after school hours. The two were having an affair for the past couple of months. The woman works for rural child care development and is associated with the school and the two would hook up after school hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more