చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: పగపట్టిన కరోనా, 70 వేల మార్క్ క్రాస్, చెన్నై కథ అంతేనా ?, తమిళనాడులో టెర్రర్ పంజా !

|
Google Oneindia TeluguNews

చెన్నై: దక్షిణ భారతదేశంలోని తమిళనాడులోపై పగపట్టిన కరోనా కక్ష పెంచుకుందా ?, అందుకే టెర్రర్ పంజా విసురుతుందా ? అని తమిళ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఒక్క తమిళనాడులో నమోదు అవుతున్నాయి. తమిళనాడులో కరోనా టెర్రర్ తో ప్రజలు హడలిపోతున్నారు. నేటి వరకు తమిళనాడులో 70, 977 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇక తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ఏకంగా 47, 650 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. తమిళనాడులో ఇప్పటి వరకు కరోనా కాటుకు 911 మంది బలి అయ్యారని అధికారులు చెప్పారు.

TikTok: పోలీసు అధికారి పోటుగాడు, కరోనా కాలంలో పోయేకాలం, అమ్మాయిలు, ఆంటీలతో రోజుకు 20 సార్లు !TikTok: పోలీసు అధికారి పోటుగాడు, కరోనా కాలంలో పోయేకాలం, అమ్మాయిలు, ఆంటీలతో రోజుకు 20 సార్లు !

 రికార్డు బ్రేక్

రికార్డు బ్రేక్

కరోనా వైరస్ వ్యాధి వ్యాపించడం మొదలైనప్పటి నుంచి ఎన్నడూ లేని విధంగా గురువారం ఒక్కరోజే తమిళనాడులో 3, 509 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. తమిళనాడులో ఒక్కరోజే 45 మంది మరణించడంతో ఆ రాష్ట్రంలో మృతుల సంఖ్య 911కు చేరింది. ఇక తమిళనాడులో గురువారం రాత్రి వరకు మొత్తం 70, 977 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయని అధికారులు అధికారికంగా చెప్పారు.

 చెన్నైలో విలయతాండవం

చెన్నైలో విలయతాండవం

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీ పేరు చెబితే తమిళనాడుతో పాటు దేశం మొత్తం హడలిపోతున్నది. చెన్నైలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు అమాంతం పెరిగిపోతుండటంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష పార్టీల నాయకులు, సామాన్య ప్రజలు ప్రాణభయంతో హడలిపోతున్నారు.

 చెన్నైలో విలయతాండవం

చెన్నైలో విలయతాండవం

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీ పేరు చెబితే తమిళనాడుతో పాటు దేశం మొత్తం హడలిపోతున్నది. చెన్నైలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు అమాంతం పెరిగిపోతుండటంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష పార్టీల నాయకులు, సామాన్య ప్రజలు ప్రాణభయంతో హడలిపోతున్నారు.

 ఎంత చేసినా ఫలితం మాత్రం ?

ఎంత చేసినా ఫలితం మాత్రం ?

చెన్నై సిటీతో పాటు చుట్టుపక్కల ఉన్న కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు నాలుగు జిల్లాల సరిహద్దులను తమిళనాడు ప్రభుత్వం పూర్తిగా మూసివేసింది. చెన్నై సిటీతో పాటు నాలుగు జిల్లాలు సంపూర్ణంగా లాక్ డౌన్ అమలు చేశారు. లాక్ డౌన్ 5.0 సడలింపులు చెన్నైతో పాటు మిగిలిన నాలుగు జిల్లాలకు వర్తించవని, అత్యవసరం మినహాయింపులు తప్పా ఎలాంటి వాహన సంచారం, జనసంచారం ఉండకుండా చూడాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడు రాష్ట్రం మొత్తంలో కరోనా వైరస్ వ్యాధికి 911 మంది మరణించడంతో అందులో చెన్నైలోనే మరణాల సంఖ్య 694 ఉంది. ఇక చెంగల్పట్టులో 65 మంది, తిరువళ్లూరులో 51 మంది కరోనా కాటుకు బలి అయ్యారు.

 పోటీ పడుతున్న జిల్లాలు

పోటీ పడుతున్న జిల్లాలు

చెన్నైతో పాటు లాక్ డౌన్ అమలులో ఉన్న నాలుగు జిల్లాలతో ఇప్పుడు మదురై, రామనాథపురం, తిరువాణ్ణామలై, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని వేలూరు (చిత్తూరు పక్కనే ఉన్న జిల్లా)లు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యలో పోటీ పుతున్నాయి. మదురైలో 203, వేలూరులో 168, తిరువణ్ణామలైలో 170, రామనాథజురంలో 140 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయని అధికారులు తెలిపారు. ఈ దెబ్బతో మదురైలో కూడా లాక్ డౌన్ అమలులోకి రావడంతో ఆ జిల్లాలో ఇంటింటికి తిరుగుతున్న అధికారులు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తమిళనాడులో ఇప్పటి వరకు 39, 999 మంది కరోనా వైరస్ వ్యాధిని నయం చేసుకున్నారని అధికారులు తెలిపారు.

Recommended Video

తెలుగురాష్ట్రాల మధ్య Bus సర్వీసులకు బ్రేక్.. AP లో సిటీ బస్సులకు గ్రీన్ సిగ్నల్! || Oneindia Telugu
 మురుగా కాపాడు స్వామి

మురుగా కాపాడు స్వామి

తమిళనాడులో రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో హడలిపోతున్న సామాన్య ప్రజలు, మంత్రులు, పలువురు రాజకీయ నాయకులు నువ్వే కాపాడు మురుగా అంటూ దేవుడిని వేడుకుంటున్నారు. కరోనా వైరస్ దెబ్బతో తమిళనాడులో అనేక ప్రముఖ ఆలయాలు, చిన్నచిన్న ఆలయాలు ఇంత వరకు తెరుచుకోలేదు. ఆలయాలు, ప్రార్థనా మందిరాలు తియ్యాలని పలువురు డిమాండ్ చేప్తున్నా కరోనా భయంతో ప్రభుత్వం ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది. మొత్తం మీద తమిళనాడులో కరోనాను కంట్రోల్ చెయ్యాలని అక్కడి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఇంత వరకు ఫలించలేదు.

English summary
Tamil Nadu: The state stands third on the tally with 70,977 Coronavirus cases. Tamil Nadu has witnessed 911 Coronavirus fatalities while 39,999 have recovered.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X