చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తమిళనాడు నీటి సమస్యను వర్షమే కాపాడాలి..! టైటానిక్ హీరీ సంచలన కామెంట్..!!

|
Google Oneindia TeluguNews

చెన్నై/హైదరాబాద్ : తమిళ నాడు రాష్ట్రంలో నెలకొన్న నీటి సమస్యపై ఖండాంతరాలలో చర్చ జరుగుతోంది. బాలీవుడ్ తో పాటు తెలుగు హీరోలు ఆ సమస్యపై స్పందించారు. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ హీరోలు కూడా చెన్నై నీటి కటకట గురించి స్పందించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తమిళనాడు రాజధాని చెన్నైలో నీటి కొరత నానాటికీ తీవ్రంగా మారుతోంది.

వర్షాలు లేక, రిజర్వాయర్లు ఎండిపోయి చుక్క నీరు కూడా దొరక్క ప్రజలు అల్లాడిపోతున్నారు. చెన్నై వాసుల దుస్థితిపై ప్రముఖ హాలీవుడ్‌ హీరో, టైటానిక్ ఫేం, పర్యావరణ వేత్త లియోనార్డో డికాప్రియో విచారం వ్యక్తం చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో బావి దగ్గర నీటి కోసం చూస్తున్న మహిళల ఫోటోను పోస్ట్ చేసిన డికాప్రియో చెన్నై సమస్యపై సుధీర్ఘ కామెంట్ చేశారు.ఈ సమయంలో చెన్నైని వర్షం మాత్రమే కాపాడగలదని అభిప్రాయపడ్డారు. అంతేకాదు చెన్నైలో సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలను కూడా తన పోస్ట్‌లో ప్రస్తావించారు డికాప్రియో.

Tamil Nadu water problem must be saved from rain Titanic Heary Sensational Comment .. !!

ప్రస్తుత పరిస్థితుల్లో చెన్నైని వర్షాలు మాత్రమే కాపాడాలి. చెన్నైలో ప్రధాన రిజర్వాయర్లు పూర్తిగా ఎండిపోవడంతో నీటి ఎద్దడి విపరీతంగా ఉంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి కోసం ప్రభుత్వ ట్యాంక్‌ల వద్ద గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి ఎదురైంది. నీటి కొరతతో నగరంలోని కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతబడ్డాయి. నీటి కోసం ప్రభుత్వాధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం వర్షాలు కురవాలని వేడుకుంటున్నారు అని డికాప్రియో తన పోస్టులో పేర్కొన్నారు.

English summary
In the absence of rains, reservoirs have dried up and people find water. Legendary Hollywood hero, Titanic fame and environmentalist Leonardo DiCaprio lamented the plight of Chennai residents. DiCaprio made a lengthy comment on the Chennai issue by posting a photo of women looking for water near the well on his Instagram page.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X