చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అభిమానులతో రజనీకాంత్ సమావేశం: పొలిటికల్ ఎంట్రీ?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా? అనే అంశం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సినీ నటి నగ్మా ఇటీవల రజనీకాంత్ తో సుదీర్ఘంగా సమావేశం కావడం , ఈ నెల 15 నుండి 19వ, తేదివరకు

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా? అనే అంశం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సినీ నటి నగ్మా ఇటీవల రజనీకాంత్ తో సుదీర్ఘంగా సమావేశం కావడం , ఈ నెల 15 నుండి 19వ, తేదివరకు అభిమానులతో రజనీకాంత్ సమావేశాలు ఏర్పాటు చేయడంతో ఈ చర్చ మరోసారి తెరమీదికి వచ్చింది.

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తర్వాత రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరందుకొంది.అన్నాడిఎంకె సంక్షోభ సమయంలో ఈ ప్రచారం మరింత ఎక్కువైంది.

అయితే ఇటీవల వచ్చిన ఆర్ కె నగర్ ఉప ఎన్నికల్లో కూడ ఆయన ఏ పార్టీకి మద్దతిచ్చే ప్రసక్తేలేదని రజనీకాంత్ ప్రకటించారు.అయితే ఈ నెల 15 నుండి 19వ, తేది వరకు ఆయన అభిమానులతో సమావేశంకానున్నారు.ఈ సమావేశాల నేపథ్యంలో మరోసారి రజనీ రాజకీయాల్లో వచ్చే విషయమై చర్చసాగుతోంది.

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగిన ప్రతిసారీ ఆయన ఖండిస్తూనే వచ్చారు. అయితే రాష్ట్రంలో చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో రజనీకాంత్ ఏ రకమైన నిర్ణయం తీసుకొంటారనే చర్చ సాగుతోంది.

అభిమానులతో రజనీకాంత్ సమావేశం

అభిమానులతో రజనీకాంత్ సమావేశం

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ నెల 15వ, తేది నుండి 19వ, తేదివరకు అభిమానసంఘాలతో సమవేశం కానున్నారు. ఈ సమావేశంలో రాజకీయాలకు సంబంధించిన చర్చ ఉండే అవకాశం లేకపోలేదనే ప్రచారం కూడ ఉంది.అయితే అభిమానసంఘాలతో రజనీకాంత్ గ్రూపులు, గ్రూపులుగా విడిపోయి చర్చించనున్నారు. విడివిడిగా కలుసుకోనున్నారు. అయితే ఈ సమావేశానికి ప్రాధాన్యత ఉండే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

రాజకీయాల్లోకి వచ్చే విషయమై కొనసాగుతున్న ఉత్కంఠ

రాజకీయాల్లోకి వచ్చే విషయమై కొనసాగుతున్న ఉత్కంఠ

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే విషయమై ఇంకా ఉత్కంఠ సాగుతూనే ఉంది.అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రాలేదు.ఇదే విషయమై తమిళనాడు రాష్ట్రంలో పలు ఊహగానాలు వస్తున్నాయి.ఈ ఊహగానాల నేపథ్యంలోనే అభిమానులతో ఆయన సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. అన్నాడిఎంకె అధినేత్రీ జయలలిత మరణంతో రజనీకాంత్ రాజకీయరంగప్రవేశంపై జోరుగా చర్చసాగుతోంది.

ధీటైన నాయకత్వం కోసం

ధీటైన నాయకత్వం కోసం

జయలలిత మరణించిన తర్వాత రాష్ట్రానికి సరైన నాయకత్వం లేకుండా పోయిందనే అభిప్రాయం ఉంది.ఈ తరుణంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడ ఉంది.అయితే ఇదే విషయాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.అయితే రజనీకాంత్ మాత్రం రాజకీయాల పట్ల ఆసక్తిని ప్రదర్శించడం లేదు.

ఆర్ కె నగర్ ఉప ఎన్నికల్లో ఎవరికీ మద్దతివ్వని రజనీ

ఆర్ కె నగర్ ఉప ఎన్నికల్లో ఎవరికీ మద్దతివ్వని రజనీ

ఇటీవల వాయిదా పడిన ఆర్ కె నగర్ ఉప ఎన్నికల్లో రజనీకాంత్ ఏ పార్టీకి కూడ మద్దతివ్వలేదు.ఈ స్థానం నుండి బిజెపి అభ్యర్థిగా బరిలో ఉన్న సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడు రజనీకాంత్ ను కలిసి తనకు మద్దతివ్వాలని కోరాడు.అయితే తాను ఈ ఎన్నికల్లో ఎవరికీ కూడ మద్దతివ్వబోనని చెప్పారు.అయితే అయితే విచ్చలవిడిగా డబ్బులు పంచారనే ఆరోపణల నేపథ్యంలో ఆర్ కె నగర్ ఉప ఎన్నికలు వాయిదాపడ్డాయి.

నగ్మాతో సమావేశం తర్వాత రజనీకాంత్ లో మార్పు?

నగ్మాతో సమావేశం తర్వాత రజనీకాంత్ లో మార్పు?

వారం రోజుల క్రితం సినీ నటి నగ్మా రజనీకాంత్ తో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో రాజకీయాలపై సీరియస్ గా చర్చించారని సమాచారం. అయితే రాజకీయరంగ ప్రవేశంపై ఆయన నుండి స్పష్టమైన హామీ రాలేదు.అయితే నగ్మాతో సమావేశం జరిగిన వెంటనే అభిమానసంఘాలతో రజనీకాంత్ సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది.

English summary
Tamil super star Rajinikanth will meeting with fans asssociation this month 15 to 19.There is a rumour spreading for Rajinikanth enter into politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X