వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పన్నీర్ వస్తే ఎంత, రాకుంటే ఎంత, తమిళనాడు సీఎం:స్కెచ్ మారినట్లు ఉంది !

అన్నాడీఎంకే చీలక వర్గాల విలీన చర్చల్లో ఆయోమయం నెలకొనడంతో ఈ విషయంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి తొలిసారి పెదవి విప్పారు. ఆ నాయకులుకు ఇష్టం ఉంటే చర్చలకు రానియ్యండి, లేదంటే లేదు అన్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే చీలక వర్గాల విలీన చర్చల్లో ఆయోమయం నెలకొనడంతో ఈ విషయంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి తొలిసారి పెదవి విప్పారు. ఆ నాయకులుకు ఇష్టం ఉంటే చర్చలకు రానియ్యండి, లేదంటే లేదు అన్నారు.

పన్నీర్ సెల్వం పేరు ఎత్తకనే ఎడప్పాడి పళనిసామి ఆయన వర్గం పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. సేలంలో అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పన్నీర్ సెల్వం వర్గం తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఓపిక ఎంత వరకు ఉంటుంది

ఓపిక ఎంత వరకు ఉంటుంది

చర్చలకు తాము సిద్దం అంటూ ముందుకు వచ్చిన పన్నీర్ సెల్వంలోని కొందరు నాయకులు ద్వంద వైఖరి అవలంభిస్తున్నారని ఎడప్పాడి పళనిసామి విరుచుకుపడ్డారు. పన్నీర్ సెల్వం వర్గానికి నిజంగా చిత్తశుద్ది ఉంటే ఇలా చెయ్యరని విమర్శించారు.

రోజుకో డిమాండ్ తెరమీదకు

రోజుకో డిమాండ్ తెరమీదకు

చర్చలకు తాము సిద్దం అంటూనే ప్రతి నిత్యం ఏదో ఒక డిమాండ్ తెరమీదకు తీసుకు వస్తున్న పన్నీర్ సెల్వం వర్గంలోని నాయకులు విలీనం చర్చలకు ఆటంకం కలిగిస్తున్నారని పళనిసామి అన్నారు. ఇలా రోజు చర్చలు అంటూ ఆలస్యం చేస్తున్నారని పళనిసామి చెప్పారు.

ఎవరూ వచ్చినా రాకపోయినా

ఎవరూ వచ్చినా రాకపోయినా

చర్చలకు ఎవరు వచ్చినా రాకపోయినా మాకు ఎలాంటి నష్టం లేదని సీఎం ఎడప్పాడి పళనిసామి ధీమా వ్యక్తం చేశారు. చర్చలు అంటూ ముందుకు వచ్చి ఇప్పుడు చుక్కలు చూపించడానికి సిద్దం అయ్యారని, వారు వచ్చినా రాకపోయినా మాకు ఎలాంటి నష్టం లేదని పళనిసామి స్పష్టం చేశారు.

మీ ఆశీర్వాదం కావాలి

మీ ఆశీర్వాదం కావాలి

మీ ఆశీర్వాదం ఉంటే చాలు, మాకు అంతకంటే ఏం కావాలి అని పళనిసామి కార్యకర్తలను ఉద్దేశించి మాట్టాడారు. మీరు అనుకున్నట్లు మనం ఐదేళ్లపాటు అధికారంలో ఉంటామని ఎడప్పాడి పళనిసామి ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పరోక్షంగా పన్నీర్ సెల్వం వర్గంలోని నాయకులపై పళనిసా విరుచుకుపడ్డారు.

పన్నీర్ సెల్వం వర్గం

పన్నీర్ సెల్వం వర్గం

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి వ్యాఖ్యలపై పన్నీర్ సెల్వం, ఆయన వర్గంలోని నాయకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇంత వరకు పన్నీర్ సెల్వం వర్గంలోని సీనియర్ నాయకులు ఈ విషయంపై నోరువిప్పడం లేదు.

English summary
TamilNadu Chief Minister Edapadi Palanisamy has spoken in Salem AIADMK workers meeting, we will win local body election, admk workers and ruling party in ours, no need merger in two team, despite irregularities in the demands quoted by OPS camp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X