• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అత్యున్నత పదవిలో..విధి నిర్వహణలో : తొలి సీడీఎస్ బిపిన్ రావత్ మృతి - సతీమణితో సహా..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా జనరల్ బిపిన్ రావత్‌ (63) హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. సైన్యంలో అత్యున్నత హోదాలో ఉన్న బిపిన్ రావత్ ప్రమాదంలో మరణించటంతో ఒక్క సారిగా అందరూ షాకయ్యారు. త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచి, సైన్యాన్ని మరింత పటిష్టం చేయడం సీడీఎస్ బాధ్యత. ఆ హోదాలో నియమితులైన తొలి వ్యక్తిగా బిపిన్ రావత్ ఉన్నారు. సీడీఎస్‌గా జనరల్ రావత్‌ను నియమిస్తూ ప్రభుత్వం 2019, డిసెంబర్ 31న నియమించింది.

 షిమ్లాలో బిపిన్ చదువు

షిమ్లాలో బిపిన్ చదువు

జనరల్ బిపిన్ రావత్ 1958 మార్చి 16వ తేదీన జన్మించారు. తండ్రి కూడా ఆర్మీ తరపున దేశానికి సేవ చేశారు. సెయింట్ ఎడ్వర్డ్ స్కూల్‌, నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో జనరల్ బిపిన్ రావత్ చదువుకున్నారు. 1978 డిసెంబర్ 16వ తేదీన 11వ గోర్ఖా రైఫిల్స్‌లోని ఐదవ బెటాలియన్‌లో విధుల్లో చేరారు. ఈ బెటాలియన్‌కు తన తండ్రే కమాండర్‌గా వ్యవహరించారు. డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడెమీలో డిగ్రీ చేస్తున్న సమయంలోనే అతన్ని స్వోర్డ్ ఆఫ్ హానర్‌ అవార్డు వరించింది.

జనరల్ బిపిన్ రావత్ సర్వీస్

జనరల్ బిపిన్ రావత్ సర్వీస్

ఇక జనరల్ బిపిన్ రావత్‌కు ఎంతో అనుభవం ఉంది. ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో పనిచేసిన అనుభవం ఉంది. కశ్మీర్‌లోయ లోని తూర్పు సెక్టార్‌ మరియు రాష్ట్రీయ రైఫిల్స్ సెక్టార్‌‌కు కమాండర్‌గా వ్యవహరించారు. అక్కడి నుంచి డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు కూడా కమాండర్‌గా వ్యవహరించారు. ఈశాన్య భారత దేశంతో పాటు జమ్ముకశ్మీర్ వద్ద వాస్తవాధీన రేఖ వద్ద కమాండర్‌గా వ్యవహరించారు. ఇక పశ్చిమ భారతంలో కూడా బిపిన్ తన మార్కును వేశారు. ఎడారిలో కూడా కొన్ని ఆపరేషన్స్ నిర్వహించారు. ఇక అంచలంచెలుగా ఎదిగా 2016 డిసెంబర్ 31 నుంచి 2019 డిసెంబర్ 31 వరకు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. మిలటరీ మీడియా స్ట్రాటెజిక్ స్టడీస్ పై రీసెర్చ్ చేసినందుకు గాను మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ యూనివర్శిటీ జనరల్ బిపిన్‌ రావత్‌ను డాక్టరేట్‌తో గౌరవించింది.

 జనరల్ బిపిన్ రావత్‌కు అవార్డులు

జనరల్ బిపిన్ రావత్‌కు అవార్డులు


దేశం కోసం దాదాపుగా 42 ఏళ్లు సేవలందించిన బిపిన్ రావత్‌ను పలు ప్రెసిడెన్షియల్ అవార్డులు వరించాయి. ఇందులో పీవీఎస్ఎం, యూవైఎస్ఎం, ఏవీఎస్ఎం, వైఎస్ఎం, ఎస్ఎం, వీఎస్ఎంలు ఉన్నాయి. కాంగోలో ఐక్యరాజ్యసమితి తరపున పనిచేస్తున్న సమయంలో ఫోర్స్ కమారండర్ కమెండేషన్‌ అవార్డును రెండు సార్లు పొందారు. ఇక 2019 డిసెంబర్ 31వ తేదీన భారత్‌కు తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్‌గా జనరల్ బిపిన్ రావత్ నియమించబడ్డారు.

హెలికాప్టర్ ప్రమాదానికి గురి కావటంతో

హెలికాప్టర్ ప్రమాదానికి గురి కావటంతో

ఇక, ఈ రోజు జరిగిన ప్రమాదంలో 14 మంది సైన్యంతో వెళ్తున్న హెలికాఫ్టర్ కూనూరు సమీపంలో నీలగిరి అడవుల్లో కూలిపోయింది. తమిళనాడు లోని నీలగిరి జిల్లాలో కూలిన MI -17 V5 హెలికాప్టర్‌ పూర్తిగా కాలిపోయింది. అయితే సాంకేతిక సమస్య కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని చెబుతున్నారు. ఈ ప్రమాదం జరిగిన హెలికాప్టర్ లో జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక, బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడ్డర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, నాయక్ గుర్‌సేవక్ సింగ్, నాయక్ జితేందర్ కుమార్, లాన్స్ నాయక్ వివేక్ కుమార్, లాన్స్ నాయక్ బి సాయి తేజ, హవల్దార్ సత్పాల్ ఉన్నారని చెబుతున్నారు.

  Bipin Rawat అప్పుడు ప్రాణాలతో బయటపడ్డా ఇప్పుడు | Army Helicopter || Oneindia Telugu
  సతీమణితో సహా ప్రమాదంలోనే..

  సతీమణితో సహా ప్రమాదంలోనే..

  విషయం తెలిసిన వెంటనే కేంద్ర కేబినెట్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ప్రధాని ఆర్మీ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఘటనా ప్రాంతానికి ఆర్మీ ఉన్నతాధికారులు చేరుకున్నారు. అయితే, ఈ ప్రమాదంలో రావత్ తో పాటుగా సతీమణి మధులిక సైతం కన్నుమూసారు. మొత్తం ఏడుగురు ఈ ప్రమాదంలో మరణించినట్లుగా ప్రకటించారు. బిపిన్ రావత్ మరణం పైన కేంద్రం అధికారికంగా ప్రకటన చేసింది.

  English summary
  CDS Bipin Rawat succumbed to injuries after the army chopper had crashed at coonoor of Tamilnadu.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X