వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మత్స్యకారులను ఆదుకోవాలని పవన్ విజ్ఞప్తి.. తమిళ సీఎం రియాక్షన్ ఇదీ..

|
Google Oneindia TeluguNews

లాక్ డౌన్ కారణంగా తమిళనాడులోని చెన్నై హార్బర్‌లో చిక్కుకుపోయిన మత్స్యకారులను ఆదుకోవాల్సిందిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన విజ్ఞప్తిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి సానుకూలంగా స్పందించారు. మత్స్యకారులకు అవసరమైన సాయం అందించేందుకు సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. వారి బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఆయన స్పందించారు.

తమ అధికారుల బృందం ఏపీ మత్స్యకార ప్రతినిధులను కలిశారని.. వారికి ఆహారం,నీళ్లు అందించడంతో పాటు తదితర అవసరమైన వస్తువులను పంపిణీ చేశారని మరో ట్వీట్‌లో సీఎం తెలిపారు. ప్రస్తుతం వారు భద్రంగా ఉన్నారని.. వారి కుటుంబ సభ్యులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

tamilnadu cm palaniswami positive reaction to assure fishermen

కాగా,తమిళనాడులో చిక్కుకుపోయిన ఈ మత్స్యకారులు శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సీహెచ్ చొలగండి గ్రామానికి చెందినవారు. దాదాపు 30 మంది మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లి.. లాక్ డౌన్ కారణంగా చెన్నై హార్బర్ వద్ద చిక్కుకుపోయారు. అక్కడ సరైన భోజనం,వసతి లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం పవన్ కల్యాణ్ దృష్టికి వెళ్లడంతో.. వారిని ఆదుకోవాలని తమిళనాడు సీఎంకు ట్విట్టర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించిన సీఎం.. తగిన చర్యలు తీసుకున్నారు. పవన్ కల్యాణ్ చేసిన కృషికి నెటిజెన్స్ ఆయన్ను అభినందిస్తున్నారు. కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.50లక్షలు చొప్పున మొత్తం రూ.1కోటి విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

English summary
Chief Minister Palaniswami has responded positively to Janasena chief Pawan Kalyan's plea to help the trapped fishermen in Chennai's Harbor due to the lockdown. The authorities have been instructed to provide the necessary assistance to the fishermen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X