చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పన్నీర్ సెల్వం అసంతృప్తి: మీరు పోలీసులేనా, ఇలా చేస్తారా !

చెన్నైలో జల్లికట్టు నిరసన సందర్బంగా పోలీసులు ప్రవర్థించిన తీరుపై తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం మండిపడ్డారు. సోమవారం రాత్రి మెరీనా తీరంలో గస్తీ తిరుగుతున్న ఇద్దరు పోలీసులు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: జల్లికట్టు నిర్వహణ కోసం విద్యార్థులు చేస్తున్న ఆందోళన సందర్బంగా చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులు ప్రవర్థించిన తీరుపై తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిసింది.

పలు ప్రాంతాల్లో పోలీసులు ప్రజలు, ఆందోళన చేస్తున్న యువకులను లాఠీలతో అతి దారుణంగా చితకబాదారని వెలుగుచూడటంతో పన్నీర్ సెల్వం పోలీసు అధికారులను పిలిపించి ప్రశ్నించారని సమాచారం.

దెబ్బకు దిగింది: పెప్సీ, కోకాకోలా బ్యాన్: వీటికి భలే గిరాకీ వచ్చేసింది

చెన్నైలోని మెరీనా తీరంలో ఓ పోలీసే స్వయంగా ఆటోకు నిప్పంటించిన విషయం మీడియాలో ప్రసారం కావడం, ఈ విషయంపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ మండిపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు సోమవారం రాత్రి మెరీనా బీచ్ సమీపంలో పోలీసులు పలు వాహనాలు ధ్వంసం చేసిన విషయం వెలుగు చూసింది.

TamilNadu CM Panneerselvam very upset over the Police attack in Chennai.

రాత్రి రోడ్డు పక్కన పార్క్ చేసిన అనేక ద్విచక్రవాహనాలను గస్తీ తిరుగుతున్న ఇద్దరు పోలీసులు ధ్వంసం చేశారు. అదే రోడ్డులోని ఓ అపార్ట్ మెంట్ మీద ఉన్న వ్యక్తి దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది.

షాక్: శశికళ దెబ్బ, ఆమె బంధువులు మొత్తం ఇప్పుడు వీవీఐపీలే !

ఆ వీడియోలో ఇద్దరు పోలీసులు లాఠీలతో ద్విచక్రవాహనాలు ధ్వంసం చేస్తూ రోడ్డులో అటూఇటూ తిరుగుతున్న విషం స్పష్టంగా కనపడుతోంది. అంతే కాకుండ రోడ్డు పక్కన చిరు వ్యాపారులు ఏర్పాటు చేసిన చిన్నచిన్న టెంట్లను పోలీసులు పూర్తిగా నేలమట్టం చేసి విషయం వీడియోలో స్పష్టంగా కనపడుతోంది.

ఈ విషయం తెలుసుకున్న సీఎం పన్నీర్ సెల్వం పోలీసు అధికారులు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద కొందరు పోలీసులు చేసిన పనికి చెన్నై నగర పోలీసులు చెడ్డపేరును మూటకట్టుకున్నారు.

English summary
Sources said that TamilNadu Chief Minister O Panneerselvam very upset over the Police attack in Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X