వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో వైరల్: హవ్వా.. ఒక మంత్రి చేయాల్సిన పనేనా ఇది..గిరిజన బాలుడితో..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Viral Video: Minister Asks Tribal Boy To Remove Slippers | Now Trying to Settled Down Controversy

నీలగిరి: బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి గిరిజన బాలుడితో అసహ్యమైన పని చేయించిన తమిళనాడు మంత్రి దిండిగల్ శ్రీనివాసన్‌పై నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తమిళ నాడు రాష్ట్ర అటవీశాఖ మంత్రి దిండిగల్ శ్రీనివాసన్ నీలగిరి జిల్లా పర్యటనకు వెళ్లారు. అక్కడ ముడుమలై టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఉన్న ఆలయంను సందర్శించుకునేందుకు వెళ్లారు.

గిరిజన బాలుడితో చెప్పులు తీయించిన మంత్రి


ఆలయంలోకి ప్రవేశించేందుకు చెప్పులు వదలాల్సి ఉండటంతో ఆయన చెప్పులకు ఉన్న బెల్టును ఓ గిరిజన బాలుడితో తీయించుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. వీడియోను చూసిన నెటిజెన్లు మంత్రి తీరును తప్పుబట్టారు. అదే సమయంలో విమర్శలు గుప్పించారు. మంత్రి అక్కడున్న సమయంలో ఆయన చుట్టూ పోలీసులు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు. మరోవైపు నీలగిరి జిల్లా కలెక్టర్ దివ్య కూడా ఉన్నారు. బాలుడు మంత్రి చెప్పులకు ఉన్న బెల్టును తీస్తున్నప్పుడు వీరెవరూ వారించే ప్రయత్నం చేయలేదు.

 ఇటు రండిరా అని పిల్లలను పిలిచిన మంత్రి

ఇటు రండిరా అని పిల్లలను పిలిచిన మంత్రి

గిరిజన బాలుడు చెప్పులకున్న బెల్టు తీస్తున్న వీడియో సోషల్ మీడియాను చుట్టేస్తోంది. వీడియోలో కనిపించని మరో ఇద్దరి పిల్లలను మంత్రి ఇక్కడకి రండి అంటూ పిలుస్తున్నట్లుగా ఉంది. ఆ తర్వాత త్వరగా రండి అని మంత్రి పిలిచారు. ఇక ఒక అబ్బాయి దగ్గరకు రాగానే తన కాలు తీసి ముందుకు పెట్టి ఈ బకల్‌ను తీయి అంటూ చెప్పగా చెప్పులకు ఉన్న బకల్‌ను తీసేందుకు బాలుడు వంగాడు. బకల్ తీసిన బాలుడు ఇరులా గిరిజన వర్గానికి చెందినవాడు. అంతకుముందు పిల్లలు దగ్గరకు రాకపోవడంతో పార్టీ కార్యకర్తలు వారిని గదమాయించగా... తొందరేమీ లేదని మంత్రి చెబుతున్నట్లుగా వీడియోలో ఉంది.

మంత్రిపై మండిపడుతున్న సామాజిక కార్యకర్తలు, నెటిజెన్లు


దీనిపై అటవీశాఖ హక్కుల నేతలు తీవ్రంగా స్పందించారు. మంత్రి శ్రీనివాసన్ గతంలో కూడా పలుమార్లు నోరుజారి విమర్శలపాలయ్యారని అటవీశాఖ హక్కుల కార్యకర్త సెల్వరాజ్ చెప్పారు. కానీ ఈ సారి ఓ గిరిజన బాలుడితో చెప్పులు తీయించుకోవడం క్షమించరాని నేరమని చెప్పారు. ఇప్పటికే మంత్రి తీరుతో ముడుమలై ప్రాంతంలోని గిరిజనలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెప్పారు. వారిని పూటకోచోటికి తరలిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ అధికారులు పోలీసులు వారిని బెదిరిస్తున్నారని సెల్వరాజ్ చెప్పారు. అంతేకాదు అటవీసంపదను దోచుకునే మాఫియాలు కూడా బెదిరింపులకు దిగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సెల్వరాజ్ చెప్పారు. అంతేకాదు బాలుడిని వారించకుండా అలానే చూస్తుండిపోయిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

English summary
In a brazen act of high-handedness on Thursday, state Forest Minister, Dindigul C Sreenivasan made a youngster from the tribal community in Nilgiris district remove the buckle of his slippers in the Mudumalai Tiger Reserve (MTR)
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X