• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తమిళనాడులో రాజకీయ వేడి: హైకోర్టు తీర్పు నేపథ్యంలో రిసార్టుకు అనర్హత అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు

|

చెన్నై: కొన్ని నెలల గ్యాప్ తర్వాత మళ్లీ తమిళ రాజకీయాలు ఊపందుకున్నాయి. మళ్లీ అదే రిసార్ట్ పాలిటిక్స్ రిపీట్ అవుతున్నాయి. అనర్హత వేటు పడ్డ 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను తిరునేల్వేలి జిల్లాలోని కోర్టాలంలోని రిసార్ట్‌కు తరలించారు దినకరన్. దీంతో మళ్లీ రాజకీయ వేడు రాజుకుంది. ఈ వారంలోనే వారిపై ఉన్న అనర్హత వేటుకు సంబంధించిన కేసు మద్రాస్ హైకోర్టు ముందుకు రానుంది. ఇక అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలంతా శశికళ దినకర్‌నల వర్గానికి చెందిన వారు కావడం విశేషం.

రిసార్ట్‌కు బయలు దేరే ముందు తామరభరణి నదిలో ప్రవిత్ర స్నానాలు

రిసార్ట్‌కు బయలు దేరే ముందు తామరభరణి నదిలో ప్రవిత్ర స్నానాలు

అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలంతా తామరభరణి నదిలో పవిత్ర స్నానాలను ఆచరించారు. ఆ తర్వాత రిసార్ట్‌కు బయలుదేరి వెళ్లారు. ఇక మద్రాస్ హైకోర్టు నుంచి తీర్పు వెలువడే వరకు వారంతా రిసార్ట్‌లో ఉంటారని వెట్రివేల్ చెప్పారు. అనర్హతవేటు పడ్డ ఎమ్మెల్యేలను సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంలు ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉండటంతో వారందరినీ రిసార్ట్‌కు తరలించినట్లు సమాచారం.

సీబీఐ కొత్త డైరెక్టర్‌గా ఎం. నాగేశ్వరరావు... రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకున్న కేంద్రం

కీలకం కానున్న మద్రాస్ హైకోర్టు తీర్పు

కీలకం కానున్న మద్రాస్ హైకోర్టు తీర్పు

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదుతో ఆ 18 మంది ఎమ్మెల్యేలపై తమిళనాడు స్పీకర్ ధనపాల్ గతేడాది సెప్టెంబర్‌లో అనర్హత వేటు వేశారు. సీఎం పళని స్వామిని మార్చాలంటూ వీరంతా గవర్నర్‌కు లేఖ రాశారు. అదే సమయంలో అన్నాడీఎంకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నామని కూడా వారు లేఖలో పేర్కొన్నారు. ఈక్రమంలోనే కోర్టు తీర్పు కీలకం కానుంది. ఒకవేళ కోర్టు స్పీకర్ విధించిన అనర్హత వేటును తొలగిస్తూ తీర్పు చెబితే ఇక వీరు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలుగానే కొనసాగి ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం ఉంది.

 జయలలిత మృతి తర్వాత పార్టీలో బయటపడ్డ వర్గపోరు

జయలలిత మృతి తర్వాత పార్టీలో బయటపడ్డ వర్గపోరు

ఈ ఏడాది జూన్‌లో కేసును విచారణ చేసిన ద్విసభ్య ధర్మాసనం వేర్వేరు అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో కేసు మళ్లీ మొదటికి వచ్చింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి. డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం పార్టీ రెబల్‌గా మారారు. వీకే శశికల నేతృత్వంలోని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను నాడు కూవతూరు రిసార్టుకు తరలించారు. అనంతరం పన్నీర్ సెల్వం తన వర్గపు ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి పళని స్వామికి మద్దతు తెలపారు. ఈ క్రమంలోనే దినకరన్ తన వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలను ముందుగా పుదుచ్చేరి ఆ తర్వాత కూర్గ్‌లకు తీసుకెళ్లారు. అంతకుముందే ముఖ్యమంత్రిని మార్చాల్సిందిగా గవర్నర్‌కు లేఖ రాశారు.

ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో 20 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయగా ఆ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సభ్యులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 214 మంది సభ్యులే ఉన్నారు. ప్రస్తుతం అధికార అన్నాడీఎంకేకు 116 మంది సభ్యులు ఉన్నారు. ఇది 107కంటే ఈ సంఖ్య ఎక్కువగానే ఉంది.

English summary
The ‘resort politics’ in Tamil Nadu is back with most of the 18 disqualified MLAs of the AIADMK being moved to a resort at Courtallam in the Tirunelveli district, about 600 kilometres from Chennai as politics heat up in the state with speculations that the Madras High Court might decide their take up their disqualification case this week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X