వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Dangerous Dogs:అతన్ని వేటాడి వెంటాడి చంపాయి..విశ్వాసం లేని కుక్కలు..!

|
Google Oneindia TeluguNews

కడలూరు: తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. సాధారణంగా కుక్క విశ్వాసానికి మారు పేరు అని చెబుతారు. కానీ ఇప్పుడు మనం చదవబోయే కథలో మాత్రం కుక్కలే ఆ యజమాని పాలిట శాపంలా మారాయి. ఇంతకీ ఏం జరిగింది...?

కుక్క అంటే విశ్వాసానికి మారు పేరు

కుక్క అంటే విశ్వాసానికి మారు పేరు

కుక్క అంటే విశ్వాసానికి మారుపేరు అని అందరికీ తెలుసు. ఒక ముద్ద వేస్తే చాలు అది బతికినంత కాలం ఆ ముద్ద వేసిన వారిని మరవదు. వారికి ఎలాంటి హాని జరిగిన ముందుండి కాపాడేది కుక్కనే. యజమాని ప్రమాదంలో ఉంటే ముందుండి కాపాడేది కుక్కనే. ఇలాంటి కథనాలు చాలా చూశాం. చదివాం కూడా. కానీ తమిళనాడులో మాత్రం దారుణం చోటుచేసుకుంది. కడలూరు జిల్లాలోపి వల్లంపడుగై గ్రామంలో నివాసం ఉండే జీవనాథం అనే వ్యక్తి ప్రాణాలు తీశాయి రెండు శునకాలు.

పొలం కోసం రెండు కుక్కలు కొనుగోలు

పొలం కోసం రెండు కుక్కలు కొనుగోలు

జీవనాథం ఆ గ్రామంకు చెందిన కాంగ్రెస్ నేత విజయసుందరంకు చెందిన 10 ఎకరాల పొలంలో పనిచేసేవాడు. 2013 నుంచి జీవనాథం ఇక్కడే పనిచేస్తున్నాడు. అయితే ఆ పొలంలో పండే పంటకు కాపలాగా ఉండేవాడు. జంతువులు వచ్చి పొలంలోని పంటను నాశనం కాకుండా చూసుకునేవాడు. ఈ క్రమంలోనే పొలం యజమాని విజయసుందరం మూడేళ్ల క్రితం ఓ రెండు కుక్కలను కొనుగోలు చేసి తన పొలంలోనే వాటిని పెంచుతూ వచ్చాడు. పంట నష్టం కాకుండా ఆ కుక్కలు కాపలా ఉంటాయని, అదే సమయంలో జీవానాథంకు కూడా సహాయంగా ఉంటాయని భావించాడు.

ఆహారం పెట్టడం మరవడమే చేసిన పాపం

ఆహారం పెట్టడం మరవడమే చేసిన పాపం

ఇక జీవనాథం ఈ కుక్కలను చూసుకునేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే వాటికి ఆహారం పెట్టేవాడు. అలానే అదే సమయానికి తినడం అలవాటు చేసుకున్నాయి ఆ కుక్కలు. ఎప్పటిలాగానే మంగళవారం జీవనాథం పొలంకు ఉదయాన్నే చేరుకున్నాడు. కానీ పనిభారంతో ఆ కుక్కలకు ఉదయం ఆహారం పెట్టడం మరిచిపోయాడు. సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో కుక్కలకు ఆహారం పెట్టాలన్న సంగతి మరిచిపోయిన విషయం గుర్తుకు వచ్చి కుక్కలకు ఆహారం వేద్దామని వెళ్లాడు. అప్పటికే ఆహారం లేక అలమటించిపోయిన ఆ కుక్కలకు ఒక్కసారిగా కోపం వచ్చింది.

కట్లు విప్పగానే దాడి చేసిన కుక్కలు

కట్లు విప్పగానే దాడి చేసిన కుక్కలు

ఆ కుక్కలకు కట్లు విప్పగానే... ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా జీవనాథంపై దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి పరుగులు తీశాడు. అయినప్పటికీ ఆ కుక్కలు వదల్లేదు. జీవనాథం వెంట పడి ఆయనపై దాడి చేశాయి. కిందపడ్డ జీవనాథం చెవులను పీక్కుతిన్నాయి. మొహంపై కరిచాయి. దీంతో తీవ్రగాయాలపాలైన జీవనాథం అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ కుక్కలు రాట్‌వీలర్స్ జాతికి చెందినవి. ఇవి చాలా ప్రమాదకరమైనవి. వీటికి కోపం ఎక్కువని జంతుశాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కుక్కలు చాలా ప్రమాదకరంగా మారి మనుషుల ప్రాణాలు తీస్తుండటంతో స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, పోర్చుగల్, రొమానియా, ఉక్రెయిన్, రష్యా, ఇజ్రాయిల్‌ దేశాలతో పాటు అమెరికాలోని పలు రాష్ట్రాల్లో నిషేధించారు.

English summary
Two hungry dogs attacked a man in Tamilnadu's Cudalore district and killed him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X