వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హీరోయిన్‌తో కలిసి శ్రీలంకలో ప్రచారం: సల్మాన్ ఇంటి ముందు ధర్నా

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: వందలాది మంది తమిళులు ఆదివారం ఉదయం ముంబైలోని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. శ్రీలంకలో రాజపక్స తరఫున ప్రచారం చేసినందుకు అతను క్షమాపణలు చెప్పే వరకు తాము ఇలాగే అతని ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తామని వారు చెప్పారు.

సల్మాన్ ఖాన్ ఇంటి ముందు ధర్నాకు దిగిన వారిలో నామ్ తమిళర్ పార్టీకి చెందిన వారు కూడా ఉన్నారు. పోలీసులు పదహారు మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటున్నారు. పరిస్థితులు చేదాటిపోకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు.

సల్మాన్ ఖాన్, హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండేజ్ ఇటీవల శ్రీలంకలో మహింద రాజపక్శ తరఫున ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ శ్రీలంకలో పుట్టింది. అయితే, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ రాజపక్శ తరఫున ప్రచారం చేయడంపై తమిళ పార్టీలు భగ్గుమన్నాయి.

 Tamils hold protests outside Salman Khan's residence, security heightened

డీఎండీకే, డీఎంకే తదితర పార్టీలు మండిపడ్డాయి. డీఎంకే పార్టీ అధికార ప్రతినిధి ఇళంగోవన్ మాట్లాడుతూ.. భారత ఫిషర్ మెన్‌ పైన శ్రీలంక నావీ దాడులు చేస్తోందని గుర్తు చేశారు. ఇలాంటి సమయంలో సల్మాన్ ఖాన్ శ్రీలంకకు వెళ్లి రాజపక్స తరఫున ప్రచారం చేయడం సరికాదన్నారు. ఇది కేవలం తమిళనాడుకు సంబంధించిన విషయం కాదని, భారత్‌కు సంబంధించిందన్నారు.

రాజపక్శకు ప్రచారం చేయడం ద్వారా సల్మాన్ ఖాన్ భారత్ ఫిషర్ మెన్‌ను పరిగణలోకి తీసుకోలేదని అర్థమవుతోందన్నారు. ఇది తీవ్రంగా ఖండించదగ్గ విషయమన్నారు.

రాజపక్సకు మద్దతుగా సల్మాన్ ఖాన్ ప్రచారం చేయడంపై తమిళనాడులో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఎండిఎంకె అధినేత వైగో సల్మాన్ ఖాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమిళుల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సల్మాన్ ఖాన్ ఓ నమ్మక ద్రోహి అని విమర్శించారు.

English summary
A Tamil group on Sunday protested against actor Salman Khan outside his residence in Mumbai over his support to Sri Lankan President Mahinda Rajapaksa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X