వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌‌లో‌ ఏకంగా 'పోర్న్' వీడియోలే... నియంత్రణ అవసరం... సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు...

|
Google Oneindia TeluguNews

ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏకంగా పోర్న్ కంటెంట్‌ను కూడా ప్రసారం చేస్తున్నాయని... దీనిపై నియంత్రణ అవసరమని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. పోర్న్ కంటెంట్‌ నియంత్రణకు ఒక యంత్రాంగం తప్పనిసరి అని పేర్కొంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో కంటెంట్ నియంత్రణపై ఇటీవల కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలను శుక్రవారం(మార్చి 5) లోగా కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ఆదేశించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో ఉన్న 'తాండవ్' సినిమా వివాదానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై గురువారం(మార్చి 5) న్యాయస్థానం విచారణ చేపట్టింది.

అరెస్టు నుంచి బయటపడేందుకు..

అరెస్టు నుంచి బయటపడేందుకు..

సినిమాలో హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ అమెజాన్ టీమ్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీంతో ఈ కేసులో అరెస్టు నుంచి బయటపడేందుకు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఇండియా చీఫ్ అపర్ణ పురోహిత్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది. హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో పురోహిత్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి అశోక్ భూషణ్ నేత్రుత్వంలోని సుప్రీం బెంచ్ పురోహిత్ పిటిషన్‌పై తాజాగా విచారణ చేపట్టింది.

అపర్ణపై కేసులు షాకింగ్ : రోహత్గి

అపర్ణపై కేసులు షాకింగ్ : రోహత్గి

ఈ సందర్భంగా బెంచ్‌లోని న్యాయమూర్తుల్లో ఒకరైన ఆర్ఎస్ రెడ్డి మాట్లాడుతూ..'కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అశ్లీల కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నందునా... వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉంది.' అని పేర్కొన్నారు. అపర్ణ పురోహిత్ తరుపున కోర్టులో వాదనలు వినిపించిన న్యాయవాది ముకుల్ రోహత్గి.. 'తాండవ్ వివాదం విషయంలో అపర్ణపై కేసు పెట్టడం షాకింగ్‌‌గా అనిపించింది. ఎందుకంటే,ఆ సినిమాకు ఆమె నిర్మాత కాదు,అందులో నటి అంతకన్నా కాదు. అయినప్పటికీ ఆ సినిమాకు సంబంధించిన వివాదంపై దేశవ్యాప్తంగా నమోదైన 10 కేసుల్లో ఆమె పేరు కూడా చేర్చారు.' అని చెప్పుకొచ్చారు.

బెయిల్ దొరికేనా...?

బెయిల్ దొరికేనా...?

సుప్రీం కోర్టు ఈ కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కంటెంట్‌కు సంబంధించి ప్రభుత్వ గైడ్ లైన్స్‌ను,అపర్ణ పురోహిత్ బెయిల్ అంశాన్ని శుక్రవారం పరిశీలిస్తామని వెల్లడించింది.
కాగా,తాండవ్ సినిమాలో హిందూ మనోభావాలను దెబ్బతీయడంతో పాటు మతాల మధ్య చిచ్చుపెట్టే సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఉత్తరప్రదేశ్ పోలీసులు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ టీమ్‌పై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా మరికొన్ని చోట్ల కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ కేసుల నుంచి బయటపడేందుకు అమెజాన్ టీమ్ సతమతమవుతోంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు బుధవారం(మార్చి 3) క్షమాపణలు కూడా చెప్పింది. ఒకవేళ సుప్రీంలో కూడా అపర్ణ పురోహిత్ బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైతే ఆమెతో పాటు అమెజాన్ వీడియోస్ టీమ్ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

English summary
The Supreme Court on Thursday said that few over-the-top (OTT) platforms show some kind of pornographic content at times and there should be a mechanism to screen such programmes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X