వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియాలో సూపర్ డూపర్ పోలీస్ స్టేషన్.. దేశంలోనే నెంబర్ వన్.. ఎక్కడంటే..!

|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్ : ఇండియాలో అత్యుత్తమ పోలీస్ స్టేషన్‌గా రికార్డుల్లోకి ఎక్కింది ఒడిషాలోని "తరవా" పోలీస్ స్టేషన్. టాప్ టాప్ టెన్‌లో మొదటి స్థానం కైవసం చేసుకుంది ఈ పోలీస్ స్టేషన్. సుబర్నాపూర్ జిల్లాలో ఉండే ఈ పోలీస్ స్టేషన్‌కు ఇంతటి అరుదైన ఘనత దక్కడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఉత్తమ సేవలందిస్తున్న పోలీస్ స్టేషన్లను గుర్తించడంలో భాగంగా తరవా పోలీస్ స్టేషన్‌కు ఈ ఘనత దక్కడం విశేషం. ఫ్రెండ్లీ పోలీసింగ్, చిల్డ్రన్ ఫ్రెండ్లీ, స్మార్ట్ పోలీసింగ్, టెక్నాలజీ వాడకం తదితర విభాగాల్లో ఈ పోలీస్ స్టేషన్ దేశవ్యాప్తంగా ముందు నిలిచి మొదటిస్థానం దక్కించుకుంది. ఆ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పంపించిన ధృవీకరణ పత్రం, మెమెంటోను సుబర్నాపూర్ జిల్లా ఎస్పీ దేవీ ప్రసాద్ దాస్‌కు డీజీపీ ఓపీ శర్మ అందజేశారు.

<strong>కశ్మీర్‌లో ఫ్రీడమ్.. లోకల్స్‌తో అజిత్ దోవల్ లంచ్ (వీడియో)</strong>కశ్మీర్‌లో ఫ్రీడమ్.. లోకల్స్‌తో అజిత్ దోవల్ లంచ్ (వీడియో)

2018 సంవత్సరానికి దేశంలోని ఉత్తమ పోలీస్ స్టేషన్‌ల జాబితాలో తెలంగాణ నుంచి రెండు పోలీస్ స్టేషన్లు ఎంపికయ్యాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదు పోలీస్ స్టేషన్లకు ఆ జాబితాలో చోటు లభించింది. రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ పోలీస్ స్టేషన్‌కు మొదటి స్థానం దక్కింది. తెలంగాణలోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నారాయణపూర్ పోలీస్ స్టేషన్‌కు 14వ ర్యాంకు దక్కింది. అదే క్రమంలో నల్గొండ జిల్లా పరిధిలోని చింతలపల్లి పోలీస్ స్టేషన్‌కు 24వ ర్యాంకు దక్కడం విశేషం.

tarawa police station is top most first rank in india

ఏపీ నుంచి విజయనగరంలోని సీతానగరం పోలీస్ స్టేషన్‌కు 20వ ర్యాంకు దక్కగా.. అదే జిల్లాలోని పార్వతిపురం పోలీస్ స్టేషన్‌కు 25వ ర్యాంకు, బుదరాయవలస పోలీస్ స్టేషన్‌కు 30వ ర్యాంకు దక్కాయి. గుంటూరులోని సందోల్ పోలీస్ స్టేషన్‌కు 21వ ర్యాంకు లభించింది. అనంతపురంలోని పుత్లూరు పోలీస్ స్టేషన్‌కు 23వ ర్యాంకు వచ్చింది. అయితే టాప్ - 20 పోలీస్ స్టేషన్లలో మాత్రం తెలుగు రాష్ట్రాల నుంచి ఒక రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లోని నారాయణపూర్ పోలీస్ స్టేషన్‌కు మాత్రమే చోటు దక్కడం విశేషం. గతంలో ఉత్తమ పోలీస్‌ స్టేషన్‌గా ఉన్న పంజాగుట్ట స్టేషన్‌కు 2018 జాబితాలో చోటు దక్కలేదు. ఆ జాబితా విడుదల చేయడానికి దేశవ్యాప్తంగా 15,666 పోలీస్‌ స్టేషన్లను కేంద్రం ఎంపిక చేసింది. అందులో నుంచి టాప్ పోలీస్ స్టేషన్లను సెలక్ట్ చేశారు.

English summary
Odisha TARAWA Police Station is the best police station in India. The Police Station was the first to reach the top ten. Located in the Subarnapur district, the police station is a rarity for locals. The Police Station has been credited with the recognition of the Police Stations which serve the public at large.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X