వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాతో ఇక యుద్ధమే! 10 రోజులకే మన మందుగుండు సామగ్రి ఫినిష్!? ఆ తర్వాత?

తాజాగా సిక్కిం సరిహద్దులోని డోక్లామ్ వివాదం భారత్, చైనా నడుమ యుద్ధానికి నేపథ్యంగా మారుతోంది. ఇప్పటికే తన అధికారిక మీడియా ద్వారా మాటల యుద్ధం మొదలుపెట్టిన చైనా.. భారత్ పై ఇక చేతల యుద్ధానికి ‘సై’ అంటోంద

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇప్పటి వరకు పాకిస్తాన్ మాత్రమే మనకు పక్కలో బల్లెం అనుకున్నాం. కానీ నిజానికి మన శత్రువు చైనా అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆదినుంచీ చైనా తీరు కూడా ఈ మాటలకు నిదర్శనంగానే కనిపిస్తోంది.

తాజాగా సిక్కిం సరిహద్దులోని డోక్లామ్ వివాదం భారత్, చైనా నడుమ యుద్ధానికి నేపథ్యంగా మారుతోంది. ఇప్పటికే తన అధికారిక మీడియా ద్వారా మాటల యుద్ధం మొదలుపెట్టిన చైనా.. భారత్ పై ఇక చేతల యుద్ధానికి 'సై' అంటోంది.

డోక్లామ్‌లో అసలేం జరుగుతోంది?: 'యుద్దం'పై అమెరికా హెచ్చరిక.. ఏ క్షణంలో అయినా..డోక్లామ్‌లో అసలేం జరుగుతోంది?: 'యుద్దం'పై అమెరికా హెచ్చరిక.. ఏ క్షణంలో అయినా..

రెచ్చగొడుతున్న చైనా మీడియా...

రెచ్చగొడుతున్న చైనా మీడియా...

భారత్‌-చైనా మధ్య సరిహద్దు వివాదంపై మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది చైనా అధికారిక మీడియా. వివాదంపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ గురువారం పార్లమెంట్‌లో చెప్పిన విషయాలన్నీ అబద్ధాలేనని, భారత్‌కు ఏ దేశమూ మద్దతివ్వట్లేదని పేర్కొంది. ఈ మేరకు చైనా అధికారిక మీడియా ‘గ్లోబల్‌ టైమ్స్‌' తన తాజా సంపాదకీయంలో ప్రచురించింది.

Recommended Video

India to test launch Agni-V missile capable of hitting northernmost China | Oneindia News
సుష్మా స్వరాజ్ వి అబద్ధాలు...

సుష్మా స్వరాజ్ వి అబద్ధాలు...

‘రాజ్యసభలో సుష్మాస్వరాజ్‌ చెప్పినవి అబద్ధాలు అని చెప్పడానికి రెండు కారణాలున్నాయి. మొదటిది.. చైనా భూభాగంపై భారత్‌ దాడి చేస్తోంది. అంతేగాక, సరిహద్దులో ఆ దేశం ప్రవర్తిస్తున్న తీరుపై అంతర్జాతీయ సమాజం దిగ్భ్రాంతికి గురైంది. ఏ దేశం భారత్‌కు మద్దతివ్వట్లేదు. ఇక రెండోది.. భారత్‌ కన్నా చైనాకు మిలిటరీ సామర్థ్యం ఎక్కువ. ఒకవేళ యుద్ధమే జరిగితే భారత్‌ ఓడిపోవాల్సిందే' అని గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది.

మేం కాదు, మీరే ఉపసంహరించుకోవాలి...

మేం కాదు, మీరే ఉపసంహరించుకోవాలి...

సుష్మాస్వరాజ్‌ సూచించినట్లుగా రెండు దేశాల సైన్యాలు సరిహద్దుల నుంచి వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని చైనా మీడియా స్పష్టం చేసింది. చైనా బలగాలు వెనక్కి వెళ్లవని, భారత్‌ ఏకపక్షంగా సరిహద్దును వీడాలని సూచించింది. అంగుళం భూమిని కూడా వదులుకోడానికి చైనా సిద్ధంగా లేదని, ప్రజల సెంటిమెంట్‌ను చైనా ఆర్మీ ఎప్పటికీ బాధపెట్టబోదని పేర్కొంది. భారత బలగాలు వెనక్కి వెళ్లకపోతే.. ఇక ఈ సమస్యకు యుద్ధమే చివరి పరిష్కారమని కూడా చైనా మీడియా హెచ్చరికలు చేసింది.

ఏ క్షణంలోనూనా యుద్ధం?

ఏ క్షణంలోనూనా యుద్ధం?

సిక్కింలోని డోక్లామ్ లో చైనా రోడ్డు నిర్మించ తలపెట్టడంతో భారత్ రంగంలోకి దిగి వారి ఆధిపత్యాన్ని అడ్డుకుంటోంది. గత నెల నుంచి చైనాను పలుమార్లు హెచ్చరించినా వెనక్కి తగ్గకపోగా, సరిహద్దు వివాదానికి ఆజ్యం పోస్తుంది. దీంతో ఇరు దేశాల మధ్య ఏ క్షణంలోనైనా యుద్ధం వచ్చే అవకాశాలుకనిపిస్తున్నాయి. ఒకవైపు చర్చలకు సిద్ధమంటూనే మరోవైపు డోక్లామ్ నుంచి భారత సేనలు వైదొలగాలని ముందస్తు షరతు పెడుతున్న చైనా.. తన మీడియా ద్వారా భారత్‌తో యుద్ధానికి కాలుదువ్వుతోంది. సరిహద్దుల నుంచి భారత సేనలు వెనక్కి మళ్లకపోవడంతో.. ఇక యుద్ధం తప్పదని హెచ్చరిస్తోంది. చైనా సహనాన్ని భారత్‌ పరీక్షించిందని, ఇక సమరం తప్పదని చైనా అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ శుక్రవారం ఓ కథనంలో పేర్కొంది. భారత్‌ ఓడిపోవడమే గాక.. తన భూభాగాన్ని కూడా కోల్పోక తప్పదని హెచ్చరించింది. ఈ పరిస్థితిని గమనిస్తున్న అమెరికా పెంటగాన్ బృందం చైనా ప్రభావాన్ని తగ్గించే యత్నాల్లో పడింది.

చైనాతో భారత్ కు పోలికా, ఓటమి తప్పదు...

చైనాతో భారత్ కు పోలికా, ఓటమి తప్పదు...

చైనా శక్తిమంతమైన సైన్యంతో భారత మిలిటరీ శక్తిని పోల్చడం హాస్యాస్పదమని చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ తన సంపాదకీయంలో పేర్కొంది. సరిహద్దు సంక్షోభాన్ని యుద్ధమార్గంలో తేల్చుకోవాలనుకుంటే భారత్‌కు ఓటమి ఖాయమని హెచ్చరించింది. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) ఆయుధ సంపత్తితో భారత ఆయుధ సామగ్రి తులతూగదని, భారత్‌ ఇంకా మొండికేస్తే.. అందుకు తగ్గ పర్యవసానాలను కూడా ఎదుర్కోవలసి ఉంటుందని పేర్కొంది. టిబెట్‌ వద్ద చైనా ఆర్మీ విన్యాసాలు, ఆయుధ మోహరింపులు కేవలం ప్రదర్శన కోసం కాదని, ఢోక్లామ్ సంక్షోభం సుదీర్ఘ కాలం కొనసాగుతుందన్న భ్రమల నుంచి భారత్‌ బయటపడాలని సూచించింది.

భారత్‌కు చైనా శక్తి తెలియదు...

భారత్‌కు చైనా శక్తి తెలియదు...

సరిహద్దులో భారత సైన్యం భారీగా మోహరించినట్లు వార్తలు వస్తున్నాయని, కానీ కానీ భారత్‌కు చైనా శక్తి తెలియదని, 1962లో కూడా భారత్‌ చైనాను తక్కువగా అంచనా వేసి ఫలితం అనుభవించిందని, ఇప్పుడు మళ్లీ అదే పొరపాటు చేస్తోందని ఘాటుగానే హెచ్చరించింది. సైనిక చర్య ద్వారా సమస్యను పరిష్కరించుకుందామనుకుని ముప్పు తెచ్చుకోవద్దని, ఇక ప్రతి రోజూ భారత్‌పై సైనికపరంగా ఒత్తిడి తెస్తూనే ఉంటామని, దీనివల్ల భారత్‌కు పరాజయం తప్పదని.. అని గ్లోబల్‌టైమ్స్‌ తేల్చిచెప్పింది.

యుద్ధమే గనుక వస్తే ఏంటీ పరిస్థితి?

యుద్ధమే గనుక వస్తే ఏంటీ పరిస్థితి?

ఒకవేళ సరిహద్దులో పరిస్థితులు మరింత ముదిరి చైనాతో యుద్ధమే గనుక వస్తే.. మన పరిస్థితేమిటి? మన బలం, బలగం ఏమిటి? చైనాతో అసలు ఎన్నిరోజులు మనం యుద్ధం చేయగలం? ఇదే ఇప్పుడు భారత్ ముందున్న పెద్ద ప్రశ్న. ఎందుకంటే.. భారత్‌ మీదకు ఏ దేశమైనా దండెత్తితే ఇరవై రోజులకు మించి పోరాడే ఆయుధ సంపత్తి మన వద్ద లేదని కాంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) శుక్రవారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన తన నివేదికలో పేర్కొంది. ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డు(ఓఎఫ్‌బీ)కి సంబంధించిన వివరాలను కాగ్ తన నివేదికలో వివరించింది. కాగ్ నివేదిక ప్రకారం... దేశ రక్షణకు ఎంతో అవసరమైన యుద్ధ సామగ్రి పెద్ద మొత్తంలో మన వద్ద అందుబాటులో లేదు. 2013 నుంచి 2016 సెప్టెంబర్‌ వరకూ మన వద్ద ఉన్న యుద్ధ సామగ్రి నిల్వల్లో పెద్ద మార్పులేవి లేవు. ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే అత్యవసరమయ్యే 55 శాతం సామగ్రి కూడా అందుబాటులో లేదు.

సరిపడా ఆయుధ సామగ్రి కూడా లేదు...

సరిపడా ఆయుధ సామగ్రి కూడా లేదు...

భార‌త ఆర్మీలో స‌రిపోను ఆయుధాలు లేవట. మ‌న ఆర్మీ ద‌గ్గ‌ర ఉన్న మందుగుండు సామగ్రి యుద్ధానికి స‌రిపోద‌ట‌. ఒక‌వేళ యుద్ధం వ‌స్తే, మ‌న ఆయుధాలు కొద్దిరోజుల్లోనే ఖాళీ అవుతాయ‌ట‌. అంటే మ‌నం దీర్ఘ‌కాలం యుద్ధం చేయ‌లేమన్నమాట. ఈ విష‌యాన్ని కంప్ట్రోల‌ర్ అండ‌ర్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ త‌న నివేదిక‌లో పేర్కొన్న‌ది. శుక్ర‌వారం కాగ్ ఇచ్చిన నివేదిక‌ను ప్ర‌భుత్వం పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టింది. ఆర్మీకి స‌రిపోను ఆయుధ సామాగ్రి లేద‌ని గ‌తంలోనూ కాగ్ త‌న నివేదిక‌లో వెల్ల‌డించింది.

2013లోనే హెచ్చరించినా...

2013లోనే హెచ్చరించినా...

2013లో కూడా కాగ్ ఇదే త‌ర‌హా నివేదిక‌ను ఇచ్చింది. అప్పుడు కూడా దీర్ఘ కాలం యుద్ధం చేసే స‌త్తా మ‌న‌ ద‌గ్గ‌ర లేద‌ని కాగ్ పేర్కొన్న‌ది. మ‌న ఆర్మీకి దాదాపు 90 శాతం ముందుగుండు సామగ్రిని ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీ బోర్డు స‌ర‌ఫ‌రా చేస్తుంది. మిగ‌తా కావాల్సిన ఆయుధాల‌ను మ‌రో చోటు నుంచి ఆర్మీ తెప్పించుకుంటుంది. ఆర్టిల్ల‌రీతో పాటు ట్యాంక్ అమ్యునిష‌న్‌లో కొర‌త ఉన్న‌ట్లు నివేదిక పేర్కొన్న‌ది. అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టుగా ఆయుధాలు స‌ర‌ఫ‌రా చేయ‌లేక‌పోయిన‌ ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీదే బాధ్య‌త అని ఓఎఫ్‌బీపై నింద‌లు కూడా వేసింది కాగ్‌.

10 రోజులే యుద్ధం చేయగలం.. ఆ తర్వాత..?

10 రోజులే యుద్ధం చేయగలం.. ఆ తర్వాత..?

ఏ దేశంతోనైనా యుద్ధమే గనుక వస్తే.. వరుసగా 10 రోజులపాటు యుద్ధం జరిగితే.. మన దేశంలో అందుబాటులో ఉన్న 40 శాతం యుద్ధ సామగ్రి కూడా ఖతం అయిపోతుంది. ముఖ్యంగా మనకు ఆర్టిలరీ గన్స్‌, ట్యాంక్‌లకు అవసరమయ్యే యుద్ధ సామగ్రి కొరత తీవ్రంగా ఉంది. పేలుళ్లు, మిస్సైల్స్‌లో ఉపయోగించే ఫ్యూజ్‌ల కొరత మనకు ఎక్కువగా ఉందని ఆర్టిలరీ మాజీ లెఫ్టినెంట్‌ జనరల్‌ వీకే చతుర్వేది ఓ జాతీయ మీడియా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొనడం గమనార్హం. ఈ ఫ్యూజ్‌లు లేకపోతే యుద్ధంలో మిస్సైల్స్‌, మోర్టార్స్‌, ఆర్టిలరీ ఎక్స్‌ప్లోజివ్స్‌లను వినియోగించలేం.

యుద్ధం.. ఇరుదేశాలకూ నష్టం: అమెరికా

యుద్ధం.. ఇరుదేశాలకూ నష్టం: అమెరికా

భారత్, చైనా దేశాల మధ్య కొనసాగుతోన్న సరిహద్దు వివాదాలపై అమెరికా మరోసారి స్పందించింది. యుద్ధానికి దిగితే ఇరు దేశాలకు నష్టమేనని, నేరుగా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికా రక్షణ విభాగం హెచ్చరించింది. ఈ విషయాన్ని ఆ శాఖ అధికార ప్రతినిధి గ్యారీ రోస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పొరుగుదేశం చైనా దురాక్రమణలను ఏమాత్రం సహించేది లేదని భారత్ పలుమార్లు సందేశాలు పంపినా ప్రయోజనం లేకపోయిందని, చైనా పదేపదే సరిహద్దు విషయాల్లో కయ్యానికి కాలుదువ్వడాన్ని ఆమెరికా సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. చైనా తమ సైన్యాన్ని ఆధునికీకరించడంతో పాటు ఆర్థికపరమైన అంశాల్లో సరిహద్దు దేశాలను తమ నియంత్రణలోకి తెచ్చుకోవాలని భావిస్తుందని గ్యారీ రోస్ చెప్పారు.

English summary
The stock of as many as 61 types of ammunition - out of a total of 152 types of ammunition considered critical by the Indian Army to fight a war - is available for just 10 days only, the Comptroller and Auditor General of India (CAG) has found. The stocks of just 20 per cent of the armoury - 31 types of ammunition - were found to be satisfactory, the CAG has found. The CAG report was placed before the Parliament today. The Indian military is required to hold ammunition enough to fight a short intense war of 20 days. Earlier, Indian military was required to have store supplies, spares and ammunition - called War Wastage Reserve (WWR) - to fight a 40 day intense war. In 1999 the WWR was scaled down to only 20 days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X