వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసుల అదుపులో తేజ్‌పాల్: రేపటి వరకు బెయిల్

By Pratap
|
Google Oneindia TeluguNews

పానాజీ: మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడి కేసులో నిందితుడైన తెహెల్కా మాజీ సంపాదకుడు తరుణ్ తేజ్‌పాల్ శుక్రవారం సాయంత్రం గోవాకు చేరుకున్నారు. ఇక్కడికి చేరుకున్న వెంటనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం పోలీసులు తరుణ్ తేజ్‌పాల్‌ను అరెస్టు చేసే అవకాశం ఉంది. పోలీసుల విచారణకు హాజరు కావడానికే తాను గోవా వచ్చినట్లు తరుణ్ తేజ్‌పాల్ చెప్పారు. తేజ్‌పాల్‌కు మరింత ఊరట లభించింది. కోర్టు ఆయనకు రేపు శనివారం ఉదయం పది గంటల వరకు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.

అంతకు ముందు - తరుణ్‌ తేజ్‌పాల్‌ ఢిల్లీ విమానాశ్రయంలో దర్శనమిచ్చాడు. ఆయన వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఆయన నివాసానికి గోవా పోలీసులు శుక్రవారం ఉదయమే చేరుకున్నారు. అయితే, ఆయన జా కనిపించలేదు. ఆయన ఎక్కడున్నారనే విషయం చెప్పడానికి తరుణ్ తేజ్‌పాల్ భార్య గీతన్ బాత్రా నిరాకరించారు.

 Tarun Tejpal

ఆయనకు పానాజీ కోర్టు శుక్రవారం మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన అరెస్టుకు బ్రేక్ పడింది. ఇండిగో విమానంలో ఆయన గోవాకు చేరుకున్నారు. అరెస్టు నుంచి తరుణ్ తేజ్‌పాల్ తప్పించుకోలేరని అంటున్నారు.

లైంగిక దాడికి సంబంధించిన ఆరోపణలు వచ్చిన తర్వాత తేజ్‌పాల్ మొదటి సారి బయటి ప్రపంచానికి కనిపించారు. తనకు సమన్లు అందాయని, తాను గోవాకు వెళ్తున్నానని ఆయన చెప్పారు.

English summary
Tarun Tejpal is seen with his family members at Delhi's IGI Airport. He will take a Indigo flight to Goa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X