వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లైంగిక గాడి: తేజ్‌పాల్‌కు హైకోర్టులో చుక్కెదురు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులకు పాల్పడిన తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు న్యూఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. తరుణ్ తేజ్‌పాల్ దాఖలు చేసుకున్న అంటిసిపేటరి బెయిల్ పిటిషన్‌పై నిర్ణయాన్ని హైకోర్టు నవంబర్ 29 వరకు రిజర్వులో ఉంచింది. నాలుగు వారాలపాటు అరెస్ట్ నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో తరుణ్ తేజ్‌పాల్ అంటిసిపేటరి బెయిల్ దాఖలు చేసినట్లు సమాచారం.

అయితే తరుణ్ బెయిల్ పిటిషన్ బుధవారం ఉదయమే విచారణకు రావాల్సి ఉండగా తరుణ్ తేజ్‌పాల్ న్యాయవాది విన్నపం మేరకు వాయిదా పడింది. వాదనలు ప్రారంభమయ్యే సమయానికి అక్కడికి చేరుకున్న సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి తాను వాదించడానికి సిద్ధంగా ఉన్నానని గోవా పోలీసులకు తెలిపాడు. అయితే ఉదయం మాత్రమే వాదించగలనని చెప్పాడు.

Tarun Tejpal

మరో వైపు తరుణ్ తేజ్‌పాల్‌ను అరెస్ట్ చేసేందుకు గోవా పోలీసులు సిద్ధమవుతున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటల్లోపు విచారణాధికారి ఎదుట హాజరుకావాలని ఆయనకు గోవా పోలీసులు సమన్లు జారీ చేశారు. తేజ్‌పాల్ అరెస్ట్ తప్పకపోవచ్చని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ వ్యాఖ్యానించిన కొద్ది సేపటికే సమన్లు జారీ కావడం గమనార్హం.

గురువారం తేజ్‌పాల్‌ను అరెస్ట్ చేసే అవకాశముందని అంచనా వేస్తున్నారు. బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని గోవా డిజిపి ఓపి మిశ్రా తెలిపారు. నవంబర్ 7, 8 తేదీల్లో గోవాలోని ఓ హోటల్‌లోని లిఫ్టులో మహిళా జర్నలిస్టును తేజ్‌పాల్ లైంగికంగా వేధించారనే అభియోగంపై గోవా పోలీసులు నవంబర్ 22న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తేజ్‌పాల్‌పై ఐపిసి సెక్షన్లు 376(అత్యాచారం), 376(2)(కె), 354(దౌర్జన్యం) కింద అభియోగాలు నమోదయ్యాయి.

English summary
The Delhi high court on Wednesday refused to provide immediate relief to Tarun Tejpal and reserved its order on his anticipatory bail plea till November 29.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X