వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆమెనలా చూసినప్పుడు.. రెహమాన్ కుమార్తెపై తస్లీమా సంచలన వ్యాఖ్యలు, ధీటైన రిప్లై..

|
Google Oneindia TeluguNews

బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కుమార్తెపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. బుర్ఖా ధరించిన రెహమాన్ కుమార్తె ఖతీజాను చూస్తే ఊపిరి సలపని ఫీలింగ్ కలుగుతుందని వ్యాఖ్యానించారు. ఖతీజా బుర్ఖా ధరించడంపై గతేడాది సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. అయితే తమ ఇంట్లో వస్త్రధారణపై ఎటువంటి ఆంక్షలు లేవని, తమ కుటుంబ సభ్యులు వారికి ఇష్టమైన దుస్తులను ధరించే స్వేచ్చ ఉందని రెహమాన్ విమర్శకుల నోళ్లు మూయించారు. ఇది జరిగిన ఏడాదికి ఇప్పుడు మళ్లీ తస్లీమా రూపంలో రెహమాన్ కుమార్తె వస్త్రధారణపై విమర్శలు రావడం గమనార్హం.

ఆమెనలా చూసినప్పుడు..

తాను ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని చాలా ఇష్టపడుతానని చెప్పిన తస్లీమా.. కానీ రెహమాన్ కుమార్తెను బుర్ఖాలో చూసినప్పుడు మాత్రం ఊపిరి సలపనట్టుగా ఫీల్ అవుతానని చెప్పారు. ఒక విద్యావంతురాలైన యువతి కూడా చాలా సులువుగా బ్రెయిన్ వాష్ చేయబడుతుందని తెలిసి బాధగా ఉంటుందన్నారు. తస్లీమా వ్యాఖ్యలపై ఖతీజా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించారు. తాను కోరుకున్నది ధరించడం తన ఇష్టం అని స్పష్టం చేశారు.

 రెహమాన్ కుమార్తె రిప్లై..

రెహమాన్ కుమార్తె రిప్లై..

'ఏడాది కూడా కాలేదు.. అప్పుడే ఈ టాపిక్ మళ్లీ చర్చకు వచ్చింది. దేశంలో ఎంతో జరుగుతోంది.. కానీ చాలామంది.. మహిళలు ఏం ధరించాలనే దానిపైనే ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. నాకు చాలా ఆశ్చర్యమనిపిస్తోంది.. ఈ టాపిక్ చర్చకు వచ్చినప్పుడల్లా నాలో ఆవేశం రేగుతుంది. చాలా విషయాలు చెప్పాలనుకుంటాను. గత ఏడాది కాలంగా నాకు నేనే.. నాలో మునుపెన్నడూ చూడని కొత్త వెర్షన్‌ను చూస్తున్నాను.' అని ఖతీజా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు.

నేనేమీ అంత బలహీనురాలిని కాదన్న ఖతీజా..

'నా జీవితంలో నేను తీసుకునే ఛాయిస్‌కు చింతించేంత బలహీనురాలిని కాను. నా జీవితం పట్ల నేను సంతోషంగా,గర్వంగా ఉన్నాను. నన్ను నన్నుగా అంగీకరించేవారికి ధన్యవాదాలు. నేను చేసే పనే మాట్లాడుతుంది... ఆపై దేవుడి కృప.. ఇంతకుమించి ఇంకేమీ చెప్పదలుచుకోలేదు. నేను ఇలా వివరణ ఇచ్చుకోవడమేంటని ఎవరికైనా అనిపించవచ్చు.. కానీ ఎవరికోసం వారే మాట్లాడాలి. అందుకే ఇదంతా.' అంటూ చెప్పుకొచ్చారు.

 డియర్ తస్లీమా..

డియర్ తస్లీమా..

'డియర్ తస్లీమా నస్రీన్.. మీరు నా వస్త్రధారణను చూసి ఊపిరి సలపనట్టుగా ఫీల్ అవుతున్నందుకు సారీ. కాస్త కొత్త గాలిని పీల్చుకోండి. నేనేదైతే చేస్తున్నాననో దానివల్ల నేనేమీ ఊపిరి సలపనట్టుగా భావించట్లేదు. పైగా అది నాకు గర్వంగా అనిపిస్తుంది. దానికోసం నేను కట్టుబడి ఉంటాను. నేను మీకిచ్చే సలహా ఏంటంటే.. గూగుల్‌లో ఒకసారి అసలు ఫెమినిజం అంటే ఏమిటని వెతకండి. నిజమైన ఫెమినిజం ఇతర మహిళలను ఎప్పుడూ కించపరచదు లేదా వారి తండ్రుల్ని ఇష్యూలోకి లాగదు. అసలు నేను నా ఫోటోలను మీ పరిశీలన కోసం,మెప్పు కోసం మీకు పంపించినట్టు నాకైతే గుర్తు లేదు.' అంటూ ముగించారు.

English summary
Writer Taslima Nasreen is known for the controversial statements she makes on social media. This time, her opinion on AR Rahman's daughter Khatija wearing a burqa has baffled the netizens. She said that she feels suffocating when she looks at Khatija wearing a burqa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X