వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెచ్ -1 బీ వీసా ధరఖాస్తులను తగ్గించేసిన టిసిఎస్, కారణమిదే

దేశీయ సాఫ్ట్ వర్ దిగ్గజం టీసీఎస్ హెచ్ -1 బీ వీసా ధరఖాస్తులను గణనీయంగా తగ్గించేసింది. 2015 ధరఖాస్తు చేసుకొన్న వాటిల్లో మూడోవంతు మాత్రమే ఈ సారి ధరఖాస్తు చేసుకొంది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశీయ సాఫ్ట్ వర్ దిగ్గజం టీసీఎస్ హెచ్ -1 బీ వీసా ధరఖాస్తులను గణనీయంగా తగ్గించేసింది. 2015 ధరఖాస్తు చేసుకొన్న వాటిల్లో మూడోవంతు మాత్రమే ఈ సారి ధరఖాస్తు చేసుకొంది.

టీసీఎస్, ఇన్పోసిస్ , కాగ్నిజెంట్ లు హెచ్ -1 బీ వీసాలు తమ సంస్థల్లోకి మళ్ళించుకొంటున్నాయన్న ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకొంది.

Tata Consultancy Services’ H-1B visa applications now a third of 2015 levels
అమెరికాలోని కళాశాలల క్యాంపస్ లు, బి- స్కూల్స్ లో ప్రాంగణ ఎంపికల ద్వారా నియమకాలు చేపడుతోంది. ఇప్పటికే భారతీయ ఐటీ కంపెనీలకు అమెరికా వీసాలు కఠినతరం చేయడంతో ఈ నిర్ణయం తీసుకొన్నారు. భారత్ లో విజయవంతమూన పలు విధానాల,నే ఇక్కడ అమలు చేస్తున్నామని టీసిఎస్ మానవవనరుల విభాగం ఈవీపీ అజయ్ ముఖర్జీ వార్షిక నివేదికలో పేర్కొన్నారు.

అమెరికాలోని టాప్ బి-స్కూల్స్ నుండి వందల సంఖ్యలో ఇంజనీరింగ్, ఏంబీఏ గ్రాడ్యుయేట్లను నియమించుకొంటున్నట్టు చెప్పారు. ఇవన్నీ వర్క్ వీసాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తున్నాయన్నారు.

గత ఏడాది ,ప్రస్తుత ఏడాది మా వీసా ధరఖాస్తుల సంఖ్య బాగా తగ్గిందన్నారు.ఒక్క అమెరికాలో కాకుండా అస్ట్రేలియా, సింగపూర్ లో కూడ పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో పలు సంస్థలు తమ వ్యాపార విధానాలను మార్చుకొంటున్నాయి. వచ్చే రెండేళ్ళలో పదివేల అమెరికన్లను నియమించుకొంటామని ఇప్పటికే ఇన్పోసిస్ ప్రకటించింది.

English summary
Tata Consultancy Services (TCS) applied for only a third of the H-1B work visas this year compared to 2015, helped by increased hiring from engineering campuses and B-schools in the US. The move comes at a time when the Indian IT companies are confronted by closer scrutiny and tighter visa norms in the US, a market that accounts for nearly 60 per cent of India’s IT exports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X