వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టాటాకు మిస్త్రీ మరో షాక్: హెచ్ఆర్ హెడ్ రాజన్ రాజీనామా

|
Google Oneindia TeluguNews

ముంబై: గత కొన్ని రోజులుగా టాటా సన్స్ గ్రూపులో చోటు చేసుకుంటున్న పరిణామాలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయి. తాజగా మరో సంచలన చోటు చేసుకుంది. టాటా గ్రూప్స్ చీఫ్ ఆఫ్ హ్యుమన్ రిసోర్సెస్(సీహెచ్ఆర్ఓ) తన పదవికి రాజీనామా చేశారు. కాగా, శుక్రవారం రాజీనామా పేపర్లను గ్రూప్‌కు సమర్పించారు.

టాగా గ్రూప్ ఛైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీ తొలగించిన నాలుగు రోజుల్లోనే రాజన్ రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, రాజన్ కలిగి ఉన్న గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా రద్దయింది. ఈ నేపథ్యంలో కొత్త సీహెచ్ఆర్ఓను త్వరలోనే టాటా గ్రూప్ నియమించనుంది. రాజన్‌ను హెచ్ఆర్ అధినేతగా మిస్త్రీనే నియమించడం గమనార్హం.

Tata group HR head N S Rajan, handpicked by Cyrus Mistry, quits

మిస్త్రీని అర్ధంతరంగా ఛైర్మన్ పదవి నుంచి తొలగించిన నేపథ్యంలోనే రాజన్ కూడా తన రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, గ్రూప్ కంపెనీల హెచ్ఆర్ ప్రక్రియలపై రాజన్ రాజీనామా ప్రభావం ఉండదని టాటా వర్గాలు చెబుతున్నాయి. తమ సంస్థ సొంత హ్యుమన్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్స్, హెడ్స్‌ను కలిగి ఉందని పేర్కొంటున్నాయి.

కాగా, జీఈసీ ఉప సంహరణతోనే రాజన్ గ్రూప్ నుంచి వైదొలిగినట్లు సమాచారం. 2013లో టాటా గ్రూప్ సీహెచ్ఆర్ఓగా రాజన్ నియమితులయ్యారు. ర్యాన్ బ్యాక్సీ, ఏషియన్ పెయింట్స్, బ్లైప్లాస్ట్, ఏబీసీ కన్సల్టెంట్స్, ఏషియా ఆన్ లైన్ వంటి కంపెనీల్లో మూడు దశాబ్దాలకు పైా పని చేసిన అనుభవాన్ని ఆయన కలిగి ఉన్నారు.

మిస్త్రీ తొలగింపుతో మార్కెట్‌లో టాటా గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ 55కోట్లపైగా హరించుకుపోయిన విషయం తెలిసిందే. తాజాగా రాజన్ కూడా టాటా సంస్థకు రాజీనామా చేయడం ప్రాధాన్యాంశంగా మారింది.

మరో ఇద్దరు కూడా

రాజన్ తోపాటు మరో ఇద్దరు ఉన్నతస్థాయి పదవులను వదలుకున్నారు. బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ మధు కన్నన్‌, వ్యూహకర్త నిర్మాల్య కుమార్‌. కిందటి సోమవారం జీఈసీ రద్దు చేశారు. ముగ్గురు ప్రస్తుతం రాజీనామా చేయగా మరో ఇద్దరిని వేరే విధులకు పంపించారు. వీరిలో బ్రాండ్‌ కస్టోడియన్‌ ముకుంద్‌ రాజన్‌, టైటాన్‌ సీవోవో హర్షాభట్‌ ఉన్నారు.

English summary
Repercussions of Cyrus Mistry's ouster have begun to be felt at Bombay House. Tata Group's chief of human resources (CHRO), N S Rajan, on Friday put in his papers, sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X