వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైరస్ మిస్త్రీ ఎఫెక్ట్: టాటా గ్రూప్‌కు రూ.55వేల కోట్ల భారీ నష్టం

|
Google Oneindia TeluguNews

ముంబై: టాటా సన్స్ గ్రూప్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తొలగించిన అనంతరం కలకలం చెలరేగుతోంది. ఆయన తొలగింపుపై ఓ వైపు ఏం జరిగి ఉంటుందే చర్చ జరుగుతుండగానే, బోర్డు సభ్యులకు ఆయన పంపిన ఘాటు ఈమెయిల్ కలకలం రేపింది. వెంటనే టాటా తరఫు లాయర్ కూడా మిస్త్రీ పైన మండిపడ్డారు.

బోర్డు పిచ్చిదనుకుంటున్నావా: సైరస్ మిస్త్రీపై టాటా లాయర్ అభిషేక్

టాటా గ్రూప్‌లో ప్రకంపనల నేపథ్యంలో మార్కెట్లో గత మూడెళ్లలో ఎన్నడు లేనంత నష్టం సంభవించింది. ఈ మూడు రోజుల్లో టాటా కంపెనీకు రూ.55వేల కోట్ల నష్టం వచ్చింది. తాజ్ హోటల్ గ్రూప్‌కు చెందిన ఇండియన్ హోటల్ కంపెనీ పది నుంచి 13 శాతానికి పడిపోయింది.

Tata Group loses over $8 bn since Cyrus Mistry's exit

కాగా, అనూహ్య రీతిలో టాటా గ్రూప్‌ నుంచి తొలగింపునకు గురయిన సైరస్‌ మిస్త్రీ నిన్న పలు ఆరోపణల అస్త్రాలు వదిలారు. గ్రూపులో తనను అసమర్థ ఛైర్మన్ కిందకు జమకట్టి, నిర్ణయాధికార ప్రక్రియలో మార్పులు చేశారని, ప్రత్యామ్నాయ శక్తులకు సృష్టించారని టాటా సన్స్‌ బోర్డు డైరెక్టర్లకు రాసిన లేఖలో ఆయన విరుచుకుపడ్డారు.

మంగళవారమే ఈ రహస్య లేఖ రాసినప్పటికీ అది బుధవారం మీడియా చేతికి చిక్కింది. సహేతుక కారణం చూపకుండా, ఎలాంటి వివరణ తీసుకోకుండా, భారత్‌లోనే అతిపెద్ద కార్పొరేట్‌ దిగ్గజ సంస్థలో ఒక ఛైర్మన్‌ను తొలగించారని పేర్కొన్నారు. కార్పొరేట్‌ చరిత్రలో ఇది మచ్చగా మిగిలిపోయే అవకాశం ఉందన్నారు.

English summary
Tata Group stocks have lost a combined $8.22 billion (₹55,000 crore) in market value in the last three days, after the group removed Cyrus Mistry as its Chairman. The Indian Hotel Company, branded as the Taj Group, saw the steepest fall of 10% on Thursday. Notably, Ratan Tata has been appointed as the group's Interim Chairman for four months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X