వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో మరో వ్యాక్సిన్: మోడెర్నా కోవిడ్ వ్యాక్సిన్ లాంచ్ చేసేందుకు టాటా ప్రయత్నాలు

|
Google Oneindia TeluguNews

ముంబై: భారతదేశంలో మరో వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. దేశంలోకి మోడెర్నా కరోనావైరస్ టీకాను తీసుకువచ్చేందుకు టాటా గ్రూప్ ప్రయత్నాలు ప్రారంభించింది. దీనికి సంబంధించి మోడెర్నా సంస్థతో టాటా మెడికల్ అండ్ డయాగ్నస్టిక్స్ చర్చలు జరుపుతోందని తెలిసింది.

Recommended Video

Ratan Tata's Help To Andhra Pradesh In Lockdown

ఇప్పటికే సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనికా సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ టీకా కోవాగ్జిన్‌లను కేంద్రం అత్యవసర వినియోగం కింద పంపిణీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్ మోడెర్నా టీకాకు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు టాటా మెడికల్ అండ్ డయాగ్నస్టిక్స్ ముందుకొచ్చినట్లు సమాచారం.

Tata In Talks To Launch Moderna COVID-19 Vaccine In India: Report

ఇందుకోసం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్)తో జట్టుకట్టనుందని టాటా గ్రూప్ హెల్త్ కేర్‌కు సంబంధించిన వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ వార్తలపై మోడెర్నా కానీ, టాటా సంస్థల నుంచి కానీ అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

కాగా, నవంబర్ నెలలో విడుదలైన తుది దశ ప్రయోగ ఫలితాల్లో మోడెర్నా 94.1 శాతం సమర్థవంతమైందని వెల్లడైన విషయం తెలిసిందే. అలాగే, ప్రయోగాల సమయంలో తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తలేదని సంస్థ తెలిపింది. ఇప్పటికే ఈ టీకాను అమెరికా, ఐరోపా దేశాలు అనుమతించి పంపిణీ చేస్తున్నాయి. ఇప్పుడు టాటా గ్రూప్ హెల్త్ కేర్ వెంచర్ ప్రయత్నాలు ఫలిస్తే భారతదేశంలో కూడా కోవిషీల్డ్, కోవాగ్జిన్ తర్వాత మోడెర్నా కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు.

ఫైజర్ వ్యాక్సిన్.. మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే తక్కువ వద్ద ఉంచాలి, కానీ, మోడెర్నా టీకాను మాత్రం సాధారణ ఫ్రిజ్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయవచ్చు, ఇది చల్లని గొలుసులు పరిమితం అయిన భారతదేశం వంటి పేద దేశాలకు మరింత అనుకూలంగా ఉంటుంది.

స్థానికంగా బ్రాండ్ చేయబడిన కోవిషీల్డ్. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ మొత్తం సామర్థ్యం విదేశాలలో చేసిన ట్రయల్స్ ఆధారంగా 70.42% అని భారతదేశ డ్రగ్స్ కంట్రోలర్ తెలిపింది, అయితే భారత్ బయోటెక్.. కోవాక్సిన్ ఆమోదం సమర్థత డేటా లేకపోవడం వల్ల విమర్శలను ఎదుర్కొంది.

English summary
Tata Medical & Diagnostics could team up with the India's Council of Scientific and Industrial Research to carry out clinical trials of Moderna's vaccine candidate in India, the report said, citing officials familiar with the matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X