వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సైరస్ మిస్త్రీకి మరో షాక్: అన్ని పదవుల నుంచి తొలగింపు
ముంబై: సైరస్ మిస్త్రీకి మరో షాక్. టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి గత ఏడాది తొలగింపబడిన ఆయనను.. సోమవారం నాడు అన్ని కంపెనీల డెైరెక్టర్ పదవుల నుంచి టాటా సన్స్ తొలగించింది.
మరోవైపు, టాటా - మిస్త్రీ బోర్డు వార్ గత కొద్ది రోజులుగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. టాటా సన్స్ చైర్మన్‌గా ఆయనకు ఉద్వాసన పలికిన అనంతర పరిణామాల నేపథ్యంలో.. టాటా గ్రూప్‌కు భారీ షాక్ కూడా తగిలింది.

ప్రపంచంలో టాప్ 100 బ్రాండ్ ర్యాంక్ నుంచి వైదొలిగింది. బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం టాటా గ్రూప్ ర్యాంకింగ్ 21 స్థానాలు కిందకు దిగజారింది. గత ఏడాది 82వ స్థానం నుంచి ఈ ఏడాది 103వ స్థానంలో నిలిచింది. టాప్ 100 జాబితా నుంచి కిందకు పడిపోవడం ఇదే మొదటిసారి అని బ్రాండ్ ఫైనాన్స్ నివేదించింది.