• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సంక్షోభ కాలాన కొండంత అండగా-ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునే స్కీమ్-టాటా నిర్ణయానికి జనం హ్యాట్సాఫ్

|

కార్పోరేట్ రంగంలో దయా దాక్షిణ్యాలకు,మానవతా దృక్పథానికి స్పేస్ తక్కువేనని చెప్పాలి. సంక్షోభ సమయాల్లో ఉద్యోగులకు అండగా నిలబడే కంపెనీల కంటే వారిని వదిలించుకోవడమే ఉత్తమం అనుకునే కంపెనీలే ఎక్కువగా ఉంటాయి. కరోనా సంక్షోభం వేళ కొన్ని కార్పోరేట్ కంపెనీలు నిర్దాక్షిణ్యంగా ఉద్యోగులను సాగనంపాయి. దీంతో కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. కార్పోరేట్ రంగంలో ఓవైపు ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంటే... ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు టాటా కంపెనీలో కనిపిస్తున్నాయి. సంక్షోభ సమయంలో ఉద్యోగులకు టాటా అండగా నిలబడుతున్న వైనం చూస్తే నిజంగా హ్యాట్సాఫ్ చెప్పక తప్పదు...

ఉద్యోగి మరణించినా... అతని కుటుంబానికి వేతనం...

ఉద్యోగి మరణించినా... అతని కుటుంబానికి వేతనం...

కరోనా వేళ టాటా స్టీల్ కీలక ప్రకటన చేసింది. తమ సంస్థలో పనిచేస్తూ కోవిడ్‌తో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు అత్యంత ఊరటనిచ్చే వార్త చెప్పింది. కోవిడ్‌తో ఎవరైనా ఉద్యోగి మరణించినప్పటికీ... అతని నెల జీతాన్ని కొనసాగిస్తామని,దాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామని వెల్లడించింది. ఆ ఉద్యోగి చివరిసారిగా అందుకున్న వేతనాన్ని.. అతనికి 60 ఏళ్లు వచ్చేవరకూ ప్రతీ నెలా ఆ కుటుంబానికి అందజేస్తామని స్పష్టం చేసింది. అంతేకాదు,మరణించిన ఉద్యోగుల పిల్లలు భారత్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేంతవరకూ ఆ చదువుకు అయ్యే ఖర్చును తామే భరిస్తామని ప్రకటించింది. అలాగే ఆ కుటుంబాలకు మెడికల్ బెనిఫిట్స్,హౌసింగ్ సదుపాయం కూడా కొనసాగుతాయని తెలిపింది.

సంక్షోభ సమయంలో కొండంత అండగా...

సంక్షోభ సమయంలో కొండంత అండగా...

'కోవిడ్‌తో ఎఫెక్ట్ అయిన ఉద్యోగుల కుటుంబాలకు #AgilityWithCare ద్వారా సామాజిక భద్రతను కల్పించే స్కీమ్స్ అందించాలనుకుంటున్నాం. ఈ సంక్లిష్ఠ సమయంలో మాకు వీలైనంత మేర సాయం మేము అందిస్తున్నాం. అలాగే ప్రతీ ఒక్కరూ తమ చుట్టూ ఉన్నవాళ్లలో కష్టాల్లో ఉన్నవారికి శక్తి మేరకు సాయం చేయాలని కోరుతున్నాం.' అని జంషెడ్ పూర్‌ కేంద్రంగా పనిచేసే టాటా స్టీల్ ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేసింది. టాటా స్టీల్ కంపెనీ ఎల్లప్పుడూ తమ ఉద్యోగులకు అండగా నిలుస్తుందని... ఇప్పుడు కూడా అదే చేస్తున్నామని తెలిపింది.

సర్వత్రా ప్రశంసలు

కరోనా కష్ట కాలంలో టాటా స్టీల్ కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా ఒక ఉద్యోగి మరణించాడంటే... అతనికి ఇవ్వాల్సిన వేతనం,ఇతరత్రా బెనిఫిట్స్ ఇచ్చేసి సంస్థలు చేతులు దులుపుకుంటాయి. కానీ ఉద్యోగి మరణానంతరం కూడా అతని కుటుంబానికి అండగా నిలబడాలని టాటా తీసుకున్న నిర్ణయాన్ని ప్రతీ ఒక్కరు ప్రశంసిస్తున్నారు. టాటా నిర్ణయం వేలాది కుటుంబాలకు ఆసరా అని, ఎంతోమందికి స్పూర్తిదాయకం అని అభిప్రాయపడుతున్నారు. దేశంలో కరోనాపై పోరుకు కూడా టాటా తనవంతుగా రూ.1500 కోట్లు అందజేసిన సంగతి తెలిసిందే.

English summary
Tata Steel has announced social security schemes for the family members of employees affected by Covid-19. The company announced on Sunday that under the scheme, if an employee dies of Covid, their family would receive their last-drawn salary till the time the employee would have turned 60. "Tata Steel's best-in-class social security schemes will help ensure an honourable standard of living for their families, whereby the family will get the last drawn salary till 60 years of age of the deceased employee/nominee,"
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X