వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్యాష్‌లెస్ కోసం వ్యూహం: రూ.2వేల లోపు సర్వీస్ ట్యాక్స్ ఉండదు!

రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత దేశంలో క్యాష్ లెస్ లావాదేవీల వైపు మరికొందరు మొగ్గు చూపుతున్నారు. ప్రజలను దాదాపుగా క్యాష్ లెస్ లావాదేవీల వైపు మళ్లించేందుకు కేంద్రం యోచిస్తోంది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత దేశంలో క్యాష్ లెస్ లావాదేవీల వైపు మరికొందరు మొగ్గు చూపుతున్నారు. ప్రజలను దాదాపుగా క్యాష్ లెస్ లావాదేవీల వైపు మళ్లించేందుకు కేంద్రం యోచిస్తోంది. ఇందులో భాగంగా డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టింది.

డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా రూ.2వేల లోపు జరిపే లావాదేవీలకు సర్వీస్ ట్యాక్స్ ఎత్తివేయాలని భావిస్తోంది. ఇలా చేయడం ద్వారా ప్రజలను నగదు రహిత లావాదేవీల వైపు మళ్లించేందుకు మరింత సులువు అవుతోందని భావిస్తోంది.

మరోవైపు, నోట్ల రద్దు నిర్ణయం వల్ల సామాన్యులు బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల వద్ద ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యుల ఇబ్బంది దృష్ట్యా ఆర్బీఐ చేసిన ప్రకటన కొంత ఊరట కలిగించే విధంగా ఉంది.

Tax Break On Payments Upto Rs 2000 If You Use Card, Not Cash

త్వరలో విత్ డ్రా పరిమితి పెంచుతామని ఆర్బీఐ ప్రకటించింది. డిమాండుకు తగిన విధంగా నోట్లు ఉన్నాయని తెలిపింది. సాధారణ పరిస్థితికి రాగానే విత్ డ్రా పైన పెట్టిన ఆంక్షలు, పరిమితులు ఎత్తివేస్తామని ప్రకటించింది.

మరో రెండు వారాల్లో కొత్త రూ.1వేలు, రూ.5వందల నోట్లు అందరికీ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. కొత్త వెయ్యి నోట్లను రూపొందిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు.

English summary
Tax Break On Payments Upto Rs 2000 If You Use Card, Not Cash.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X