• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఐటీ నిఘా నెట్: నిపుణుల లావాదేవీలపైనా ఫోకస్..

By Swetha Basvababu
|

న్యూఢిల్లీ: 'మీరు ఏటా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రూపేణా రూ.5 లక్షల ఆదాయం పొందుతూ ఉన్నారా? అయితే మీపై ఆదాయం పన్నుశాఖ అధికారుల 'నిఘా' కళ్లు పడినట్లే. అవును ఇది నిజం. ప్రత్యక్ష పన్ను వసూళ్లతో రెవెన్యూ పెంచుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ యోచిస్తున్నది.

ఈ ఏడాది ప్రత్యక్ష పన్ను వసూళ్ల ద్వారా రూ.9.8 లక్షల కోట్ల ఆదాయం సంపాదించాలని ఆదాయం పన్ను శాఖ (ఐటీ) లక్ష్యం నిర్దేశించుకున్నది. తాము చేపట్టిన పన్ను పరిధి విస్తృతి చర్యలతో ఆ లక్ష్యానికి చేరుకోగలమని విశ్వాసంతో ఉన్నది.

అందుకు అనుగుణంగా వసూళ్లు పెంచుకోవడానికి అవసరమైన వ్యూహాలన్నీ ఐటీ శాఖ రూపొందిస్తున్నది. ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి అత్యధిక ఆదాయం పొందుతూ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయని వేల మందిపై ఐటీ అధికారులు దృష్టి సారించారు. వృద్ధులతోపాటు పలువురు ఫిక్స్‌డ్ డిపాజిట్లపైనే రూ.5 లక్షలు, అంతకు మించి ఆదాయం పొందుతున్నా.. వాటిని ఐటీ రిటర్న్స్‌లో కలుపడం లేదని గుర్తించామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) అధికారులు తెలిపారు.

ఎఫ్డీ ఆదాయం వివరాలివ్వకుండా ఐటీ రిటర్న్స్

ఎఫ్డీ ఆదాయం వివరాలివ్వకుండా ఐటీ రిటర్న్స్

పన్ను వసూళ్ల పునాదిని విస్తృత స్థాయిలో విస్తరించాలన్న ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం.. వివిధ రంగాల నిపుణులపైనా దృష్టి పెట్టింది. నగదు రూపంలో ఫీజు తీసుకుంటూ విలాస జీవితం గడిపే నిపుణులు తమకు వచ్చే ఆదాయం వివరాలు సరిగ్గా వెల్లడించకపోవడం అనుచితమని సీనియర్ ఐటీ అధికారి ఒకరు తెలిపారు.

భారీగా చేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి వచ్చే ఆదాయం వివరాలను తమ ఐటీ రిటర్న్స్‌ల్లో చేర్చకుండా పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారని వివిధ సంస్థల నుంచి సమాచారం తమకు లభించిందని ఐటీ శాఖ చెబుతున్నది.

ట్యాక్స్ డిడక్షన్ సోర్స్ (టీడీఎస్) కింద బ్యాంకుల్లో పౌరులు చేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల వివరాలను పరిశీలిస్తే పలు కేసుల్లో 10% పన్ను చెల్లిస్తున్నా వారు వాస్తవంగా 30% చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఉదాహరణకు వైద్యులు తరుచుగా తమ వద్దకొచ్చే రోగులు.. ప్రత్యేకించి వర్షాకాలంలో చికున్‌గున్యా, డెంగ్యూ వ్యాధిగ్రస్తుల నుంచి భారీగా ఫీజులు వసూలుచేసినట్లు ఈ ఏడాది తాము జరిపిన దాడుల్లో తేలిందని ఐటీ అధికారులు చెప్తున్నారు. మా దృష్టంతా భారీగా పన్ను ఎగవేతకు పాల్పడుతున్న వారిపైనే అని ఐటీ శాఖ అధికారి అన్నారు.

19.5 శాతం పన్నువసూళ్ల పెరుగుదలపై అంచనా

19.5 శాతం పన్నువసూళ్ల పెరుగుదలపై అంచనా

రిటర్న్స్ ఫైల్స్ చేసిన వారిలో కోటి మంది లక్ష్యంగా పలువురికి ఎస్సెమ్మెస్‌లు పంపామని తెలిపారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లతో వడ్డీ రూపంలో భారీగా ఆదా యం పొందుతున్నా ఐటీ రిటర్న్స్‌లో చేర్చకుండా పన్ను ఎగవేతకు పాల్పడుతున్న వారిపై దర్యాప్తు చేస్తామని ఐటీ శాఖ చెబుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 19.1% వృద్ధి సాధించామని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. రీఫండ్స్ మినహాయిస్తే తొలి త్రైమాసికంలో రూ.1.90 లక్షల కోట్ల మేరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు జరిగాయని ఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది ప్రత్యక్ష పన్ను వసూళ్ల అంచనాలు 19.5 శాతం దాటుతాయని భావిస్తున్నారు. గతేడాది 2.27 కోట్ల ఐటీ రిటర్న్స్ దాఖలైతే ఈ ఏడాది 2.83 కోట్లకు చేరుకున్నది. గత ఏడాది నవంబర్ ఎనిమిదో తేదీన రూ.1000, రూ.500 నోట్లను రద్దుచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్లే ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారి సంఖ్య పెరిగిందని ప్రభుత్వం భావిస్తున్నది.

సవివరంగా ఆస్తి కొనుగోళ్ల లావాదేవీల తనిఖీలు

సవివరంగా ఆస్తి కొనుగోళ్ల లావాదేవీల తనిఖీలు

ఈ ఏడాది ప్రారంభంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత భారీమొత్తంలో నగదు డిపాజిట్లు చేసిన 5.56 లక్షల మందిపై ఐటీ శాఖ ద్రుష్టి సారిస్తున్నది. వీటికి అదనంగా 60 వేల మంది లావాదేవీలను గుర్తించింది. ఆపరేషన్ క్లీన్ మనీ ఫేజ్ - 2 ద్వారా బ్యాంకుల్లో డిపాజిట్లతోపాటు వివిధ పెట్టుబడి మార్గాల్లో నగదు పెట్టిన వ్యక్తులపై దర్యాప్తు చేపడుతుంది. బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, బీమా సంస్థల ద్వారా బ్యాంకుల్లో పెట్టుబడులు సాగిస్తున్న ప్రత్యేక ఆర్థిక లావాదేవీలపై ద్రుష్టి సారించాయి. భారీ మొత్తంలో బ్యాంకుల్లో డిపాజిట్లు చేసిన వారిని వివరణ ఇవ్వాలని ఇప్పటికే ఐటీ శాఖ నోటీసులు జారీచేసింది.

అత్యున్నత స్థాయిలో ఆస్తుల కొనుగోళ్ల కోసం ఆరువేలకు పైగా లావాదేవీలు సాగించిన వారు.. 6,600 కేసుల్లో చెల్లింపులు జరిపిన వారిపై సవివరమైన దర్యాప్తు చేపట్టారు. రూ. 5 లక్షలకు పైగా లావాదేవీలు జరిపిన వారిపై మలి దశలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు, ఏప్రిల్ నెలలో రూ.10 లక్షలకు పైగా డిపాజిట్లు జరిపిన వారిపై దాడులు చేస్తామని ఐటీ శాఖ అధికారులు తెలిపారు. బ్యాంకుల్లోని నగదు లావాదేవీలపై తొలి దశలో ‘ఈ- తనిఖీ' ద్వారా చేపడతారు. 17.92 లక్షల మంది దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్‌కు, వారి ఆదాయానికి పొంతన కుదరడం లేదన్నారు.

 ఐటీ రిటర్న్స్‌లో పేర్కొనకున్నా వివరాలు తెలియజేయొచ్చు ఇలా..

ఐటీ రిటర్న్స్‌లో పేర్కొనకున్నా వివరాలు తెలియజేయొచ్చు ఇలా..

కేంద్ర ప్రభుత్వం విద్యారంగం, ఆరోగ్య పరిరక్షణ, రక్షణ, మౌలిక వసతులు, పేదలకు ఇళ్లు తదితర రంగాల్లో కార్యక్రమాలు చేపట్టేందుకు భారీగా నిధులు అవసరం. ఈ నేపథ్యంలో భారీ మొత్తంలో నిధులు సాధించేందుకు కొన్ని చర్యలు అవసరం కనుకే వాటి సేకరణ దిశగా ఐటీ శాఖ ద్వారా ద్రుష్టి సారిస్తున్నది. గ్రాంట్ థోర్నంటన్ ఇండియా భాగస్వామి వికాస్ వాసల్ మాట్లాడుతూ పన్ను బకాయిలు ఉన్నవారు చట్టాలకు లోబడి బయలకు రావాలని ప్రభుత్వం ప్రోత్సాహాలు కల్పించిందన్నారు.

అందుకు అనుగుణంగా ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌లో తేడా ఉన్న వారిపై ద్రుష్టి పెట్టిందన్నారు. అందులో భాగంగా సేవింగ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ద్రుష్టి పెట్టింది. అంతే కాదు సరిగ్గా వివరాలు పేర్కొనని వారిని సరైన దిశలో ప్రయాణించాలని ప్రోత్సహిస్తున్నది. ఒకవేళ రూ.5 లక్షల వడ్డీ ఆదాయం వివరాలు పొరపాటున ఐటీ రిటర్న్స్ లో తెలియజేయకున్నా వాటి వివరాలను తప్పనిసరిగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా అందజేయాలని సూచిస్తోంది ఐటీ శాఖ. బ్యాంకు ఖాతాల వివరాలను కూడా సక్రమంగా తెలియజేయాలని పేర్కొంటున్నది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The income-tax department is reportedly focusing on individuals who earn high interest from fixed deposits but do not include this income earned in taxable income while filing returns. I-T is chasing those with interest income of Rs 5 lakh or more but do not mention it in tax returns. Information is being obtained from banks as they deduct tax at source (TDS) on FDs. In some cases, despite falling in the 30% bracket, individuals are paying only 10% tax.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more