చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్నేహితులతో కలిసి ఫిన్లాండ్ లో బయటకు వెళ్లిన టెక్కీ, బీచ్ లో శవమై కనిపించాడు !

చెన్నైకి చెందిన హరిసుతన్ (26) అనే సాఫ్ట్ వేర్ ఇంజనీరు ఫిన్లాండ్ లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన హరిసుతన్ గత కొన్ని రోజులుగా మాయం అయ్యాడు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: చెన్నైకి చెందిన హరిసుతన్ (26) అనే సాఫ్ట్ వేర్ ఇంజనీరు ఫిన్లాండ్ లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన హరిసుతన్ గత కొన్ని రోజులుగా మాయం అయ్యాడు. స్థానిక పోలీసులు అతని కోసం గాలించగా సముంద్ర తీరంలో శవమై కనిపించాడు.

ఫిన్లాండ్ లోని టీసీఎస్ కంపెనీలో గత సంవత్సరం నుంచి హరిసుతన్ సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. ఈనెల 8వ తేదీ స్నేహితులతో కలసి బయటకు వెళ్లాడు. చాలా రోజులు అయినా హరిసుతన్ నివాసం ఉంటున్న ఇంటికి చేరుకోలేదు. కార్యాలాయానికి వెళ్లకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది.

TCS Chennai techie missing in Finland found dead

చెన్నైలోని హరిసుతన్ కుటుంబ సభ్యులు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, ఫిన్లాండ్ లోని భారత రాయబారి కార్యాలయం అధికారి వాణి రావ్ కు ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఫిన్లాండ్ లోని హెరిస్పారి బీచ్ లో హరిసుతన్ శవమై కనిపించాడు.

హరిసుతన్ ను ఎవరైనా హత్య చేశారా ? లేదా అతనే ప్రమాదవశాత్తు సముద్రంలో పడి మరణించాడా ? లేక ఆత్మహత్య చేసుకున్నాడా ? అని విచారణ చేస్తున్నామని స్థానిక పోలీసులు తెలిపారు. హరిసుతన్ మరణించాడని ఫిన్లాండ్ లోని భారత రాయభారి కార్యాలయం అధికారి వాణి రావ్ దృవీకరించారు.

English summary
Hari Sudhan, the 26-year-old Chennai techie who went missing in Helsinki on September 8 was found dead in the sea on Thursday by local police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X