వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: టిసిఎస్ కార్యాలయం మూసివేత, 2వేల మంది టెక్కీల ఆందోళన

దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని తన కార్యాలయాన్ని మూసివేయనుంది. లక్నోలోని తన కార్యాలయాన్ని మూసివేసేందుకు సన్నాహాలు చేస్తోందని నివేదికలు రావడంతో ఉద్యోగులు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో: దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని తన కార్యాలయాన్ని మూసివేయనుంది. లక్నోలోని తన కార్యాలయాన్ని మూసివేసేందుకు సన్నాహాలు చేస్తోందని నివేదికలు రావడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

షాక్: ఉద్యోగ భద్రత లేదని తెలుగు టెక్కీ దుర్గాప్రసాద్ ఆత్మహత్యషాక్: ఉద్యోగ భద్రత లేదని తెలుగు టెక్కీ దుర్గాప్రసాద్ ఆత్మహత్య

ఈ ఏడాది చివరినాటికి లక్నో కార్యాలయాన్ని నోయిడాకు తరలించేందుకు టీసిఎస్ ప్రయత్నాలను చేస్తోందని సమాచారం. ఈ మేరకు లీడర్ల ద్వారా తమకు సమాచారం అందిందని లక్నో ఉద్యోగులు బుదవారంనాడు ఆరోపించారు.

 TCS Lucknow to shut down, crisis on 2,000 IT professionals

లక్నో కార్యాలయాన్ని మూసివేస్తారనే ప్రచారంతో ఇక్కడ పనిచేస్తున్న 2వేల మంది ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఇక్కడ పనిచేసే ఉద్యోగుల్లో 50 శాతం మహిళలే ఉన్నారు. అయితే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఉద్యోగులు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ను కోరారు.

అంతేకాదు ప్రధానమంత్రి మోడీ, కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్, ఉత్తర్‌ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దినేష్‌శర్మలకు లేఖలు రాశారు.

అయితే లక్నో కార్యాలయాన్ని మూసివేతపై వస్తున్న నివేదికలపై టిసిఎస్ ధృవీకరించింది. తక్కువమంది ఉద్యోగులు, మెరుగ్గాలేని వ్యాపారం కారణంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్టు టీసిఎస్ ప్రకటించింది.

అయితే లక్నోలో పనిచేస్తున్న ఉద్యోగులను తీసివేయడం లేదని ఆ సంస్థ ప్రకటించింది. ఈ ఉద్యోగులను నోయిడా, వారణాసికి మార్చుతున్నట్టు ప్రకటించింది.

ఇక్కడ వెయ్యిమంది కంటే ఉద్యోగులను కలిగి ఉండడంతో క్లయింట్ సేవలకు అనుకూలంగా లేదని భావించామని ఆ కంపెనీ ప్రకటించింది. అలాగే యూపిలో ఆపరేషన్లను పటిష్టం చేసేందుకు చూస్తున్నామని టీసీఎస్ ప్రకటించింది.

English summary
TCS is preparing to bid farewell to Lucknow as the staff members on Wednesday claimed they were informed by their team leaders that the company is wrapping up the work at the centre.At least 2,000 employees will be affected by this shift where 50 percent are women.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X